Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Womens T20 World Cup 2026: ఇంగ్లండ్ శుభారంభం.. శ్రీలంకపై ఘన విజయం!

ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో ఆతిథ్య ఇంగ్లండ్ శుభారంభం చేసింది. గ్రూప్-2లో భాగంగా శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన ఇంగ్లండ్ 87 పరుగుల తేడాతో శ్రీలంక జట్టును చిత్తు చేసింది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో వికెట్ నష్టానికి 219 పరుగులు చేసింది. డాని వ్యాట్ హోడ్గే(62 బంతుల్లో 13 ఫోర్లు, సిక్స్‌తో 105 నాటౌట్) అజేయ శతకంతో చెలరేగగా.. నాట్ సివర్ బ్రంట్(22 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 46 నాటౌట్) విలువైన పరుగులు చేసింది. శ్రీలంక బౌలర్లలో మాలిక్ మదరా ఒక వికెట్ తీసింది.

Danni Wyatt-Hodge Record Ton Powers England to Historic Win Over Sri Lanka in T20 World Cup Opener

అనంతరం శ్రీలంక 20 ఓవర్లలో 132 పరుగులకే కుప్పకూలింది. నిలాషికా సిల్వా(33 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 39), హర్షితా సమరవిక్రమా(18 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 29) టాప్ స్కోరర్లుగా నిలవగా మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. ఫ్రేయా కెంప్(4/22) నాలుగు వికెట్లు తీయగా.. చార్లీ డీన్, సోఫీ ఎక్లీస్టోన్ రెండేసి వికెట్లు పడగొట్టారు. లారెన్ బెల్, లిన్సే స్మిత్ చెరో వికెట్ తీసారు.

టోర్నీ ఆరంభ మ్యాచే పూర్తిగా ఏకపక్షంగా సాగడం అభిమానులను తీవ్రంగా నిరాశపర్చింది. శ్రీలంక టీమ్ ఏ దశలోనూ ఇంగ్లండ్‌కు కనీస పోటీ ఇవ్వలేకపోయింది. ఈ టోర్నీలో భాగంగా నేడు సౌతాఫ్రికాతో ఆస్ట్రేలియా తలపడనుంది. మాంచెస్టర్ వేదికగా రాత్రి 7 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది.

Story first published: Saturday, June 13, 2026, 11:55 [IST]
Other articles published on Jun 13, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+