Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

BBL 2021-22: పాపం డానియల్ సామ్స్.. నోబాల్ అని తెలియక క్యాచ్ కోసం స్టన్నింగ్ స్టంట్! (వీడియో)

 Daniel Sams Takes A Blinder In BBL And Umpire Calls It A No Ball Video Goes Viral

మెల్‌బోర్న్: బిగ్‌బాష్ లీగ్‌లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఆస్ట్రేలియా క్రికెటర్ డానియల్ సామ్స్ బౌండరీ లైన్ వద్ద గాల్లో స్టంట్ వేస్తూ అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. కానీ చివరకు అది నో బాల్ అని తెలియడంతో తీవ్ర నిరాశకు గురయ్యాడు. లీగ్‌లో భాగంగా మెల్‌బోర్న్ స్టార్స్, సిడ్నీ థండర్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. సామ్స్ వేసిన స్టంట్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఈ బాధ పగోడికి కూడా రావద్దని, గాల్లో స్టంటేసి క్యాచ్ పడితే నో బాల్ అయ్యే! అంటూ కామెంట్ చేస్తున్నారు. పాపం డానియల్ సామ్స్ అంటూ నిట్టూరుస్తున్నారు.

అసలేం జరిగిందంటే.. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సిడ్నీ థండర్ ఫీల్డింగ్ ఎంచుకోగా.. మెల్‌బోర్న్ స్టార్ బ్యాటింగ్‌కు దిగింది. సిడ్నీ థండర్ బౌలర్ నాథన్ మెక్ ఆండ్రూ వేసిన ఇన్నింగ్స్ 14వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ మూడో బంతిని అతను హై ఫుల్‌టాస్‌గా వేయగా.. మెల్‌బోర్న్ స్టార్ బ్యాట్స్‌మన్ నాక్ లర్కిన్ స్క్వేర్ లెగ్ దిశగా ఫ్లిక్ షాట్ ఆడాడు. ఇక బంతి గాల్లోకి లేవడాన్ని గమనించిన డానియల్ సామ్స్ వెనక్కి పరుగెడుతూ గాల్లో సూపర్ డైవ్ చేస్తూ రెండు చేతులతో బంతిని అద్భుతంగా అందుకున్నాడు. ఇక మైదానంలో పడే క్రమంలో బౌండరీ లైన్‌కు తాకకుండా చాకచక్యంగా వ్యవహరించాడు. ఇక క్యాచ్ అందుకున్నాని సామ్స్ సంతోషంతో ఎగిరి గంతేసాడు. కానీ అది నో బాల్ అని తెలిసి.. తీవ్ర నిరాశకు గురయ్యాడు.

ఈ సూపర్ క్యాచ్‌కు మైదానానికి వచ్చిన ప్రేక్షకులంతా అవాక్కయ్యారు. సూపర్ ఫీల్డింగ్ అంటూ కొనియాడారు. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన మెల్‌బోర్న్ స్టార్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 165 రన్స్ చేసింది. నాక్ లర్కిన్(43 బంతుల్లో 5 ఫోర్లతో 52 నాటౌట్) హాఫ్ సెంచరీతో రాణించగా.. హిల్టన్ క్రాట్‌రైట్(30 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 42), ఆండ్రీ రస్సెల్(9 బంతుల్లో 2 ఫోర్లతో 17 నాటౌట్) విలువైన పరుగులు చేశారు. సిడ్నీ థండర్ బౌలర్లలో నాథన్ మెక్ ఆండ్రూ ఓ వికెట్ తీయగా.. తన్వీర్ సంఘా రెండు వికెట్లు తీశారు.

Story first published: Friday, December 10, 2021, 16:05 [IST]
Other articles published on Dec 10, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+