షాహిద్ అఫ్రిది ఓ లత్కోర్.. హిందువునని నా కెరీర్ నాశనం చేశాడు: డానిష్ కనేరియా

కరాచీ: పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిదిపై ఆ దేశ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా నిప్పులు చెరిగాడు. షాహిద్ అఫ్రిది ఓ లత్కోరని, అబద్దాలకోరని ఘాటు వ్యాఖ్యలు చేశాడు. పాకిస్థాన్ జట్టు నుంచి తాను బహిష్కరణకు గురవ్వడంలో అఫ్రిది పాత్ర ఉందని ఆరోపించాడు. హిందువనని తాను అను నిత్యం ద్వేషించేవాడని చెప్పాడు. తాజాగా ఏఎన్‌ఐ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో షాహిద్ అఫ్రిదిపై కనేరియా ఆగ్రహం వ్యక్తం చేశాడు. అందరిని ప్రభావితం చేసే అఫ్రిది.. వ్యక్తిత్వం లేని మనిషని మండిపడ్డాడు.

హిందువునని ద్వేశించేవాడు..
'పాకిస్తాన్ జట్టుకు ఆడినంత కాలం షాహిద్ అఫ్రిది నన్ను హేళన చేసేవాడు. తోటి ఆటగాళ్ల ముందు అవమానపరుస్తూ మాట్లాడేవాడు. ఇద్దరం కలిసి చాలా ఏళ్లపాటు పాకిస్థాన్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాం. అతను కెప్టెన్‌గా ఉన్నప్పుడు నన్ను ఎక్కువగా బెంచ్‌కే పరిమితం చేసేవాడు.
అతని కారణంగా చాలా వన్డే మ్యాచ్‌లకు నేను దూరం కావాల్సి వచ్చింది. అంతేకాకుండా హిందవునైన నాకు పాకిస్థాన్‌లో చోటు లేదని.. జట్టు నుంచి బహిష్కరించాలని సహచరులకు నూరిపోసేవాడు.

అఫ్రిది ఓ లత్కోర్..
అఫ్రిది ఓ అబద్దాల కోరు, అందరిని ప్రభావితం చేసే వ్యక్తి.. ఇంకా చెప్పాలంటే వ్యక్తిత్వం లేని మనిషి. కానీ నేను అతన్ని పట్టించుకోకుండా క్రికెట్‌పైనే ఫోకస్ చేసేవాడిని. జట్టులో ఉన్నంతకాలం అతను ద్వేషించినా నేను భరించేవాడిని. నేనంటే ఎందుకంత అసూయ అనేది నాకు అర్థమయ్యేది కాదు. కానీ ఒక్కటి చెప్పగలను. పాకిస్థాన్ జట్టుకు ఆడటం నా అదృష్టంగా భావిస్తా.. నా జీవితంలో అది గొప్ప విషయం.

నిషేధం ఎత్తేయండి..
క్రికెట్‌లో ఫిక్సింగ్ చేసిన చాలా మంది బయట యథేచ్చగా తిరుగుతూ క్రికెట్ ఆడుతున్నారు. కానీ నాపై ఉన్న నిషేధాన్ని మాత్రం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ఎత్తేయలేదు. పాక్ తరఫున క్రికెట్ ఆడాను. ఎన్నో విజయాల్లో కీలక పాత్ర పోషించాను. నిషేధం తొలగిస్తే ప్రైవేట్ లీగ్‌ల్లో ఆడాలని ఉంది. ఎలాగూ అంతర్జాతీయ క్రికెట్ ఆడే అవకాశం పోయింది. పీసీబీని నేను అడిగేది ఇది ఒక్కటే.. నాపై ఉన్న నిషేధం ఎత్తేయండి.. నా పనేదో నేను చూసుకుంటా'అని డానిష్ కనేరియా పీసీబీకి రిక్వెస్ట్ చేశాడు.

స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో..
డానిష్ కనేరియా 2000 సంవత్సరం నవంబర్‌లో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. పాక్ తరపున 61 టెస్టుల్లో 261 వికెట్లు, 18 వన్డేల్లో 15 వికెట్లు పడగొట్టాడు. 2009లో ఇంగ్లీష్ కౌంటీ చాంపియన్‌షిప్ ప్రో లీగ్‌లో భాగంగా కనేరియా స్పాట్ ఫిక్సింగ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఫిక్సింగ్ ఆరోపణలు నిజమని తేలడంతో 2012లో ఇంగ్లీష్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు అతనిపై జీవితకాల నిషేధం విధించింది. ఈ నిర్ణయాన్ని పీసీబీ కూడా సమర్థించింది. అప్పటి నుంచి అతనిపై నిషేధం కొనసాగుతుండగా.. ఎత్తేయాలని ఎంత మొరపెట్టుకున్నా పీసీబీ కనికరించడం లేదు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications