Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నేను హిందువుననే నా విషయంలో పాక్ క్రికెట్ బోర్డు మొద్దు నిద్ర: కనేరియా

Danish Kaneria Says PCB is sleeping in my case as I am a proud Hindu

కరాచీ: లైఫ్‌టైమ్ నిషేధం ఎదుర్కొంటున్న పాకిస్థాన్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా మరోసారి ఆదేశ క్రికెట్ బోర్డు (పీసీబీ)పై విమర్శలు గుప్పించాడు. హిందువుననే పీసీబీ తన విషయంలో మొద్దు నిద్ర వహిస్తుందని ఘాటు వ్యాఖ్యలు చేశాడు.

ఇమ్రానే దిక్కు..

తన పరిస్థితి బాలేదని ఆదుకోవాలని గతంలో విజ్ఞప్తి చేసిన కనేరియా.. ఎంత మొరపెట్టుకున్న పీసీబీ పట్టించుకోవడం లేదని తాజాగా ట్విటర్ వేదికగా అసహనం వ్యక్తం చేశాడు. ఇక తాను ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సాయం కోరుతానని, అందరిని ఆదుకుంటున్న ఆయన తనకు కూడా ఓ మార్గం చూపుతాడని వరుస ట్వీట్లలో తెలిపాడు.

‘నేను హిందువునని నా విషయంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మొద్దు నిద్రవహిస్తోంది. హే భగవాన్ నాపై దయ చూపండి. పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ అభ్యర్థిస్తా. ఆయనే నాకు సాయం చేస్తాడని ఆశిస్తున్నా. ప్రతీ ఒక్కరికి మార్గం చూపుతున్న ఆయన నాకెందుకు సాయం చేయడు?'అంటూ కనేరియా ట్వీట్ చేశాడు.

కనీసం కోచింగ్‌కు కూడా పనికిరానా?

ఇక మరో ట్వీట్‌లో‘ ఓ పాకిస్థాన్ పౌరుడిగా నాకు పునరావసం కల్పించాలని పీసీబీని కోరుతాను. త్వరలో ఓ లేఖను కూడా రాస్తాను. వారెందుకు కాదంటారు? ఎలాగు ఆడేలను. కనీసం కోచింగ్‌కు కూడా పనికిరానా?'అని పేర్కొన్నాడు.

మామ అనిల్‌ దల్పాత్‌ తర్వాత

మామ అనిల్‌ దల్పాత్‌ తర్వాత

కనేరియా మామ అనిల్‌ దల్పాత్‌ తర్వాత పాకిస్థాన్ జట్టు తరపున ఆడిన రెండో హిందువుగా నిలిచాడు. 2000లో పాక్ తరుపున అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్ర చేసిన కనేరియా.. 61 టెస్టులు, 18 వన్డేలు ఆడి 276 వికెట్లు తీశాడు. పాకిస్థాన్ క్రికెట్‌‌లో కనేరియా ఓ బెస్ట్ స్పిన్నర్ అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

కానీ ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ ఎలాంటి కారణం లేకుండానే పీసీబీ కనేరియాను జట్టు నుంచి తప్పించింది. జట్టులో చోటు కోసం చాలా రోజులు నిరీక్షించిన కనేరియా.. అవకాశం దక్కకపోవడంతో కౌంటీ క్రికెట్‌లో ఎస్సెక్స్ తరఫున ఆడటం మొదలు పెట్టాడు.

స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడిన కనేరియా

స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడిన కనేరియా

ఇక 2009లో డర్హామ్‌పై ఎసెక్స్ తరఫున ఆడుతున్నప్పుడు సహచర ప్లేయర్ మెర్విన్ వెస్ట్‌ఫీల్డ్‌తో కలిసి స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడు. వెస్ట్‌ఫీల్డ్‌ తనను ఓ వన్డే గేమ్‌లో 12 పరుగులు ఇవ్వాలని ఒప్పించాడని కనేరియా అంగీకరించాడు. దీంతో ఈ ఇద్దరిపై జీవిత కాల నిషేధం విధించారు.

ఈ విషయంలో పీసీబీ తనకు ఎలాంటి సహకారం అందించలేదని, దేశం కోసం ఎంతో చేసినా.. కనీసం ఆర్థికంగా కూడా ఆదుకోలేదని చాలా సందర్భాల్లో కనేరియా తన ఆవేదనను పంచుకున్నాడు. ఈ నేపథ్యంలో సహచర ఆటగాళ్లు తనపై వివక్ష చూపేవారని కూడా తెలిపాడు. ఈ విషయాన్ని ఆ దేశ వెటరన్ పేసర్ షోయబ్ అక్తర్ కూడా అంగీకరించాడు.

Story first published: Tuesday, March 24, 2020, 14:26 [IST]
Other articles published on Mar 24, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+