Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

'హార్దిక్‌ పాండ్యాలా పాకిస్థాన్‌ ఆటగాళ్లు ఎప్పుడైనా చేశారా?.. ఓసారి మీరే ఊహించుకోండి'

Danish Kaneria praises Hardik Pandya for his trophy gave to T Natarajan

కరాచీ: ఆస్ట్రేలియాతో గత మంగళవారం జరిగిన ఆఖరి టీ20లో భారత్ ఓడినా 2-1తో సిరీస్ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. టీ20 ఆ సిరీస్‌లో టీమిండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా అద్భుతంగా రాణించడంతో 'మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌'గా ఎంపికయ్యాడు. అతడికిచ్చిన ఆ అవార్డును భారత పేసర్‌ టీ నటరాజన్‌కు హార్దిక్ బహుకరించాడు. నటరాజన్‌ అంతర్జాతీయ కెరీర్‌లో తొలి సిరీస్‌లోనే మంచి ప్రదర్శన చేశాడని ప్రోత్సహిస్తూ 'మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌' అవార్డును బహుమతిగా ఇచ్చాడు. ఈ విషయంపై స్పందించిన పాకిస్థాన్‌ వెటరన్ లెగ్‌ స్పిన్నర్‌ డానిష్‌ కనేరియా ఓ ట్వీట్‌ చేసి పాండ్యాను మెచ్చుకున్నాడు.

ఇంతకన్నా గొప్ప ఫొటో ఉండదు:

హార్దిక్‌ పాండ్యా తన ప్రవర్తనతో అందరి మనసులు గెలుచుకున్నాడు అని డానిష్‌ కనేరియా ట్వీట్ చేశాడు. టీ నటరాజన్‌కు హార్దిక్ అందజేసిన 'మ్యాన్‌ ఆఫ్‌ సిరీస్‌' అవార్డు ఫొటోను పంచుకొని ఇలా పేర్కొన్నాడు. 'ఇంతకన్నా గొప్ప ఫొటో ఉండదు. హార్దిక్ పాండ్యా 'మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌'గా ఎంపికైనా.. దాన్ని నటరాజన్‌కు అందజేశాడు. దీంతో యువ పేసర్ సంతోషించడమే కాకుండా ఎంతో స్ఫూర్తిపొంది ఉంటాడు. మా ఆటగాళ్లలో ఎవరైనా ఎప్పుడైనా ఇలా చేశారేమో మీరే ఊహించుకోండి' అని ట్వీట్ చేశాడు. పాండ్యాను మెచ్చుకుంటూనే పాకిస్థాన్‌ ఆటగాళ్లని విమర్శించాడు కనేరియా.

ఇది నీదే భయ్యా:

ఇది నీదే భయ్యా:

హార్దిక్ పాండ్యా మ్యాచ్ అనంతరం తాను అందుకున్న అవార్డును నట్టూకి ఇచ్చేసి ‘ఇది నీదే భయ్యా.. నువ్వే అర్హుడివి' అని చెబుతూ ఫొటోకు ఫోజిచ్చాడు. ఆపై ట్విటర్ వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. ‘నటరాజన్.. ఈ సిరీస్‌లో నీ ఆట అసాధారణం. క్లిష్ట స్థితిలో నీ బౌలింగ్ అద్భుతం. అరంగేట్ర సీజన్‌లోనే ఇంతలా ఆకట్టుకున్నావంటే నీ కష్టం, నైపుణ్యం ఎంటో తెలుస్తుంది. ఈ మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డుకు నువ్వే అర్హుడివి భాయ్. సిరీస్ గెలిచిన భారత్‌కు అభినందనలు' అని క్యాప్షన్‌గా పేర్కొన్నాడు.

అవకాశం దక్కకపోవడంతో:

అవకాశం దక్కకపోవడంతో:

2000లో పాక్ తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన డానిష్‌ కనేరియా.. 61 టెస్టులు, 18 వన్డేలు ఆడి 276 వికెట్లు తీశాడు. పాకిస్థాన్ క్రికెట్‌‌లో కనేరియా ఓ బెస్ట్ స్పిన్నర్ అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కానీ ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ ఎలాంటి కారణం లేకుండానే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) కనేరియాను జట్టు నుంచి తప్పించింది. జట్టులో చోటు కోసం చాలా రోజులు నిరీక్షించిన కనేరియా.. అవకాశం దక్కకపోవడంతో కౌంటీ క్రికెట్‌లో ఎస్సెక్స్ తరఫున ఆడటం మొదలు పెట్టాడు.

పలుమార్లు పీసీబీని సంప్రదించినా:

పలుమార్లు పీసీబీని సంప్రదించినా:

2009లో డర్హామ్‌పై ఎసెక్స్ తరఫున ఆడుతున్నప్పుడు డానిష్‌ కనేరియా సహచర ప్లేయర్ మెర్విన్ వెస్ట్‌ఫీల్డ్‌తో కలిసి స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడు. వెస్ట్‌ఫీల్డ్‌ తనను ఓ వన్డే గేమ్‌లో 12 పరుగులు ఇవ్వాలని ఒప్పించాడని కనేరియా అంగీకరించాడు. దీంతో ఈ ఇద్దరిపై జీవిత కాల నిషేధం విధించారు. అయితే తనకు దేశవాళి క్రికెట్‌ ఆడటానికి అనుమతి ఇవ్వాలని పలుమార్లు పీసీబీని సంప్రదించినా ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. ఈ క్రమంలోనే కనేరియా వీలుచిక్కినప్పుడల్లా పాక్‌ క్రికెటర్ల తీరుపై మండిపడుతున్నాడు.

రషీద్‌ ఖాన్‌ 'సూపర్' క్యాచ్.. బౌండరీ లైన్ వద్ద ఏమా బ్యాలెన్స్‌!! చూస్తే వావ్ అంటారు (వీడియో)

Story first published: Monday, December 14, 2020, 20:01 [IST]
Other articles published on Dec 14, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+