వరల్డ్ టీ20: ఒకే జట్టులో ఆడిన దక్షిణాఫ్రికా దంపతులు

హైదరాబాద్: వెస్టిండీస్ వేదికగా జరుగుతోన్న ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ కప్‌లో ఓ అరుదైన సంఘటన నమోదైంది. మంగళవారం దక్షిణాఫ్రికా.. శ్రీలంకల మధ్య జరిగిన మ్యాచ్‌లో నూతనంగా దంపతులైన దక్షిణాఫ్రికా ప్లేయర్లు డానె వాన్ నీకెర్క్, మారిజానె కాప్‌లు జంటగా తొలి ప్రపంచ కప్‌లో ఆడారు. 2018 జులైలో వీరిద్దరూ వివాహం చేసుకుని దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టారు.

స్వలింగ వివాహితుల జాబితాలో రెండో స్థానాన్ని
ఈ విషయాన్ని దక్షిణాఫ్రికా మహిళా క్రికెట్ సోషల్ మీడియా ద్వారా ప్రపంచానికి తెలియజేసింది. దీంతో వీరిద్దరూ అంతర్జాతీయ క్రికెట్‌లో స్వలింగ వివాహితుల జాబితాలో రెండో స్థానాన్ని పొందారు. గతంలో న్యూజిలాండ్‌కు చెందిన ఎమీ సత్తర్‌వైట్.. లీ తుహుహు ఇలా చేసి అప్పుడు వార్తల్లో నిలిచారు.
టీ20 కోసం టెస్టు మ్యాచ్ వదులుకున్న రోహిత్ శర్మ

ఏడు వికెట్ల తేడాతో లంకపై గెలుపొందడంలో
వాన్ నీకెర్క్, మారిజానె కాప్‌లు రెండు రోజుల వ్యవధిలో 2009వరల్డ్ కప్ అరంగ్రేటంతో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టారు. మంగళవారం ముగిసిన మ్యాచ్‌లో వీరిద్దరి భాగస్వామ్యంలో 67పరుగులు చేయగలిగారు. దీంతో ఏడు వికెట్ల తేడాతో శ్రీలంకపై దక్షిణాప్రికా గెలుపొందడంలో కీలకమైయ్యారు. ఈ టోర్నమెంట్‌లో దక్షిణాఫ్రికా జట్టు శ్రీలంకతో రెండో మ్యాచ్ ఆడగా తొలి మ్యాచ్‌ను ఇంగ్లాండ్‌తో ఆడింది.

మొదటిది వర్షం కారణంగా, రెండోది 7 వికెట్లతో
మొదటిది వర్షం కారణంతో రద్దు కాగా, ఇక రెండో మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో విజయాన్ని పొందగలిగింది. దక్షిణాఫ్రికా సీమర్లు 19వైడ్‌లు వేసినప్పటికీ శ్రీలంకను పరుగులు చేయకుండా కట్టడి చేశారు. దీంతో లంక 20ఓవర్లు ముగిసేసరికి 8వికెట్లు నష్టపోయి 99పరుగులు మాత్రమే చేయగలిగింది.

3 వికెట్ల నష్టానికి దక్షిణాప్రికా 19వ ఓవర్లోనే
100పరుగుల లక్ష్యచేధనలో భాగంగా బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా జట్టులో వాన్ నీకెర్క్, మారిజానె కాప్‌లు చేసిన 67పరుగుల భాగస్వామ్యం జట్టులో సగానికి పైగా స్కోరు చేసినట్లు అయింది. మూడు వికెట్ల నష్టానికి దక్షిణాప్రికా 19వ ఓవర్లో విజయం పొందగలిగింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications