ఈ 130-140 పరుగులు చేస్తాంటే నడవదమ్మా.. ధాటిగా ఆడాల్సిందే! భారత మహిళా క్రికెటర్లకు వెటరన్ ప్లేయర్ వార్నింగ్!

న్యూఢిల్లీ: రెండు దశాబ్దాల తర్వాత కామన్వెల్త్ గేమ్స్‌లో చోటు దక్కించుకున్న క్రికెట్‌లో సత్తా చాటాలని భారత మహిళల క్రికెట్ జట్టు తహతహలాడుతున్నది. మన అమ్మాయిలు ఆడనున్న మ్యాచ్‌ల టికెట్లన్నీఇప్పటికే అమ్ముడుపోగా.. హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మందన, షఫాలీ వర్మ మెరుపులు మెరిపించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నెల 28 నుంచి బర్మింగ్‌హామ్ వేదికగా ఈ మెగా ఈవెంట్ జరగనుండగా.. హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత జట్టు సోమవారం అక్కడికి చేరుకుంది. జూలై 29 నుంచి క్రికెట్ మ్యాచ్‌లు జరగనుండగా 29న భారత్ తొలి మ్యాచ్‌ను ఆస్ట్రేలియాతో ఆడనుంది. అయితే ఈ మ్యాచ్‌లకు ముందు భారత అమ్మాయిలకు వెటరన్ క్రికెటర్ వేద కృష్ణమూర్తి స్వీట్ వార్నింగ్ ఇచ్చింది.

ధాటిగా ఆడాల్సిందే..
మహిళల టీ20 ఫార్మాట్ చాలా మారిపోయిందని, 130-140 పరుగులు చేస్తానంటే విజయాలు దక్కవని హెచ్చరించింది. పురుషుల క్రికెటర్ల తరహాలో ధనాధన్ ఇన్నింగ్స్‌లు ఆడే సత్తా ఆటగాళ్లలో ఉందని, ప్రతీ జట్టు సులువుగా 160-190 పరుగులు చేయగలుగుతుందని పేర్కొంది. ఈ పరిస్థితుల్లో 160-170 పరుగులను కూడా కాపాడుకోలేమని పేర్కొంది. అధికారిక బ్రాడ్ కాస్టర్ సోనీ స్పోర్ట్స్ చానెల్‌లో మాట్లాడిన వేద కృష్ణమూర్తి భారీ స్కోర్లు నమోదు చేయడంపై భారత జట్టు దృష్టిసారించాలని సూచించింది. షెఫాలీ శర్మ, స్మృతి మంధనాలకు ధాటిగా ఆడే సత్తా ఉందని పేర్కొంది.

చిన్న లక్ష్యాలు సరిపోవు..
'టీ20 క్రికెట్‌లో ఏ జట్టుకైనా శుభారంభం అవసరం. భారత జట్టులో ఆ పని చేసేందుకు స్మృతి మంధాన, షెఫాలీ వర్మలు ఉన్నారు. వీరిద్దరూ ధాటిగా ఆడి మంచి ఆరంభాలు ఇవ్వగలరు. ఈ ఫార్మాట్‌లో ధాటిగా ఆడటం అనేది చాలా కీలకం. ఆ బాధ్యత ఎవరు తీసుకుంటారనేది అనవసరం. కానీ స్కోర్ బోర్డును పరుగెత్తించాల్సిందే. ఈ రోజుల్లో ప్రతీ ఒక్కరు అటాకింగ్ క్రికెట్ ఆడుతున్నారు. ప్రత్యర్థి ముందు భారీ లక్ష్యాన్ని ఉంచాల్సిందే. 130-140 పరుగులు చేసి మ్యాచ్ గెలిచే రోజులు పోయాయి. వాటి గురించి పూర్తిగా మరిచిపోవాలి. గత కొన్నేళ్లుగా ఆట స్వరూపం పూర్తిగా మారిపోయింది. 160-170 పరుగులు చేసినా గెలవలేని పరిస్థితులు నెలకొన్నాయి. కాబట్టి భారీ లక్ష్యాలను నిర్దేశించడంపై ఫోకస్ పెట్టాలి'అని వేద కృష్ణమూర్తి అభిప్రాయపడింది.

8 జట్లు.. రెండు గ్రూప్‌లు..
కామన్వెల్త్ గేమ్స్‌లో 8 మహిళా క్రికెట్ జట్లను చేర్చారు. వీటిని రెండు గ్రూపులుగా విభజించారు. ఈ రెండు గ్రూపుల నుంచి టాప్ 2 జట్లు నేరుగా సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. అనంతరం ఇరు జట్ల మధ్య ఫైనల్‌లో స్వర్ణ పతక పోరు జరగనుంది. గ్రూప్ ఏలో భారత్, పాకిస్థాన్, ఆస్ట్రేలియా, బార్బడోస్ జట్లు ఉండగా.. గ్రూప్ బీలో ఇంగ్లండ్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, శ్రీలంక టీమ్స్ ఉన్నాయి. భారత్ తొలి మ్యాచ్‌ను ఆస్ట్రేలియాతో 29న, రెండో మ్యాచ్‌ను పాకిస్థాన్‌తో 31న, మూడో మ్యాచ్‌ను బార్బడోస్‌తో ఆగస్టు 3న ఆడనుంది.

భారత మహిళల జట్టు..
హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధాన(వైస్ కెప్టెన్), షెఫాలి వర్మ, మేఘన, తానియా భాటియా, యస్తికా భాటియా, దీప్తి శర్మ, రాజేశ్వరి గైక్వాడ్, పూజా వస్త్రాకర్, మేఘనా సింగ్, రేణుక ఠాకూర్, జెమీమా రోడ్రిగ్స్, రాధా యాదవ్, హర్లీన్ డియోల్, స్నేహ్ రాణా
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications