న్యూజిలాండ్‌తో మూడు టెస్ట్‌ల సిరీస్‌లో తడబడుతున్న టీమిండియాకు పాకిస్థాన్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా పలు సూచనలు చేశాడు. ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా పలు మార్పులతో బరిలోకి దిగాలన్నాడు. కెప్టెన్ రోహిత్ శర్మ తన ఓపెనింగ్ స్లాట్‌ను యువ బ్యాటర్ శుభ్‌మన్ గిల్‌కు ఇచ్చేయాలని, ఫస్ట్ డౌన్‌లో బ్యాటింగ్ చేయాలని సూచించాడు.
స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్‌కు బదులు పేస్ ఆల్‌రౌండర్, తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డిని తుది జట్టులోకి తీసుకోవాలన్నాడు. తాజాగా తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా మాట్లాడిన డానిష్ కనేరియా.. టీమిండియాకు పలు సలహాలు ఇచ్చాడు.

'ప్రస్తుతం రోహిత్ శర్మ పేలవ ఫామ్‌తో సతమతమవుతున్నాడు. అతను గొప్ప ప్లేయర్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికే టీమిండియాకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించాడు. నా అభిప్రాయం ప్రకారం రోహిత్ శర్మ నెంబర్ 3లో బ్యాటింగ్ చేయాలి. యశస్వి జైస్వాల్‌తో కలిసి శుభ్‌మన్ గిల్ ఓపెనింగ్ చేయాలి. కొత్త బంతిని ఎదుర్కోవడంలో ఇబ్బంది పడుతున్న రోహిత్ శర్మకు ఈ మార్పు ఉపయోగపడుతోంది. కాస్త సమయం దొరకుతుంది. ఆస్ట్రేలియాలో బంతి స్వింగ్ అవ్వడంతో పాటు వేగంగా వస్తుంది. కాబట్టి ఈ సలహాను పరిగణలోకి తీసుకుంటారని భావిస్తున్నా.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో నితీష్ కుమార్ రెడ్డికి తొలి మ్యాచ్ నుంచే అవకాశం ఇవ్వాలి. కేఎల్ రాహుల్‌కు బదులు అతన్ని తుది జట్టులోకి తీసుకోవాలి. అతనో అద్భుతమైన ఆటగాడు. నితీష్ వేగంగా పరుగులు చేయడంతో పాటు మంచి ఫీల్డర్ కూడా. ప్రస్తుతం కేఎల్ రాహుల్ తీవ్ర ఒత్తిడిలో ఉన్నాడు. నితీష్‌ను జట్టులోకి తీసుకున్నారు కాబట్టి తొలి మ్యాచ్ నుంచే అవకాశం ఇస్తారని భావిస్తున్నా.'అని డానిష్ కనేరియా చెప్పుకొచ్చాడు.
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పేలవ ఫామ్‌తో బాధపడుతున్నాడు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడు టెస్ట్‌ల సిరీస్‌లో రోహిత్ దారుణంగా విఫలమయ్యాడు. నాలుగు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 62 పరుగులు చేశాడు. ఇందులో ఒక హాఫ్ సెంచరీ ఉంది. రోహిత్ వైఫల్యం కారణంగా న్యూజిలాండ్.. టీమిండియా గడ్డపై టెస్ట్ విజయం సాధించడమే కాకుండా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కైవసం చేసుకుంది.
మరోవైపు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి నితీష్ కుమార్ రెడ్డి ఎంపికయ్యాడు. తొలి టీమిండియా టెస్ట్ టీమ్ పిలుపును అందుకున్నాడు. ఇటీవలే బంగ్లాదేశ్‌తో జరిగిన టీ20 సిరీస్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగు పెట్టిన నితీష్.. అసాధారణ బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. పేస్ ఆల్‌రౌండర్ కావడంతో అతన్ని ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపిక చేశారు. ఈ సిరీస్‌లో అతను సత్తా చాటితే.. టీమిండియాలో చోటు ఖాయమవుతోంది.