Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

జట్టులో దక్కని చోటు.. రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్!

Darren Bravo: వెస్టిండీస్ క్రికెట్ స్టార్ డారెన్ బ్రావో సంచలన నిర్ణయం తీసుకున్నాడు. తాజాగా ఇంగ్లండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌కు ఎంపిక చేసిన జట్టులో చోటు దక్కకపోవడంతో తీవ్ర ఆవేదనకు గురైన బ్రావో.. అంతర్జాతీయ కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. కేవలం ఫ్రాంచైజీ లీగ్స్ మాత్రమే ఆడుతానని స్పష్టం చేశాడు. తన నిర్ణయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు.

కనీస సమాచారం ఇవ్వకుండా ఇంగ్లండ్ పర్యటన నుంచి సెలెక్టర్లు వేటు వేసార, తనను ఒంటరివాడిని చేసారని బ్రావో ఆవేదన వ్యక్తం చేశాడు. 'ప్ర‌స్తుత పరిస్థితుల్లో ఆట‌లో కొన‌సాగాలంటే మ‌రింత శ‌క్తి కావాలి. అంత‌ర్జాతీయ క్రికెట్‌లో నా శ‌క్తిసామ‌ర్ధ్యం మేర‌కు రాణించేందుకు సమయం ప‌డుతుంది. మూడు ఫార్మాట్ల‌లో 40- 45 మంది ఆట‌గాళ్లు అవ‌స‌రం.

Darren Bravo announces his retirement from International cricket after being ignored by England series

కానీ, ఈ 45 మంది ఆటగాళ్లలో నేను లేక‌పోవ‌డం బాధాక‌రం. స్థానిక టోర్నీల్లో ప‌రుగులు సాధించినా సెలెక్ట‌ర్లు న‌న్ను ప‌క్క‌న పెట్టేశారు. అలాగ‌ని నేను ఆశ‌లు వ‌దిలేయ‌డం లేదు. ప్ర‌తిభావంతుడైన యువ‌కుడికి అవ‌కాశం క‌ల్పిస్తున్నా. ప్ర‌తి ఒక్క‌రికి ఆల్ ది బెస్ట్. నేను నా క‌ల‌ను నిజం చేసుకున్నాను' అని బ్రావో భావోద్వేగానికి గురయ్యాడు.

గత నాలుగేళ్లుగా డారెన్ బ్రావో నిల‌క‌డ‌గా రాణిస్తున్నాడు. ఇటీవలే సొంతగడ్డపై జ‌రిగిన సీజీ యూనైటెడ్ సూప‌ర్ 50 టోర్నీలో రెడ్ ఫోర్స్ జ‌ట్టు విజేత‌గా నిల‌వ‌డంలో బ్రావో కీలక పాత్ర పోషించాడు. ఈ టోర్నీలో అతను ఏకంగా 416 ర‌న్స్‌ చేసి ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా గోల్డెన్ బ్యాట్ అందుకున్నాడు. అయినా కూడా సెలెక్ట‌ర్లు అత‌నికి మొండిచేయి చూప‌డంతో బ్రావో తీవ్ర ఆవేదనకు గుర‌య్యాడు.

ఇంగ్లండ్ జ‌ట్టు వ‌న్డే, టీ20ల కోసం డిసెంబ‌ర్‌లో వెస్టిండీస్‌కు రానుంది. వన్డే సిరీస్‌ కోసం వెస్టిండీస్ సెలెక్టర్లు 15 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేశారు. హై హోప్ కెప్టెన్‌గా ప్రకటించారు. ఈ జట్టులో బ్రావోకు చోటు దక్కలేదు.

విండీస్ వ‌న్డే జట్టు : షై హోప్‌(కెప్టెన్), అల్జారీ జోసెఫ్(వైస్ కెప్టెన్), అలిక్ అథ‌న‌జె, య‌న్నిక్ క‌రియా, కేసీ కార్టీ, రోస్ట‌న్ ఛేజ్, షేన్ డౌరిచ్, మాథ్యూ ఫోర్డే, షిమ్ర‌న్ హెట్‌మైర్, బ్రాండ‌న్ కింగ్, గుడ‌కేశ్ మోటీ, జొర్న్ ఒట్లే, షెర్ఫ‌నే రూథ‌ర్‌ఫ‌ర్డ్, రొమ‌రియో షెఫ‌ర్డ్, ఒషానే థామ‌స్.

Story first published: Sunday, November 26, 2023, 13:19 [IST]
Other articles published on Nov 26, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+