Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

జాగ్రత్తగా చూసుకోండి.. కోహ్లీ, సచిన్‌లను అధిగమిస్తాడు : డేల్ స్టెయిన్

టీమిండియా టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీపై సౌతాఫ్రికా క్రికెట్ దిగ్గజం డేల్ స్టేయిన్ ప్రశంసల జల్లు కురిపించాడు. వైభవ్ టీమిండియాకు దొరికిన నిధి అని కొనియాడాడు. భారత బ్యాటింగ్ దిగ్గజాలైన సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ కంటే వైభవ్ సామర్థ్యం గొప్పదని అభిప్రాయపడ్డాడు.

సౌతాఫ్రికా టీ20 లీగ్ ఐదో సీజన్‌ నేపథ్యంలో మాట్లాడిన డేల్ స్టెయిన్.. వైభవ్ సూర్యవంశీని ఆకాశానికెత్తాడు. తాను చూసిన అత్యంత ప్రతిభావంతులైన ఆటగాళ్లలో వైభవ్ ఒకడని తెలిపాడు.

కోహ్లీ, సచిన్ కలిపితే..

'సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ లాంటి గొప్ప ఆటగాళ్లను చూసి ఉంటారు. కానీ వైభవ్ సూర్యవంశీ ఈ ఇద్దరికి మించి క్రికెట్ ప్రపంచాన్ని శాసించబోతున్నాడు. కోహ్లీ, సచిన్‌ను కలిపితే ఎంతటి అపారమైన కీర్తి వస్తుందో అంతకంటే పెద్ద స్టార్‌గా ఎదుగుతాడు.

Dale Steyn Says Vaibhav Sooryavanshi has the potential to be bigger than Virat Kohli and Sachin Tendulkar

వైభవ్ సూర్యవంశీలా 14, 15 ఏళ్లలో ఆడే వండర్ కిడ్ సౌతాఫ్రికాలో ఉన్నారని నేను అనుకోవడం లేదు. ఒకవేళ ఉంటే మాత్రం అతని గురించి నాకు తెలియదు. మా స్థానిక స్కౌట్స్ తరహాలో నా దృష్టి లేదు. వైభవ్ లాంటి వండర్ కిడ్స్ లేకపోయినా.. సౌతాఫ్రికాలో ప్రతిభకు ఏ మాత్రం కొదువ లేదు.

భారత క్రికెట్‌కు దొరికిన గొప్ప నిధి..

మా సిస్టమ్ నుంచి అద్భుతమైన ప్రతిభావంతులు వస్తున్నారు. స్కూల్ క్రికెట్ సర్క్యూట్‌తో అండర్-19, అండర్-15 ఆటగాళ్లు ప్రపంచానికి పరిచయం అవుతున్నారు. అయితే వైభవ్ సూర్యవంశీ స్థాయి వేరు. అతను ప్రస్తుతం ఉన్న చాలా మంది అంతర్జాతీయ ఆటగాళ్ల కంటే మెరుగ్గా ఆడుతున్నాడు. అతను నిజంగా వండర్ కిడ్. భారత క్రికెట్‌కు దొరికిన గొప్ప నిధి.

అయితే వైభవ్ సూర్యవంశీని టీమిండియా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎంత బాగా చూసుకుంటే అంత గొప్ప ఫలితం ఉంటుంది. కానీ సరిగ్గా చూసుకోకపోతే అతను ట్రాక్ తప్పే అవకాశం ఉంటుంది. వైభవ్ సూర్యవంశీ బంతిని క్లీన్‌గా హిట్ చేయగలడు.

వైభవ్ సూర్యవంశీ.. వారికి దూరంగా ఉండు: శ్రీశాంత్ వార్నింగ్

వైభవ్ సూర్యవంశీ.. వారికి దూరంగా ఉండు: శ్రీశాంత్ వార్నింగ్

భయపెడితే ఔటవుతాడు..

భారత్‌లో పిచ్‌లు బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్నప్పుడు అతను బ్యాటింగ్ చేయడం నేను చూశాను. భారత్‌లో బౌండరీలు కొద్దిగా చిన్నవిగా ఉంటాయి. బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండే పిచ్‌లను వైభవ్ చక్కగా ఉపయోగించుకుంటున్నాడు.

అయితే వైభవ్ సూర్యవంశీని ఔట్ చేయడానికి మార్గాలున్నాయి. కగిసో రబాడ తరహాలో షార్ట్ పిచ్ బాల్స్‌తో వైభవ్‌ను బోల్తా కొట్టించవచ్చు. 15 ఏళ్ల వైభవ్‌ను బౌలింగ్‌తో భయపెట్టే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే క్రికెట్ అనేది ఒక భయంతో కూడిన ఆట. బౌలర్‌ను ఎదుర్కోవాలనే భయంతో మైదానంలోకి వెళ్తే.. తప్పులు చేస్తారు. కాబట్టి వైభవ్‌కు షార్ట్ బాల్స్ వేయడం అనేది మంచి ఆప్షన్ అవుతుంది.'అని డేల్ స్టెయిన్ చెప్పుకొచ్చాడు.

IND vs IRE: వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం ఆలస్యం!

IND vs IRE: వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం ఆలస్యం!
Story first published: Friday, June 12, 2026, 15:49 [IST]
Other articles published on Jun 12, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+