Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ICC ODI rankings: చేజారిన కోహ్లీ టాప్ ర్యాంక్.. టాప్‌ ప్లేస్ ఎవరిదంటే.?

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అగ్రస్థానాన్ని కోల్పోయాడు. ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్‌లో న్యూజిలాండ్ బ్యాటర్ డారిల్ మిచెల్.. విరాట్ కోహ్లీని వెనక్కినెట్టి నెంబర్ వన్ ర్యాంక్ అందుకున్నాడు. అతని ఖాతాలో 845 పాయింట్స్ ఉండగా.. విరాట్ కోహ్లీ 795 రేటింగ్ పాయింట్స్‌తో రెండో స్థానంలో నిలిచాడు. ఇటీవల భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో డారిల్ మిచెల్(84, 131*, 137) రెండు శతకాలు, ఓ హాఫ్ సెంచరీతో రాణించిన సంగతి తెలిసిందే.

మూడు మ్యాచ్‌ల్లో 176 యావరేజ్‌తో 352 పరుగులు చేశాడు. అతని అసాధారణ ప్రదర్శనతో 38 ఏళ్ల తర్వాత న్యూజిలాండ్ భారత గడ్డపై వన్డే సిరీస్ గెలిచింది. ఈ సిరీస్‌లో కోహ్లీ ఓ సెంచరీ(124)తో పాటు (93) హాఫ్ సెంచరీతో రాణించాడు. రెండో వన్డేలో (24) విఫలమయ్యాడు. మొత్తం 80 యావరేజ్‌తో 240 పరుగులు చేశాడు.దాంతోనే టాప్ ర్యాంక్ కోల్పోయాడు. సుదీర్ఘ విరామం తర్వాత నెంబర్ వన్ ర్యాంక్ అందుకున్న కోహ్లీ.. రోజుల వ్యవధిలోనే అగ్రస్థానాన్ని కోల్పోయాడు.

Daryl Mitchell Overtakes Virat Kohli as New No 1 in ICC ODI Rankings

మరోవైపు ఈ సిరీస్‌లో దారుణంగా విఫలమైన రోహిత్ శర్మ మూడో స్థానం నుంచి నాలుగో స్థానానికి పడిపోయాడు. ప్రస్తుతం రోహిత్ శర్మ ఖాతాలో 757 రేటింగ్ పాయింట్స్ ఉన్నాయి. అఫ్గానిస్థాన్ బ్యాటర్ ఇబ్రహీం జడ్రాన్ 764 పాయింట్స్‌తో మూడో స్థానంలో నిలిచాడు. కేఎల్ రాహుల్(670 పాయింట్స్) పదో, శ్రేయస్ అయ్యర్(656)11వ స్థానాల్లో కొనసాగుతున్నారు.

ఐసీసీ టీ20 బ్యాంటింగ్ ర్యాంకింగ్స్‌లో అభిషేక్ శర్మ 908 పాయింట్లతో తొలి స్థానంలో ఉండగా.. తిలక్ వర్మ(805 పాయింట్స్) మూడో స్థానంలో ఉన్నాడు. టెస్ట్ ర్యాంకింగ్స్‌లో 880 పాయింట్లతో ఇంగ్లండ్ బ్యాటర్ జోరూట్ అగ్రస్థానంలో ఉండగా.. యశస్వి జైస్వాల్(750 పాయింట్లు) ఎనిమిదో, శుభ్‌మన్ గిల్(730 పాయింట్స్) పదో స్థానంలో ఉన్నారు. టెస్ట్ బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో బుమ్రా(879 పాయింట్స్) టాప్‌లో ఉండగా.. టీ20 బౌలింగ్ ర్యాంకుల్లో వరుణ్ చక్రవర్తీ అగ్రస్థానంలో ఉన్నాడు.

Story first published: Wednesday, January 21, 2026, 16:29 [IST]
Other articles published on Jan 21, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+