CWG 2022: భారత్‌తో ఫైనల్లో ఆస్ట్రేలియా తొండాట.. గెలుపు కోసం రూల్స్ బ్రేక్ చేసిన కంగారు టీమ్!

బర్మింగ్‌హామ్: కామన్వెల్త్ గేమ్స్‌లో ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు స్వర్ణ పతకం సాధించింది. భారత్‌తో ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన ఆసీస్ 9 పరుగులతో గెలుపొందింది. దాంతో కామన్వెల్త్ గేమ్స్‌లో మహిళా క్రికెట్ ప్రవేశ పెట్టిన మొదటిసారే చాంపియన్‌గా నిలిచి చరిత్ర సృష్టించింది. 2020 టీ20 ప్రపంచకప్‌తో పాటు 2022 వన్డే వరల్డ్ కప్ సొంతం చేసుకున్న ఆసీస్.. కామన్వెల్త్ గేమ్స్‌లోనూ అదే జోరును కొనసాగించింది. అయితే ఈ ఫైనల్లో గెలిచేందుకు ఆస్ట్రేలియా అడ్డదారులు తొక్కింది. టోర్నీ నిబంధనల ఉల్లంఘించిన ఆసీస్ ఫైనల్లో చీటింగ్ చేసింది.

కరోనా వచ్చిన ప్లేయర్‌తో..
ఈ ఫైనల్ మ్యాచ్‌కు ముందు ఆస్ట్రేలియా కీలక ప్లేయర్ తహిలా మెక్‌గ్రాత్ కరోనా బారిన పడింది. లక్షణాలు ఏమి లేకపోవడంతో ఆసీస్ మేనేజ్‌మెంట్ ఆమెను ఫైనల్లో ఆడించింది. టోర్నీ నిబంధన ప్రకారం కరోనా పాజిటీవ్ తేలిన ప్లేయర్‌ను ఐసోలేషన్‌కు తరలించాలి. కానీ ఆసీస్ మేనేజ్‌మెంట్ మాత్రం విజయం కోసం ఆ రూల్స్‌ను అతి క్రమించి కరోనా సోకిన తహిలా మెక్‌గ్రాత్‌ను బరిలోకి దింపింది. పైగా ఈ టోర్నీలో ఆమె సూపర్ ఫామ్‌లో ఉండటంతో పక్కన పెట్టే సాహసం ఆసీస్ మేనేజ్‌మెంట్ చేయలేకపోయింది. కరోనా పాజిటివ్ విషయాన్ని గోప్యంగా ఉంచి బరిలోకి దింపింది.


మ్యాచ్ అనంతరం వెలుగులోకి..
కరోనా పాజిటివ్ అని తేలినా బరిలో దిగిన మెక్‌గ్రాత్ స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేకపోయింది. బ్యాటింగ్‌లో 2 పరుగులు మాత్రమే చేసిన ఆమె బౌలింగ్‌లో 2 ఓవర్లు మాత్రమే వేసి 24 పరుగులిచ్చింది. ఒక్క వికెట్ కూడా తీయలేకపోయింది. అయితే తహిలా మెక్‌గ్రాత్‌కు కరోనా పాజిటీవ్ అనే విషయం ఫైనల్ అనంతరం తెలిసింది. దాంతో ఆమెతో కలిసి ఆడిన ఆస్ట్రేలియా ప్లేయర్లు అందరూ క్వారంటైన్‌లో గడిపి, కరోనా నెగిటివ్‌గా తేలిన తర్వాతే స్వదేశానికి బయలుదేరనున్నారు...

సర్వత్రా విమర్శలు..
బంగారు పతకం గెలవాలనే ఉద్దేశంతో నిబంధనలు ఉల్లంఘిస్తూ ఆస్ట్రేలియా జట్టు వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కరోనా పట్ల కఠినంగా వ్యవహరించే ఆస్ట్రేలియా.. ఇలా చేయడం సరికాదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నాయి. వారు వ్యవహరించిన తీరు క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని మండిపడుతున్నారు. మెడల్ కోసం మిగిలిన ప్లేయర్ల ప్రాణాలతో ఆడుకునే అధికారం, ఆస్ట్రేలియాకి ఎవరిచ్చారని నిలదీస్తున్నారు.
కరోనా వ్యాక్సిన్ చేయించుకోని కారణంగా ఆస్ట్రేలియా ఓపెన్ కోసం ఆసీస్ గడ్డ మీద అడుగుపెట్టిన స్టార్ టెన్నిస్ ప్లేయర్ నొవాక్ జొకోవిచ్‌ని ఘోరంగా అవమానించి, కేసులు కూడా పెట్టిన ఆ దేశం ఇప్పుడు ఇలా అడ్డదారులు తొక్కడం ఏంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

తహిలా సూపర్ ఫామ్..
పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 51 బంతుల్లో 10 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 78 పరుగులు చేసిన తహిలా మెక్‌గ్రాత్.. బౌలింగ్‌లోనూ 3 వికెట్లు పడగొట్టింది. న్యూజిలాండ్‌తో జరిగిన సెమీ ఫైనల్లో బౌలింగ్‌లో 2 రెండు వికెట్లు తీసిన తహిలా మెక్‌గ్రాత్.. 23 బంతుల్లో 6 ఫోర్లతో 34 పరుగులు చేసింది. బర్బొడాస్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ 3 వికెట్లు తీసి అదరగొట్టింది. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియా టీమ్ ఆమెను పక్కన పెట్టలేకపోయింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications