ENG vs NZ Semi Final T20 WC 2021: రివేంజ్ అదిరింది.. ఇంగ్లండ్‌పై న్యూజిలాండ్ గెలిచింది!

అబుదాబి: టీ20 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్ అద్భుత ప్రదర్శనతో ఫైనల్ చేరింది. ఇంగ్లండ్‌తో బుధవారం జరిగిన సెమీస్ -1లో సమష్టిగా రాణించిన కివీస్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో 2019 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఎదురైన పరాభావానికి బదులు తీర్చుకుంది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 166 పరుగులు చేసింది. మొయిన్ అలీ(37 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 51 నాటౌట్), డేవిడ్ మలాన్(30 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 41) రాణించారు. న్యూజిలాండ్ బౌలర్లలో ఆడమ్ మిల్నే, టీమ్ సౌథీ, ఇష్ సోధీ, జేమ్స్ నీషమ్ తలో వికెట్ తీశారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన న్యూజిలాండ్ 19 ఓవర్లలో 5 వికెట్లకు 167 పరుగులు చేసి 6 బంతులు మిగిలుండగానే సునాయస విజయాన్నందుకుంది. ఓపెనర్ డరిల్ మిచెల్(47 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 72 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో చెలరేగగా.. అతనికి అండగా డేవాన్ కాన్వే(38 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 46) రాణించాడు. ఈ ఇద్దరు మూడో వికెట్‌కు 82 పరుగుల జోడించారు. 13 పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును సమయోచిత బ్యాటింగ్‌తో విజయతీరాలకు చేర్చారు. చివర్లో జిమ్మీ నీషమ్(11 బంతుల్లో ఫోర్, 3 సిక్స్‌లతో 27) పవర్ హిట్టింగ్‌తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్, లివింగ్ స్టోన్ రెండేసి వికెట్లు తీయగా.. ఆదిల్ రషీద్ ఓ వికెట్ పడగొట్టాడు.

ఆరంభంలో తడబడినా..
160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌ను మార్టిన్ గప్టిల్(4) బౌండరీతో ప్రారంభించాడు. కానీ ఆ వెంటనే క్రిస్ వోక్స్ సూపర్ బాల్‌కు క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. దాంతో న్యూజిలాండ్ తీవ్ర ఒత్తిడికి గురైంది. రక్షణాత్మకంగా ఆడే ప్రయత్నం చేసింది. అయినా క్రిస్ వోక్స్ తన మరుసటి ఓవర్‌లో దెబ్బతీశాడు. కెప్టెన్ కేన్ విలియమ్సన్(5)ను క్యాచ్ ఔట్‌గా బోల్తాకొట్టించాడు. దాంతో 13 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన న్యూజిలాండ్ పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన డేవాన్ కాన్వే.. ఓపెనర్ డారిల్ మిచెల్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. ఈ ఇద్దరు ఇంగ్లండ్ బౌలర్లను గౌరవిస్తూ వీలు చిక్కిన బంతులను బౌండరీలకు తరలించారు. ఆదిల్ రషీద్ వేసిన 6వ ఓవర్‌లో కాన్వే రెండు బౌండరీలు బాదడంతో న్యూజిలాండ్ పవర్ ప్లేలో 2 వికెట్లకు 36 రన్స్ చేసింది.

ఆదుకున్న కాన్వే, మిచెల్
అనంతరం మరింత స్మార్ట్‌గా ఆడిన ఈ జోడీ క్విక్ సింగిల్స్, డబుల్స్‌తో స్ట్రైక్ రొటేట్ చేసింది. మార్క్ వుడ్ వేసిన 11వ ఓవర్‌లో మిచెల్ ఓ బౌండరీ బాదగా.. కాన్వే భారీ సిక్సర్ బాదాడు. ధాటిగా ఆడుతున్న ఈ జోడీని లివింగ్ స్టోన్ విడదీసాడు. హాఫ్ సెంచరీకి చేరువైన డేవాన్ కాన్వేను స్టంపౌట్‌గా పెవిలియన్ చేర్చాడు. దాంతో మూడో వికెట్‌కు నమోదైన 82 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ వెంటనే క్రీజులోకి వచ్చిన గ్లేన్ ఫిలిప్స్(2) తీవ్రంగా నిరాశపరిచాడు. లివింగ్ స్టోన్ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు.

చెలరేగిన నీషమ్..
అనంతరం క్రీజులోకి వచ్చిన జిమ్మీ నీషమ్ ధాటిగా ఆడాడు. జోర్డాన్ బౌలింగ్‌లో సిక్స్, ఫోర్, సిక్స్ బాదిన అతను మ్యాచ్ మూమెంటమ్‌ను న్యూజిలాండ్ వైపు మార్చాడు. ఇక ఆదిల్ రషీద్ వేసిన 18వ ఓవర్‌లో నీషమ్ ఓ సిక్స్ బాదగా.. మిచెల్ మరో సిక్స్ బాదాడు. దీంతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే ఆ ఓవర్‌లో నీషమ్ ఔటవ్వగా.. క్రీజులోకి వచ్చిన సాంట్నర్‌తో మిచెల్ చెలరేగాడు. వోక్స్ వేసిన 19వ ఓవర్‌లో రెండు భారీ సిక్స్‌లతో పాటు బౌండరీ బాది విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications