Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ధోనీ స్పూర్తితోనే ఆసియాకప్ 2022 గెలిచాం: డసన్ షనక

Dasun Shanaka says how MS Dhonis CSK of IPL 2021 inspired Sri Lankas Asia Cup final win

దుబాయ్: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ స్పూర్తి‌తోనే ఆసియాకప్ 2022 టైటిల్ గెలిచామని శ్రీలంక కెప్టెన్ డసన్ షనక తెలిపాడు. ఆదివారం పాకిస్థాన్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో శ్రీలంక 23 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఏ మాత్రం అంచనాలు లేకుండా ఈ టోర్నీ బరిలోకి దిగిన లంక అసాధారణ ప్రదర్శనతో టైటిల్ గెలిచి యావత్ క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. టైటిల్ గెలిచే ముందు దుబాయ్ మైదానంలోని టాస్ సెంటిమెంట్‌ను లంక జయించింది. కీలక ఫైనల్లో టాస్ ఓడినా.. అద్భుత ఆటతీరుతో విజేతగా నిలిచింది.

ఐపీఎల్ 2021ఫైనల్లో..

ఐపీఎల్ 2021ఫైనల్లో..

అయితే ఐపీఎల్ ఫ్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్‌ను స్పూర్తిగా తీసుకొని ఈ విజయం సాధించామని డసన్ షనక తెలిపాడు. విజాయంతరం మాట్లాడుతూ.. ఐపీఎల్ 2022 సీజన్‌ ఫైనల్లో ఇదే మైదానం వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన ఫైనల్లో చెన్నై తొలుత బ్యాటింగ్ చేసి విజయం సాధించిందని చెప్పాడు. పాక్‌తో మ్యాచ్‌కు ముందు ఇదే విషయం తన మదిలోకి వచ్చిందని, చెన్నై టాస్ ఓడి గెలిచిన తీరును తమ ఆటగాళ్లతో చర్చించానని చెప్పాడు.

టాస్ గెలిచిన జట్లదే విజయం..

టాస్ గెలిచిన జట్లదే విజయం..

అయితే షనక ఈ విషయాన్ని ప్రత్యేకంగా చెప్పడానికి ఓ కారణం ఉంది. ఆసియా కప్‌ 2022 టోర్నీ ఫైనల్‌కు ముందు జరిగిన 11 మ్యాచ్‌ల్లో మూడు సార్లు మాత్రమే తొలుత బ్యాటింగ్‌ చేసిన జట్లు గెలిచాయి. అవి స్కాట్లాండ్, హంకాంగ్, అఫ్గాన్ వంటి చిన్న జట్లపైనే విజయాలు దక్కాయి. మిగిలిన అన్ని మ్యాచ్‌ల్లో తొలుత బ్యాటింగ్‌ చేసిన జట్టు ఓటమి పాలైంది. రోహిత్ శర్మ వరుసగా మూడు మ్యాచుల్లో టాస్ ఓడిపోవడం, భారత జట్టుపై తీవ్రంగా ప్రభావం చూపింది. హంగ్‌కాంగ్‌తో మ్యాచ్‌లో విజయం అందుకున్న టీమిండియా... ఆ తర్వాత పాకిస్తాన్, శ్రీలంకతో మ్యాచుల్లో ఓడింది.

భారీ లక్ష్యాలను కాపాడుకోలేక..

భారీ లక్ష్యాలను కాపాడుకోలేక..

పాకిస్తాన్‌పై 180+, శ్రీలంకపై 170+ స్కోరు చేసినా దాన్ని కాపాడుకోలేకపోయింది భారత జట్టు.టాస్ వల్లే ఆసియా కప్ 2022 టోర్నీలో ఓడిపోయామని స్వయంగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆవేదన వ్యక్తం చేశాడు. పాకిస్తాన్, శ్రీలంక మధ్య సూపర్ 4 మ్యాచ్‌లోనూ టాస్ ప్రభావం కనిపించింది. పాకిస్తాన్‌ని స్వల్ప స్కోరుకే పరిమితం చేసిన శ్రీలంక, ఆ లక్ష్యాన్ని 17 ఓవర్లలో ఊదిపారేసింది. ఫైనల్ మ్యాచ్‌లో పాకిస్తాన్ టాస్ గెలవడంతో ఇక వాళ్లదే ఆసియా కప్ టైటిల్ అనుకున్నారంతా. అయితే లంక జట్టు అద్భుతమే చేసింది...

ధోనీ స్పూర్తితోనే..

ధోనీ స్పూర్తితోనే..

మ్యాచ్ అనంతరం టాస్ విషయాన్ని హోస్ట్ ప్రస్తావించగా.. షనక ధోనీ స్పూర్తితోనే విజయాన్నందుకున్నామని తెలిపాడు. 'టాస్ ఓడిపోవడంతో పాకిస్థాన్‌కు ఎక్కువ అవకాశాలు ఉన్నాయని తెలుసు. అయితే ఐపీఎల్ 2021 ఫైనల్లో ఇక్కడే సీఎస్‌కే, కేకేఆర్‌ని డిఫెండ్ చేస్తూ విజయం అందుకుంది. టాస్ ఓడిపోయిన తర్వాత నేను, టీమ్ ప్లేయర్లతో ఇదే విషయం చెప్పా. సీఎస్‌కే చేసిందే, మనమూ చేయాలని వివరించా... అదే చేయడం ఆనందంగా ఉంది.'అని షనక చెప్పుకొచ్చాడు.

Story first published: Monday, September 12, 2022, 15:18 [IST]
Other articles published on Sep 12, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+