
దుబాయ్: టీమిండియా యువ పేసర్ ఆవేశ్ ఖాన్ వైఫల్యంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. జస్‌ప్రీత్ బుమ్రా గైర్హాజరీలో జట్టులోకి వచ్చిన ఆవేశ్ ఖాన్ అంచనాలను అందుకోలేకపోతున్నాడు. పాకిస్థాన్, హంగ్ కాంగ్‌తో జరిగిన మ్యాచ్‌ల్లో వికెట్లు తీసినప్పటికీ ధారళంగా పరుగులిచ్చుకున్నాడు. ముఖ్యంగా బుధవారం హంగ్ కాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో పేలవ ప్రదర్శన కనబర్చాడు. 19వ ఓవర్‌లో 21 పరుగులు ఇచ్చుకున్నాడు. ఈ క్రమంలోనే ఈ యువ పేసర్‌గా నెటిజన్లు విమర్శలు గుప్పించారు. రికమెండేషన్‌పై జట్టులోకి వచ్చాడా? అంటూ ప్రశ్నించారు. ఆవేఖ్ ఖాన్ కంటే విరాట్ కోహ్లీ బెటర్ బౌలర్ అని కామెంట్ చేశారు.
ఇక పాకిస్థాన్ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా సైతం ఆవేశ్ ఖాన్ బౌలింగ్ తీరును విమర్శించాడు. తదుపరి మ్యాచ్‌ల్లో అతన్ని పక్కనపెట్టాలని సూచించాడు. అతనికి బదులు యువ స్పిన్నర్ రవి బిష్ణోయ్‌ను తీసుకోవాలని సూచించాడు. తన యూట్యూబ్ చానెల్ వేదికగా ఆవేశ్ ఖాన్ బౌలింగ్ స్పందించిన కనేరియా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

'రవి బిష్ణోయ్ చాలా మంచి స్పిన్నర్. అతను జట్టుకి చాలా ప్లస్ అవుతాడు. నా ఉద్దేశంలో అతనే టీమిండియాకి నిజమైన ట్రంప్ కార్డ్. యూఏఈ పరిస్థితులను ఎలా వాడుకోవాలో అతనికి బాగా తెలుసు. భువనేశ్వర్ కుమార్, అర్ష్‌దీప్ సింగ్ బాగా బౌలింగ్ చేస్తున్నారు. హార్ధిక్ పాండ్యా తుదిజట్టులో వస్తే అతనితో కలిసి ముగ్గురు ఫాస్ట్ బౌలర్లు ఉన్నట్టే. కాబట్టి ఆవేశ్ ఖాన్ ప్లేస్‌లో రవి భిష్ణోయ్‌కి అవకాశం ఇస్తే బెటర్...'అని చెప్పుకొచ్చాడు.
ఈ ఏడాది ఫిబ్రవరిలో వెస్టిండీస్‌పై టీ20ల్లో ఆరంగ్రేటం చేసిన ఆవేశ్ ఖాన్, అదే వెస్టిండీస్‌పై జూలైలో వన్డే ఆరంగ్రేటం కూడా చేసేశాడు. అయితే ఇప్పటిదాకా 8 టీ20 మ్యాచులు ఆడిన ఆవేశ్ ఖాన్, 7 వికెట్లు మాత్రమే తీశాడు. ముఖ్యంగా టీ20ల్లో మ్యాచ్ ఫలితాన్ని డిసైడ్ చేసే డెత్ ఓవర్లలో ఇప్పటిదాకా ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు ఆవేశ్ ఖాన్. టీ20 కెరీర్‌లో డెత్ ఓవర్లలో 38 బాల్స్ వేసిన ఆవేశ్ ఖాన్, 114 పరుగులు సమర్పించుకున్నాడు.