Sunrisers Hyderabad బౌలింగ్ కోచ్‌గా సౌతాఫ్రికా పేస్ గన్!

న్యూఢిల్లీ: ఐపీఎల్ 2022 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ కోచ్‌గా సౌతాఫ్రికా మాజీ పేసర్ డేల్ స్టెయిన్ బాధ్యతల చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 2021 పేలవ ప్రదర్శన తర్వాత ఆ జట్టు కోచింగ్ బాధ్యతల నుంచి హెడ్ కోచ్ ట్రెవర్ బేలిస్, బ్యాటింగ్ కోచ్ బ్రాడ్ హాడిన్ తప్పుకున్న విషయం తెలిసిందే. 2016 టైటిల్ గెలిచిన అనంతరం వరుసగా ప్లే ఆఫ్స్ చేరిన హైదరాబాద్.. ఐపీఎల్ 2021 సీజన్‌లో మాత్రం పాయింట్స్ టేబుల్లో అట్టడుగున నిలిచింది. ఇక సన్‌రైజర్స్ ఫ్రాంచైజీ తమ మెంటార్ వీవీఎస్ లక్ష్మణ్ సేవలను కూడా కోల్పోయింది. నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ) డైరెక్టర్‌గా లక్ష్మణ్ బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే.

బౌలింగ్ కోచ్‌గా..
దాంతోనే మెగా వేలానికి ముందు సపోర్ట్ స్టాఫ్‌ను నియమించుకునే పనిలో పడిన సన్‌రైజర్స్.. డేయిల్ స్టెయిన్‌ను బౌలింగ్ కోచ్‌గా తీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తుందంట. ఇప్పటికే ఈ విషయంపై స్టెయిన్‌ను సన్‌రైజర్స్ మేనేజ్‌మెంట్ సంప్రదించిందంట. అయితే ఈ విషయాన్ని డేయిల్ స్టెయిన్ ముందు ప్రస్తావించగా.. ఎలాంటి కామెంట్ చేయలేదు. అలాగని ఖండించలేదు. 95 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన స్టెయిన్ 97 వికెట్లు తీసాడు. లీగ్ ప్రారంభమైన 2008 నుంచి ఆడాడు.

292 మ్యాచ్‌లు..
డెక్కన్ చార్జర్స్, గుజరాత్ లయన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లకు ప్రాతినిథ్యం వహించాడు. ఈ ఏడాదే అన్ని రకాల క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన స్టెయిన్.. సౌతాఫ్రికా తరఫున మొత్తం 292 మ్యాచ్‌లు ఆడాడు. ఇందుల్లో 93 టెస్ట్‌ల్లో 439 వికెట్లు తీసిన స్టెయిన్.. 125 వన్డేల్లో 196, 47 టీ20ల్లో 64 వికెట్లు పడగొట్టాడు. ఇక భారత మాజీ క్రికెటర్, తమిళనాడు ఆల్‌రౌండర్ హెమాంగ్ బాదాని కూడా సన్‌రైజర్స్ సపోర్ట్ టీమ్‌లో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బాదాని 2000 నుంచి 2004 మధ్య 40 వన్డేలు, నాలుగు టెస్ట్‌లు ఆడాడు.

10 జట్లతో..
ఇక సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ కోచ్ సంజీవ్ గోయెంకా ఆర్‌పీఎస్ గ్రూప్‌కు చెందిన నయా ఫ్రాంచైజీ లక్నో టీమ్‌కు హెడ్ కోచ్‌గా సేవలందించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అతనితో లక్నో టీమ్ ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. ఇంగ్లండ్ వన్డే ప్రపంకప్ గెలిచిన అనంతరం 2019లో సన్‌రైజర్స్ హైదరాబాద్ హెడ్ కోచ్ బాధ్యతలు చేపట్టిన ట్రెవర్ బేలిస్.. 2021 సీజన్ మినహా అన్ని సీజన్లలో జట్టు ప్లే ఆఫ్స్ చేరడంలో కీలక పాత్ర పోషించాడు.
ఐపీఎల్ 2022 సీజన్ 10 జట్లతో జరగనున్న విషయం తెలిసిందే. దాంతో మెగా వేలం నిర్వహించనున్నారు. ఇప్పటికే రిటెన్షన్ ప్రక్రియ ముగించిన బీసీసీఐ.. వేలం నిర్వహణపై దృష్టిసారించింది. ఇక సన్‌రైజర్స్ హైదరాబాద్.. కెప్టెన్ కేన్ విలియమ్సన్‌తో పాటు అన్ క్యాప్ ప్లేయర్లు అబ్దుల్ సమద్, ఉమ్రాన్ మాలిక్‌లను రిటైన్ చేసుకుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications