వైభవ్ సూర్యవంశీ.. వెళ్లి గల్లీ క్రికెట్ ఆడుకో: మాజీ క్రికెటర్ సలహా!
టీమిండియా టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీకి సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ డారిల్ కల్లినన్ విలువైన సలహా ఇచ్చాడు. అంతర్జాతీయ క్రికెట్‌పై ఫోకస్ పెట్టకుండా తన బాల్యాన్ని ఆస్వాదించమని సూచించాడు. హాయిగా గల్లీ క్రికెట్ ఆడుకుంటూ.. చదువుపై దృష్టిపెట్టాలని హితవుపలికాడు.
సౌతాఫ్రికా తరఫున 70 టెస్ట్‌లు, 138 వన్డేలు ఆడిన డారిల్ కల్లినన్.. క్రిక్‌ఇన్‌ఫో వెబ్‌సైట్‌కు రాసిన కాలమ్‌లో ఈ వ్యాఖ్యలు చేశాడు. 'వైభవ్ సూర్యవంశీలో మనం చూసేది కేవలం ప్రతిభ మాత్రమే కాదు. 15 ఏళ్ల బాలుడు భారత క్రికెట్ ముఖచిత్రంగా.. ఐపీఎల్ వాణిజ్య, సోషల్ మీడియాకు కేంద్రంగా నిలిచాడు. క్రికెట్ ప్రపంచం ఇంతకుముందెన్నడూ ఇలాంటి వాతావరణాన్ని చూడలేదు.

సోషల్ మీడియా నేటి పిల్లలకు, కోట్లాది మంది ప్రజల అభిప్రాయాలకు మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించింది. ఈ క్రమంలోనే వైభవ్ సూర్యవంశీ ప్రతి కదలికను నిశితంగా పరిశీలిస్తారు. విమర్శిస్తారు. కాబట్టి వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉండి చదవుపై ఫోకస్ పెట్టాలి.
స్నేహితులతో కలిసి గల్లీ క్రికెట్ ఆడుతూ తన బాల్యాన్ని ఆస్వాదించాలి. సచిన్ టెండూల్కర్ చిన్న వయసులోనే అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసినప్పుడు.. అతనికి బాధ్యతాయుతమైన వ్యక్తులు మార్గనిర్దేశం చేశారు. కానీ నేడు ఆ పరిస్థితి లేదు.
చిన్న వయసులోనే అంతర్జాతీయంగా ఎంతో గుర్తింపు పొందిన చాలా మంది ఆటగాళ్ల జీవితాలు తలకిందులయ్యాయి. వైభవ్ సూర్యవంశీ తన భవిష్యత్తుకు మార్గదర్శనం కోసం సచిన్ టెండూల్కర్‌ను సంప్రదించాలి. సచిన్ కంటే గొప్ప మెంటార్ వైభవ్‌కు దొరకడు.'అని డారిల్ కల్లినన్ తన కాలమ్‌లో రాసుకొచ్చాడు.
ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ అరంగేట్రం కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ క్రమంలో డారిల్ కల్లినన్ ఇచ్చిన సలహా క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఐర్లాండ్‌తో రెండు టీ20ల సిరీస్‌లోనూ వైభవ్ సూర్యవంశీ బెంచ్‌కే పరిమితమయ్యాడు. మరో రెండు మ్యాచ్‌ల వరకు అతన్ని బెంచ్‌పైనే కూర్చోబెట్టే అవకాశాలు ఉన్నాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

