Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

శ్రీశాంత్ కొట్టిన ఆ సిక్స్.. అతని స్వింగ్ సెలబ్రేషన్స్ ఎప్పటికీ మరిచిపోను: డేల్ స్టెయిన్

Dale Steyn recalls Sreesanths slog six off South Africa pacer Andre Nel in 2006 Test

జోహన్నెస్‌బర్గ్‌: బౌలర్‌పై కోపంతో టీమిండియా వెటరన్ పేసర్ శ్రీశాంత్ కొట్టిన సిక్స్, అతని సెలెబ్రేషన్స్ ఎప్పటికీ మరిచిపోలేనని సౌతాఫ్రికా పేస్ దిగ్గజం డేల్ స్టేయిన్ తెలిపాడు. తాజాగా ఈఎస్‌పీఎన్‌ క్రిక్‌ఇన్‌ఫోతో ట్విటర్ వేదికగా చిట్ చాట్ చేసిన ఈ లెజండరీ పేసర్ ఈ విషయాన్ని వెల్లడించాడు. 'మీకు ఎప్పటికి గుర్తుండిపోయేలా.. చిల్‌ అనిపించేలా.. బ్యాట్స్‌మన్‌ కొట్టిన షాట్‌ గురించి చెప్పండి'అని ఈఎస్‌పీఎన్ క్రిక్‌ ఇన్‌ఫో ప్రశ్నించగా.. ''ఆండ్రూ నెల్‌ బౌలింగ్‌లో శ్రీశాంత్‌ కొట్టిన సిక్స్‌ ఎప్పటికి మరిచిపోను. అతన్ని కవ్వించి మరీ సిక్స్‌ కొట్టించాడు. సిక్స్‌ కొట్టిన అనంతరం శ్రీశాంత్‌ తన బ్యాట్‌ను స్వింగ్‌ చేస్తూ సెలబ్రేట్‌ చేసుకున్న మూమెంట్‌ ఇప్పటికి గుర్తుంది. ఎప్పుడు గుర్తొచ్చినా అది నన్ను చిల్‌ చేస్తుంది'అని స్టెయిన్ బదులిచ్చాడు.



 ఒకే సిక్స్ అయినప్పటికీ..

ఒకే సిక్స్ అయినప్పటికీ..

ఇక శ్రీశాంత్‌​ తన కెరీర్‌లో ఆట కంటే వివాదాలతోనే ఎక్కువ ఫేమస్‌ అయ్యాడు. కానీ కెరీర్ ఆరంభంలో శ్రీశాంత్ తన సూపర్బ్ బౌలింగ్‌తో ప్రత్యర్థులను వణికించాడు. బ్యాటింగ్‌ లెజెండ్స్‌ జాక్వస్ కల్లీస్‌, బ్రియాన్‌ లారాలను సైతం ఇబ్బంది పెట్టాడు. 2007 టీ20 ప్రపంచకప్ విజయంలో కూడా కీలక పాత్ర పోషించాడు. బౌలింగ్‌లో తన పవరేంటో చూపెట్టిన శ్రీశాంత్‌ సౌతాఫ్రికాతో జరిగిన ఓ టెస్ట్ మ్యాచ్‌లో తన బ్యాటింగ్‌ పవర్‌ చూపించాడు. ఆ మ్యాచ్‌లో శ్రీశాంత్‌ చేసింది ఏడు పరుగులు.. కొట్టింది ఒకే ఒక్క సిక్స్‌ అయినప్పటికీ.. అదే తన జీవితంలో మరిచిపోలేనని స్టెయిన్ చెప్పుకొచ్చాడు.

సౌతాఫ్రికా పర్యటనలో..

సౌతాఫ్రికా పర్యటనలో..

2006లో టీమిండియా ఐదు వన్డేలు.. మూడు టెస్టులు, ఒక టీ20 ఆడేందుకు సౌతాఫ్రికాలో పర్యటించింది. టెస్టు సిరీస్‌లో భాగంగా వాండరర్స్‌ వేదికగా తొలి టెస్టు మ్యాచ్‌ జరిగింది. దక్షిణాఫ్రికా బౌలర్‌ ఆండ్రూ నెల్‌ అప్పటికే మూడు వికెట్లు తీసి జోరు మీద ఉన్నాడు. ఆఖరి వికెట్‌గా క్రీజులో ఉన్న శ్రీశాంత్‌ను చూస్తూ ఏదో స్లెడ్జ్‌ చేశాడు. అసలే కోపానికి చిరునామాగా ఉండే శ్రీశాంత్‌కు అతని మాటలు మరింత కోపం తెప్పించాయి. ఆండ్రూ వేసిన ఆ మరుసటి బంతిని భారీ సిక్సర్‌గా తరలించాడు. అంతే ఆండ్రూ ముఖంలో కోపం.. శ్రీశాంత్‌లో నవ్వు ఒకేసారి కనిపించాయి. ఇంతటితో ఆగకుండా శ్రీశాంత్ తన బ్యాట్‌ను అతనివైపు చూస్తూ.. పనిచేసుకో అన్నట్లుగా స్వింగ్‌ చేస్తూ సెలబ్రేట్‌ చేసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పటికీ యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతుంటుంది. కాగా ఆ మ్యాచ్‌లో శ్రీశాంత్‌ బౌలింగ్‌లో 8 వికెట్లతో దుమ్మురేపి టీమిండియాకు 123 పరుగులతో భారీ విజయాన్నిఅందించాడు.

ఇండియన్స్ అంటూ రెచ్చగొట్టాడు..

ఇండియన్స్ అంటూ రెచ్చగొట్టాడు..

ఇక శ్రీశాంత్‌ ఆండ్రూ నెల్‌తో జరిగిన ఆ కాంట్రవర్సీ గురించి ఓ ఇంటర్వ్యూలో స్పందించాడు. 'ఆరోజు మ్యాచ్‌లో నేను బ్యాటింగ్‌ చేస్తుంటే నా దగ్గరకు వచ్చి ఇండియన్స్‌కు మంచి మనసు ఉండదు. మీతో పోలిస్తే మేము చాలా బెటర్‌ అంటూ కామెంట్స్‌ చేశాడు. దాంతో నాకు కోపం వచ్చింది.. అప్పటికే మా ప్రధాన బ్యాట్స్‌మెన్‌ అంతా ఔటయ్యారు. ఆండ్రూకు మా స్కోర్‌బోర్డు చూపిస్తూ..' మేం ఆధిక్యంలో ఉన్నాం.. తర్వాత ఏ జరుగుతుందో నువ్వే చూడు' అని సైగ చేసి సిక్స్‌ బాదాను.. అంతే అతని కళ్లలో కోపం చూసి నేను సెలబ్రేట్‌ చేసుకున్నా'' అంటూ తెలిపాడు. ఇక శ్రీశాంత్‌ టీమిండియా తరపున 27 టెస్టుల్లో 87 వికెట్లు.. 53 వన్డేల్లో 75 వికెట్లు.. 10టీ20ల్లో 7 వికెట్లు తీశాడు. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో నిషేధం ఎదుర్కొన్నాడు. ఇటీవలే నిషేదం పూర్తవ్వగా.. రీఎంట్రీ కోసం ట్రై చేస్తున్నాడు.

Story first published: Sunday, May 16, 2021, 19:13 [IST]
Other articles published on May 16, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+