CWG 2022: నాన్న కల.. అన్న అండ.. బెంబేలిత్తిస్తున్న నయా స్వింగ్ క్వీన్ రేణుకా సింగ్!

న్యూఢిల్లీ: కామన్వెల్త్ క్రీడల్లో తొలిసారి మహిళల క్రికెట్‌కు అవకాశం కల్పించగా.. భారత జట్టు అద్భుత ప్రదర్శన కొనసాగిస్తోంది. ఆస్ట్రేలియాతో తృటిలో విజయాన్ని చేజార్చుకున్నా.. పాకిస్థాన్, బార్బడోస్‌ను చిత్తు చేసి సెమీస్ బెర్త్ ఖాయం చేసుకుంది. అయితే మూడు మ్యాచ్‌ల్లో సంచలన ప్రదర్శన కనబర్చింది మాత్రం భారత నయా స్వింగ్ క్వీన్ రేణుకా సింగ్.
దిగ్గజ పేసర్ ఝులన్ గోస్వామి వారసురాలిగా జట్టులోకి వచ్చిన రేణుకా సింగ్ మూడు మ్యాచ్‌ల్లోనే 9 వికెట్లు పడగొట్టింది. తొలి మ్యాచ్‌లో భారత్.. ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయినా..రేణుకా సింగ్ తన బౌలింగ్‌తో వణికించింది. అలిస్సా హీలీ, బెత్ మూనీ, మెగ్ లానింగ్, తహ్లియా మెక్‌గ్రాత్ ఇలా అగ్రశ్రేణి బ్యాటర్లను పెవిలియన్‌కు పంపించింది.

3 మ్యాచ్‌ల్లో 9 వికెట్లు..
ఇక రెండో మ్యాచ్‌లో పాక్‌పై పొదుపు బౌలింగ్ చేసి కట్టడి చేసింది. భారత్‌కు చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో బార్బడోస్ బ్యాటర్లను చుట్టేసింది. పవర్‌ప్లేలో 3 ఓవర్లు వేసి కేవలం ఐదు పరుగులు ఇచ్చి మూడు కీలకవికెట్లు పడగొట్టింది. కామన్వెల్త్ గేమ్స్‌లో మొత్తంగా 12 ఓవర్లు వేసిన రేణుక 5.33 సగటు, 4.00 ఎకానమీతో 9 వికెట్లు తీయడం విశేషం.
దాంతో సోషల్ మీడియాలో భువనేశ్వర్‌తో పోలుస్తూ అభిమానులు స్వింగ్ క్వీన్ అంటూ ట్వీట్లు చేస్తున్నారు. ఐసీసీ జులై నెలకు నామినేట్ చేసిన బెస్ట్ ఉమెన్ క్రికెటర్ రేసులో రేణూ ఉంది. ఇంగ్లాండ్ బ్యాటర్ ఎమ్మా లాంబ్ (234 పరుగులు), నటలియా స్కావర్ (219 రన్స్, 5 వికెట్లు)తో రేణూ (12 వికెట్లు) పోటీపడుతోంది.

తండ్రి కల..
రేణుకా సింగ్ ఠాకూర్‌ది హిమాచల్ ప్రదేశ్ లోని రోహ్రు. ప్రముఖ ఆద్యాత్మిక స్థలం ధర్మశాలకు 325 కిలోమీటర్ల దూరంలో ఉంది ఆ చిన్న టౌన్. రేణుక తండ్రి కేహర్ సింగ్ ఠాకూర్‌కు క్రికెట్ అంటే అభిమానం. ఆయన టీమిండియా మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీకి వీరాభిమాని. తన సంతానం (ఒక కొడుకు, కూతురు) లో ఒకరినైనా క్రికెటర్ చేయాలని కలలు కన్నాడు.
అందుకే తన కొడుకుకు వినోద్ అని తన అభిమాన క్రికెటర్ పేరు పెట్టుకున్నాడు. కేహర్ హిమాచల్ ప్రదేశ్ లో ఇరిగేషన్ అండ్ పబ్లిక్ హెల్త్ లో పనిచేసేవాడు. కానీ రేణుక మూడేండ్ల వయసులోనే అతడు మరణించాడు. దీంతో ఆ ఉద్యోగాన్ని రేణుక అమ్మకు ఇచ్చారు.

అన్న అండతో..
వినోద్ తో పాటే రేణుక కూడా చిన్నప్పుడే క్రికెట్‌పై మక్కువ పెంచుకుంది. తన అన్న ఎక్కడికెళ్లినా తానూ అక్కడికెళ్లి బౌలింగ్ చేసేది. తండ్రి చనిపోయాక ఆ ఉద్యోగాన్ని రేణుక తండ్రికి ఇచ్చినా చాలీచాలని జీతాలతో జీవితాలు సాఫీగా ఏం సాగలేదు. కూతురు, కొడుకు లోని ఇద్దరి ఆసక్తిని గమనించిన తల్లి.. ఇద్దరికీ ఖర్చు పెట్టే స్థోమత లేక వినోద్‌కు నచ్చజెప్పింది. రేణుకను ప్రోత్సహించింది.
తమ గ్రామానికి చుట్టుపక్కల ఎక్కడ టోర్నీలు జరిగినా వినోద్.. తన చెల్లిని తీసుకెళ్లి క్రికెట్ ఆడించేవాడు. 14 ఏళ్ల వయసులో హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అకాడమీకి రేణుక ఎంపికైంది.

అవకాశాలు రాకున్నా..
ఆ తర్వాత 2018-19 సీజన్ లో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర జట్టుకు ఆడుతూ 21 వికెట్లు పడగొట్టింది. దీంతో ఆమె జాతీయ జట్టు సెలక్టర్ల దృష్టిలో పడింది. ఆ తర్వాత ఛాలెంజర్ ట్రోఫీ, ఇండియా-ఏ జట్లకు ఎంపికైంది. జట్టుకు ఎంపికైనా ఝులన్ గోస్వామి కారణంగా అవకాశాలు అందుకోలేదు. ఫిబ్రవరిలో న్యూజిలాండ్ వేదికగా ముగిసిన వన్డే ప్రపంచకప్‌కు ఎంపికైనా.. ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఇక శ్రీలంక సిరీస్ ద్వారా అరంగేట్రం చేసిన ఆమె.. అక్కడ సత్తా చాటింది. ఆ ప్రదర్శనతో కామన్వెల్త్ గేమ్స్‌కు ఎంపికైంది. ఆస్ట్రేలియాతో అదరగొట్టి అందరి దృష్టిని ఆకర్షించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications