For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అందుకే ఎగిరి గంతేశా: డేల్ స్టెయిన్

Dale Steyn reveals story behind celebrating Shreyas Iyer’s dismissal off Umran Malik

ముంబై: సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ పేసర్ ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఔటైన తీరు చర్చనీయాంశమైంది. బుల్లెట్ లాంటి యార్కర్‌తో మాలిక్.. అయ్యర్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఉమ్రాన్‌ మాలిక్‌ యార్కర్‌ దెబ్బకు అయ్యర్‌ ఔట్‌ అవ్వగానే డగౌట్‌లో ఉన్న సన్‌రైజర్స్ బౌలింగ్ కోచ్, సౌతాఫ్రికా మాజీ పేసర్‌ డేల్‌ స్టెయిన్‌ ఎగిరి గంతేసాడు. సంతోషంతో ముత్తయ్య మురళీధరణ్‌ను హగ్ చేసుకున్నాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కాగా.. తన సంతోషానికి గల కారణాన్ని డేల్ స్టెయిన్ తెలియజేశాడు.

ముత్తయ్య చెప్పినట్లే జరగడంతో..

ఆ బంతి వేసే ముందే యార్కర్ గురించి తమ మధ్య డిస్కషన్ జరిగిందని, ఆ వెంటనే బుల్లెట్ యార్కర్‌తో అయ్యర్ క్లీన్ బౌల్డ్ కావడంతో తమ సంతోషానికి హద్దేలేకుండా పోయిందన్నాడు. 'కొన్ని సార్లు ఆటగాళ్ల జీనియస్ ఏంటో బయటపడుతుంది. ఉమ్రాన్ ఓవర్ వేసేందుకు సిద్దమైనప్పడు యార్కర్ బాల్ వేస్తే ఫలితం రాబట్టవచ్చని మురళీదరణ్ మాతో అన్నాడు.

వెంటనే మేం(హెడ్ కోచ్ టామ్ మూడీ) అతని సూచనలు తప్పుబట్టాం. యార్కర్ సంధిస్తే అయ్యర్ బౌలర్ తలపై నుంచి స్ట్రైట్‌గా బౌండరీ బాదుతాడని చెప్పాడు. కానీ మాలిక్ మాత్రం సూపర్ బాల్‌తో స్టంప్స్‌ను కిందపడేసాడు. దాంతో సంతోషాన్ని తట్టుకోలేకపోయాం. ఆ క్రమంలోనే ఎగిరి గంతేసాం. స్పిన్నర్ అయినా ముత్తయ్య మురళీ ధరణ్ ఆలోచనా విధానం ఆకట్టుకుంది'అని డేల్ స్టేన్‌ చెప్పుకొచ్చాడు.

స్టన్నింగ్ యార్కర్..

స్టన్నింగ్ యార్కర్..

ఇన్నింగ్స్‌ 10వ ఓవర్లో ఇది చోటుచేసుకుంది. ఆరంభంలోనే వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న తన జట్టును కాపాడుకునే ప్రయత్నం శ్రేయాస్‌ అయ్యర్‌ చేసాడు. కానీ ఉమ్రాన్ మాలిక్ సూపర్ యార్కర్‌తో పెవిలియన్ చేర్చాడు.ఆ ఓవర్ ఆఖరి బంతిని ఫుల్ లెంగ్త్ యార్క్‌ర్‌ వేశాడు. ఉమ్రాన్‌ యార్కర్‌కు అయ్యర్‌ వద్ద సమాధానం లేకుండా పోయింది. బులెట్‌ వేగంతో వచ్చిన బంతి అయ్యర్‌ను క్లీన్‌బౌల్డ్‌ చేసింది. మీటర్‌ రీడింగ్‌లో ఉమ్రాన్‌ వేసిన బంతి గంటకు 148.8 కిమీ వేగంతో వచ్చింది. ఈ సమయంలో అందరు ఉమ్రాన్‌ను అభినందిస్తున్న వేళ స్టెయిన్‌ మాత్రం ఎగిరి గంతేశాడు. ఇది కదా కావాల్సింది అన్నట్లుగా నవ్వుతూ మురళీధరన్‌ను హత్తుకొని వచ్చాడు.

మెరుగవుతున్న కశ్మీర్ ఎక్స్‌ప్రెస్

మెరుగవుతున్న కశ్మీర్ ఎక్స్‌ప్రెస్

ఈ సీజన్‌లో ఉమ్రాన్‌ అత్యంత వేగంతో బంతులు విసురుతున్నప్పటికి ధారాళంగా పరుగులు ఇస్తున్నాడు. దీంతో ఉమ్రాన్‌ బౌలింగ్‌పై విమర్శలు వచ్చాయి. అయినా స్టెయిన్‌ మాత్రం అతనిపై నమ్మకముంచాడు. ఉమ్రాన్‌ మాలిక్‌ త్వరలోనే టీమిండియా జట్టులో చూస్తానని కూడా స్టెయిన్‌ ఇటీవలే ధీమా వ్యక్తం చేశాడు. రియాక్షన్‌ వచ్చింది.

త్రిపాఠితో సన్‌రైజర్స్ తీన్మార్...

త్రిపాఠితో సన్‌రైజర్స్ తీన్మార్...

టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. నితీశ్‌ రాణా (36 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 54), ఆండ్రీ రసెల్‌ (25 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 49 నాటౌట్‌) కీలక ఇన్నింగ్స్‌ ఆడగా, నటరాజన్‌కు 3 వికెట్లు దక్కాయి. అనంతరం హైదరాబాద్‌ 17.5 ఓవర్లలో 3 వికెట్లకు 176 పరుగులు చేసి గెలిచింది.

'ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' రాహుల్‌ త్రిపాఠి (37 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్స్‌లతో 71) మెరుపు ఇన్నింగ్స్‌తో చెలరేగగా, మార్క్‌రమ్‌ (36 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 68 నాటౌట్‌) కూడా జోరు ప్రదర్శించాడు. వీరిద్దరు మూడో వికెట్‌కు 54 బంతుల్లో 94 పరుగులు జోడించి హైదరాబాద్‌ విజయానికి బాటలు వేశారు.

Story first published: Saturday, April 16, 2022, 13:38 [IST]
Other articles published on Apr 16, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+