స్టన్నింగ్ క్యాచ్
నేపియర్ వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన మూడో టీ20లో న్యూజిలాండ్ ఫీల్డర్ డారెల్ మిచెల్ ఓ స్టన్నింగ్ క్యాచ్ పట్టి ఔరా అనిపించాడు. పాక్ ఇన్నింగ్స్‌లో సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్‌గా మిచెల్ వచ్చాడు. పాక్ ఓపెనర్లు హైదర్ అలీ, రిజ్వాన్ ఐదు ఓవర్లలోనే 38 పరుగులతో జట్టుకు శుభారంభాన్నందించారు. కివీస్ పేసర్ స్కాట్ కుగెలీన్ వేసిన పవర్‌ప్లే ఆఖరి ఓవర్‌లో అలీ బ్యాట్‌కు ఎడ్జ్ అయిన బంతి.. గాల్లో లేచింది. సర్కిల్‌లో ఉన్న డారెల్ పరుగెత్తుకుంటూ ముందుకు వెళ్లి.. గాల్లో డైవ్ చేసి ఒంటి చేత్తో బంతిని అందుకున్నాడు. ఇంకేముంది అలీ నిరాశగా పెవిలియన్ చేరాడు.

సబ్‌స్టిట్యూట్‌గా వచ్చి
ఓపెనర్ మార్టిన్ గప్తిల్ గాయంతో మైదానాన్ని వీడటంతో డారెల్ మిచెల్ సబ్‌స్టిట్యూట్‌గా వచ్చాడు. మిచెల్ ఫీల్డింగ్ విన్యాసం మ్యాచ్‌లో హైలెట్‌గా నిలిచింది. దీనికి సంబందించిన వీడియోను స్పార్క్ స్పోర్ట్స్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. 'సమ్మర్‌లో అద్భుత క్యాచ్ ఇదేనా?' అనే కాప్షన్ పెట్టింది. ఈ వీడియో చూసిన ఫాన్స్ 'స్టన్నింగ్ డైవ్ క్యాచ్' అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. 'వాట్ ఏ క్యాచ్', 'సూపర్ ఫీల్డింగ్' అంటూ వీడియోకు కామెంట్లు వస్తున్నాయి. ఈ క్యాచ్ వీడియోను మీరూ చూడండి.

ఓదార్పు విజయం
న్యూజిలాండ్‌తో మూడు టీ20ల సిరీస్‌ను ఇప్పటికే 0-2తో కోల్పోయిన పాకిస్థాన్ చివరి మ్యాచ్‌లో ఓదార్పు విజయాన్ని అందుకుంది. మంగళవారం జరిగిన పోరులో పాక్ 4 వికెట్ల తేడాతో కివీస్‌ను ఓడించింది. మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 173 పరుగులు సాధించింది. కాన్వే (63; 45 బంతుల్లో 7×4, 1×6) టాప్ స్కోరర్. 58 పరుగులకే 3 వికెట్లు కోల్పోయినా.. ఫిలిప్స్ (31)తో కలిసి కాన్వే జట్టుకు మెరుగైన స్కోరు అందించాడు. పాక్ బౌలర్లలో ఫహీమ్ (3/20), రవూఫ్ (2/44), అఫ్రిది (2/43) రాణించారు. రిజ్వాన్ (89; 59 బంతుల్లో 10×4, 3×6) మెరుపులతో పాక్ 19.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. హఫీజ్ (41) రాణించాడు.
ఆరు వారాలు క్రికెట్‌కి దూరంగా మహ్మద్ షమీ.. ఇంగ్లండ్‌తో తొలి టెస్టుకూ డౌటే!!


Click it and Unblock the Notifications












