Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆరు వారాలు క్రికెట్‌కి దూరంగా మహ్మద్ షమీ.. ఇంగ్లండ్‌తో తొలి టెస్టుకూ డౌటే!!

Mohammed Shami doubtful for first England Test
Ind vs Aus 2020 : Mohammed Shami Out For Six Weeks, Doubtful For First England Test

మెల్‌బోర్న్‌: టీమిండియా సీనియర్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ ఆరు వారాల పాటు క్రికెట్‌కి దూరంగా ఉండబోతున్నాడు. ఆస్ట్రేలియాతో అడిలైడ్ వేదికగా జరిగిన డే/నైట్ టెస్టు మ్యాచ్‌లో రెండో ఇన్నింగ్స్ సందర్భంగా బ్యాటింగ్ చేస్తుండగా.. అతని మోచేతికి గాయమైంది. ఫాస్ట్ బౌలర్ పాట్ కమిన్స్ విసిరిన బంతి షమీ మణికట్టుకి బలంగా తాకడంతో .. అతని గాయమైంది. స్కానింగ్‌లో అతడి మణికట్టు విరిగినట్లు తేలింది. దాంతో కనీసం ఆరు వారాల పాటు షమీకి విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించినట్లు బీసీసీఐ పేర్కొంది.

ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ నుంచి వైదొలిగి ఇప్పటికే భారత్‌కి బయల్దేరిన మహ్మద్ షమీ మణికట్టుకి ప్లాస్టర్‌తో కనిపించాడు. మంగళవామే షమీ ఇండియా బయలుదేరాడు. గాయం తగ్గి ఆ ప్లాస్టర్‌ని తీసివేసిన తర్వాత బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ)కి షమీ వెళ్తాడని బీసీసీఐ తెలిపింది. 'షమీ కోలుకోవడానికి ఆరు వారాలు పడుతుంది. ప్లాస్టర్‌ తీసేశాక పునరావాసం కోసం ఎన్‌సీఏకు వెళతాడు' అని ఓ బీసీసీఐ అధికారి చెప్పాడు.

మహ్మద్ షమీ ఫిట్‌నెస్ సాధించిన తర్వాతే మళ్లీ భారత్ జట్టులోకి రీఎంట్రీ ఇవ్వనున్నాడు. ఆరు వారాల పాటు విశ్రాంతి, ఫిట్‌నెస్ సాధించే ప్రక్రియ ఉండడంతో ఇంగ్లండ్‌తో ఫిబ్రవరి 5న చెన్నై వేదికగా జరగనున్న తొలి టెస్టులో షమీ ఆడటం అనుమానంగా కనిపిస్తోంది. సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో భారత్‌ నాలుగు టెస్టులు ఆడనుంది. ఫిబ్రవరి 5న చెన్నైలో తొలి టెస్టు జరుగుతుంది. ఆపై ఐదు టీ20లు, మూడు వన్డేల సిరీస్‌ ఆడనున్నాయి. షెడ్యూల్ ప్రకారం మార్చి 28 వరకూ ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి.

తొలి టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో మహ్మద్‌ షమీ రిటైర్డ్‌ ఔట్‌గా వెనుదిరగడం ఒక ఆసక్తికర చర్చకు తెరలేపింది. సాధారణంగా క్రికెట్‌లో 'రిటైర్డ్‌ హర్ట్' అనే పదం ఎక్కువగా వినిపిస్తుంది. బ్యాటింగ్‌ సమయంలో ఎవరైనా బ్యాట్స్‌మన్‌ గాయపడినా లేక అనారోగ్య కారణాలు ఉంటే.. అంపైర్‌ అనుమతితో ఇన్నింగ్స్‌కు బ్రేక్‌ తీసుకునే అవకాశం ఉంటుంది. అయితే రిటైర్డ్‌ ఔట్ మాత్రం దీనికి పూర్తిగా విరుద్దం. ఒక బ్యాట్స్‌మన్‌ అంపైర్‌ అనుమతి లేకుండా.. తన సొంతంగా నిర్ణయం తీసుకొని ఇన్నింగ్స్‌ కొనసాగించకుండా బయటికే వెళ్లిపోవడాన్ని రిటైర్డ్‌ ఔట్‌గా పరిగణిస్తారు. రిటైర్డ్‌ ఔట్‌గా ఎవరైనా బ్యాట్స్‌మన్‌ బయటికి వెళ్లిపోతే మళ్లీ ఆడేందుకు అనుమతించరు. షమీ ఇలానే వెళ్ళిపోయాడు.

Story first published: Wednesday, December 23, 2020, 11:34 [IST]
Other articles published on Dec 23, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+