ఆ యువ ఆటగాడి మాటలతో లైవ్‌షోలో కన్నీటి పర్యంతమైన డేల్ స్టెయిన్!

న్యూఢిల్లీ: సౌతాఫ్రికా స్టార్ పేసర్ డేల్ స్టెయిన్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. బౌలర్లలో తానే ఆదర్శం అంటూ కోల్‌కతా నైట్‌రైడర్స్ యువ పేసర్ శివం మావి చెప్పిన మాటలు విని ఈ సఫారీ స్పీడ్ స్టార్ కన్నీటి పర్యంతమయ్యాడు. ఈఎస్‌పీఎన్‌క్రిక్‌ఇన్‌ఫో నిర్వహిస్తున్న టీ20 టైమ్‌ఔట్ అనే కార్యక్రమంలో టీమిండియా మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రాతో పాటు డేల్ స్టెయిన్ పాల్గొన్నాడు.
పంజాబ్‌పై విజయానంతరం వర్చువల్‌గా శివం మావి కూడా ఈ షోలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ డేల్ స్టెయిన్ తనకు ఆదర్శనమని చెప్పుకొచ్చాడు.

నా రోల్‌మోడల్..
'నేను క్రికెట్ ఆడటం మొదలుపెట్టిన నాటి నుంచి డేల్ స్టెయిన్ ఆటను ఎంతో శ్రద్ధగా గమనిస్తున్నా. బౌలింగ్ చేయడం ప్రారంభించినప్పటి నుంచి ఆయనను అనుసరిస్తున్నా. డేల్ స్టెయిన్ లాగే ఔట్ స్వింగర్లు వేయడం ప్రాక్టీసు చేసేవాడిని. అతనితో పాటు జస్‌ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ బౌలింగ్‌ను కూడా ఫాలో అయ్యేవాడిని. అయితే, నా రోల్‌మోడల్ మాత్రం డేల్ స్టెయిన్''అని ఈ యువ పేసర్ చెప్పుకొచ్చాడు. సోమవారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 ఓవర్లు వేసి 13 పరుగులు ఇచ్చిన 22 ఏళ్ల శివం మావి ఒక వికెట్ తీశాడు. మ్యాచ్‌లో కేకేఆర్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది.

కన్నీళ్లొచ్చాయి..
శివం మావి మాటలకు ఉద్వేగానికి లోనైన డేల్ స్టెయిన్..అతని మాటలు విని తన కళ్లు చెమర్చాయని, తన ప్రభావం శివంపై ఇంతలా ఉంటుందని ఊహించలేదని పేర్కొన్నాడు. 'నిజంగా అద్భుతం. నిజం చెప్పాలంటే.. తన మాటలకు నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి. నాకు క్రికెట్ ఆడటం అంటే ఇష్టం. అందుకే ఇప్పటికీ ఆటను కొనసాగిస్తున్నా'' అని చెప్పుకొచ్చాడు. ఇక మావి మంచి ప్రదర్శన కనబరుస్తున్నాడన్న స్టెయిన్, ఇలాగే ఆడితే త్వరలోనే టీమిండియాకు ఆడతాడని, తన కలలు నిజం కావాలని ఆకాంక్షించాడు.

రాణించిన త్రిపాఠి, మోర్గాన్
మొదట పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 123 పరుగులు చేసింది. మయాంక్ అగర్వాల్ (34 బంతుల్లో 31; 1 ఫోర్, 2 సిక్స్‌లు) ఫర్వాలేదనిపించగా... చివర్లో క్రిస్ జోర్డాన్ (18 బంతుల్లో 30; 1 ఫోర్, 3 సిక్స్‌లు) దూకుడుగా ఆడాడు. ప్రసిధ్ కృష్ణ (3/ 30), సునీల్ నరైన్ (2/22), కమిన్స్ (2/31) ప్రత్యర్థి భారీ స్కోరు చేయకుండా కళ్లెం వేశారు. అనంతరం ఛేదనలో కోల్‌కతా 16.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 126 పరుగులు చేసి గెలుపొందింది. మోర్గాన్ (40 బంతుల్లో 47 నాటౌట్; 4 ఫోర్లు , 2 సిక్స్‌లు), రాహుల్ త్రిపాఠి (32 బంతుల్లో 41; 7 ఫోర్లు) జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications