రోహిత్ శర్మను చులకన చేస్తావా? అతన్ని ఔట్ చేసే సీన్ నీకు లేదు.. పాక్ పేసర్‌పై డానిష్ కనేరియా ఫైర్!

కరాచీ: టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మను తక్కువ చేసి మాట్లాడిన పాకిస్థాన్ మాజీ పేసర్ మహ్మద్ అమీర్‌పై ఆ దేశ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా ఆగ్రహం వ్యక్తం చేశాడు. రోహిత్ శర్మ హైక్లాస్ బ్యాట్స్‌మన్ అని, అతను నీకంటే సీనియర్ అనే విషయం మర్చిపోవద్దంటూ చురకలంటించాడు. గతేడాది డిసెంబరులో పాకిస్థాన్ టీమ్ మేనేజ్‌మెంట్ తనని వేధిస్తోందని బాధపడిన
మహ్మద్ అమీర్.. అనూహ్యంగా 29 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం ఇంగ్లండ్‌లో ఉంటున్న అమీర్.. బ్రిటీష్ సిటిజన్‌షిప్ తీసుకుని ఐపీఎల్‌లో ఆడేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ క్రమంలో ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన అమీర్.. రోహిత్ శర్మని తాను సులువుగా ఔట్ చేస్తానంటూ చెప్పుకొచ్చాడు.

రోహిత్‌ను సులువుగా..
రోహిత్ కంటే కోహ్లీని ఔట్ చేయడమే చాలా కష్టమని, రోహిత్‌ను ఇన్‌స్వింగర్‌కు బోల్తా కొట్టించవచ్చని తెలిపాడు.'రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరికీ బౌలింగ్ చేయడం కష్టమేం కాదు. రోహిత్ శర్మకు బౌలింగ్ చేయడం చాలా సులువు. అతన్ని నేను రెండు విధాలుగా ఔట్ చేయగలను. లెప్ట్ హ్యాండ్ బౌలర్లు విసిరే ఇన్‌స్వింగర్‌కి రోహిత్ శర్మ తడబడతాడు.
అలానే ఆఫ్ స్టంప్‌కి వెలుపలగా వెళ్లే బంతులకీ అతను సులువుగా ఔటవుతాడు. ఒత్తిడిలో రాణిస్తాడు కాబట్టి కోహ్లీని ఔట్ చేయడం కాస్త కష్టమని చెప్పొచ్చు. అయితే విరాట్, రోహిత్‌కు బౌలింగ్ చేయడం నాకైతే కఠినంగా అనిపించదు'అని మహ్మద్ అమీర్ చెప్పుకొచ్చాడు. 2017 చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో మహ్మద్ అమీర్ వేసిన తొలి ఓవర్‌లోనే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు పెవిలియన్‌కు చేరిన విషయం తెలిసిందే.

నీకంత సీన్ లేదు..
ఇక రోహిత్ శర్మ గురించి మహ్మద్ అమీర్ చులకనగా మాట్లాడటంపై డానిష్ కనేరియా ఘాటుగా స్పందించాడు. రోహిత్‌ను ఔట్ చేసే సీన్ అమీర్‌కు లేదన్నాడు. 'వన్డేల్లో అత్యధిక డబుల్ సెంచరీలు బాదిన బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మ. అతను రన్ మెషిన్. పేసర్లతో పాటు స్పిన్నర్ల బౌలింగ్‌లోనూ అతను సమర్థంగా ఆడగలడు.
అలాంటి బ్యాట్స్‌మన్ గురించి వార్తల్లో నిలిచేందుకు చులకనగా మాట్లాడతావా అమీర్.? నువ్వు స్వింగ్‌తో పాటు పేస్‌ను కూడా గత రెండేళ్లుగా రాబట్టలేకపోతున్నావు. దాంతో పాక్ జట్టు నుంచి వేటుకి గురయ్యావు. అలాంటి నువ్వు రోహిత్ శర్మని రెండు విధాలుగా ఔట్ చేస్తానని చెప్తున్నావు. నాకేతై ఇది సమంజసంగా అనిపించడం లేదు. రోహిత్ శర్మ నీకంటే సీనియర్.. హైక్లాస్ బ్యాట్స్‌మెన్'అని కనేరియా చురకలంటించాడు.

స్పాట్ ఫిక్సింగ్‌తో..
2009లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి వచ్చిన మహ్మద్ అమీర్.. ఏడాదిలోనే పాక్ అత్యుత్తమ బౌలర్‌గా ఎదిగాడు. ఎన్నో అద్భుత విజయాలు అందించాడు. అయితే 2010లో ఇంగ్లండ్ పర్యటనలో స్ఫాట్ ఫిక్సింగ్‌కు పాల్పడి ఐదేళ్ల నిషేధం ఎదుర్కొన్నాడు. దాంతో అమీర్ కెరీర్ ముగిసిపోయిందని అంతా ఊహించారు.
కానీ 2015-2016లో మళ్లీ పాక్ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన అమీర్.. అగ్రశ్రేణి బౌలర్‌గా మారాడు. గత ఏడాది అనూహ్యంగా టెస్టులకి రిటైర్మెంట్ ప్రకటించడం ద్వారా పాకిస్థాన్ క్రికెట్ పెద్దలకి కోపం తెప్పించాడు. అప్పటి నుంచి పీసీబీ నుంచి కూడా అతనికి మొండిచేయి ఎదురవుతూ వచ్చింది. ఆపై అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ఇచ్చాడు. పాక్ తరఫున 36 టెస్టులాడిన అమీర్ 119 వికెట్లు పడగొట్టాడు. 61 వన్డేల్లో 81 వికెట్లు, 50 టీ20ల్లో 59 వికెట్లు తీశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications