For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

CWG 2022: కరోనా సోకినా.. ఆ ఆస్ట్రేలియా ప్లేయర్ భారత్‌తో ఫైనల్ మ్యాచ్ ఎలా ఆడిందంటే..?

CWG 2022: Why Australia’s Tahlia McGrath was allowed to play final against India despite Covid

న్యూఢిల్లీ: కామన్వెల్త్‌గేమ్స్ మహిళల క్రికెట్ ఫైనల్లో ఆస్ట్రేలియా చీటింగ్ చేసిందంటూ గత 24 గంటలుగా సోషల్ మీడియా వేదికగా అభిమానులు దుమ్మెత్తి పోస్తున్నారు. టోర్నీ నిబంధనలను అతిక్రమిస్తూ.. కొవిడ్ పాజిటీవ్ అని తేలిన ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ తహ్లియా మెక్‌గ్రాత్ ఫైనల్ బరిలోకి దిగడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిబంధనల ప్రకారం కరోనా సోకిన ఆటగాళ్లను జట్టుకు దూరంగా ఉంచి ఐసోలేషన్‌కు తరలిస్తారు. కానీ మెక్‌గ్రాత్‌కు మాత్రం ఈ నిబంధన వర్తించలేదు. అసలు ఆమెను మ్యాచ్ రిఫరీ ఎలా అనుమతించారని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

పాజిటీవ్ అని తేలినా..

పాజిటీవ్ అని తేలినా..

అయితే మ్యాచ్ రోజు ఉదయం నిర్వహించిన కరోనా పరీక్షల్లో మెక్‌గ్రాత్‌కు పాజిటీవ్ అని తేలింది. దీంతో ఆమె మ్యాచ్‌కు దూరం అవుతుందని అంతా భావించారు. అయితే పెద్దగా కొవిడ్ లక్షణాలు లేకపోవడంతో మెక్‌గ్రాత్ ఫైనల్లో ఆడేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా ఐసీసీ అనుమతి కోరిందట. మెక్‌గ్రాత్‌ను తుది జట్టులో ఆడించాలా? వద్దా? అనే విషయంపై మ్యాచ్ రిఫరీ, అధికారులు తీవ్ర చర్చలు జరిపారు. దీంతో టాస్ సైతం 12 నిమిషాలు ఆలస్యమైంది.

ప్రత్యేక అనుమతితో..

ప్రత్యేక అనుమతితో..

అయితే చివరకు వారి నుంచి కొన్ని ప్రత్యేక నిబంధనలతో కూడిన అనుమతి రావడంతో మెక్‌గ్రాత్ ఫైనల్ బరిలోకి దిగింది. మ్యాచ్ ప్రారంభం సమయంలో జట్టు సభ్యులు జాతీయగీతం ఆలపించినప్పుడు ఆమె వారికి దూరంగా ఉంది. ఆ తరువాత ఆసీస్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు డగౌట్‌లో సహచర ఆటగాళ్లతో కూర్చోకుండా ఒంటరిగా మాస్క్ వేసుకొని వేరే దగ్గర కూర్చొంది. ఇక 2 వికెట్లు పడిన అనంతరం బ్యాటింగ్ కూడా చేసింది. అయితే ఈ సమయంలో ఆమె మాస్క్ ధరించలేదు.

చీటింగ్ అంటూ ఫ్యాన్స్ ఫైర్..

చీటింగ్ అంటూ ఫ్యాన్స్ ఫైర్..

నాలుగు బంతుల్లో 2 పరుగులు చేసి, రాధా యాదవ్ డైవింగ్ క్యాచ్‌కు బ్యాక్‌ వర్డ్ పాయింట్ వద్ద ఔటైంది. రెండు ఓవర్లు బౌలింగ్ కూడా చేసింది. ఇక ఫీల్డింగ్‌లో షెఫాలీ వర్మ క్యాచ్‌ను అందుకున్నప్పుడు కూడా ఆమె సహచర ప్లేయర్లతో కలిసి సంబరాలు చేసుకోలేదు. క్లినికల్ స్టాఫ్ కామన్వెల్త్ గేమ్స్ ఫెడరేషన్ మ్యాచ్ అధికారులతో సంప్రదించిన తర్వాతే ఆమెను మ్యాచ్‌ బరిలోకి దింపామని క్రికెట్ ఆస్ట్రేలియా వివరణ ఇచ్చినప్పటికీ నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ఆటగాళ్ల భద్రతను పట్టించుకోకుండా కొవిడ్‌తో మ్యాచ్ ఎలా ఆడిస్తారని మండిపడుతున్నారు.

ఒత్తిడికి చిత్తయి..

ఒత్తిడికి చిత్తయి..

ఆదివారం జరిగిన ఫైనల్లో ఒత్తిడికి చిత్తయిన హర్మన్‌ప్రీత్‌ సేన 9 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 161 పరుగులే చేసింది. ఆసీస్ బ్యాటర్లలో బెత్ మూనీ(61), కెప్టెన్ మెగ్ లాన్నింగ్(36) టాప్ స్కోరర్లుగా నిలిచారు. స్వింగ్ కింగ్ రేణుకా సింగ్(2/25), స్నేహ్ రాణా(2/38) రెండేసి వికెట్లు తీయడంతో పాటు దీప్తి శర్మ(1/30), రాధా యాదవ్(1/24) చెరో వికెట్ పడగొట్టారు.

అనంతరం 162 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌.. 19.3 ఓవర్లలో 152 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్లు షెఫాలి (11), స్మృతి (6) త్వరగా వెనుదిరిగినా.. జెమీమా (33)తో కలిసి హర్మన్‌ప్రీత్‌ (65) పోరాడడంతో 14 ఓవర్లకు 112/2తో భారత్‌ మెరుగైన స్థితిలో నిలిచింది. తర్వాత వరుసగా వికెట్లు కోల్పోయి లక్ష్యానికి దూరమైంది. గార్డ్‌నర్‌ (3/16), షట్‌ (2/27) భారత్‌ను దెబ్బతీసారు

Story first published: Tuesday, August 9, 2022, 11:28 [IST]
Other articles published on Aug 9, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+