CWC 2023: పాకిస్థాన్‌తో మ్యాచ్.. గుడ్ న్యూస్ చెప్పిన రోహిత్ శర్మ!
అహ్మదాబాద్: వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌లో యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ బరిలోకి దిగుతాడని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్పష్టం చేశాడు. శనివారం జరిగే ఈ హై ఓల్టేజ్ మ్యాచ్‌కు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం ఆతిథ్యం ఇస్తోంది. ఇప్పటికే ఇరు జట్లు ముమ్మరంగా సాధన చేస్తుండగా.. బీసీసీఐ ఆరంభ వేడుకలను ప్లాన్ చేసింది.
భారత్-పాక్ మ్యాచ్ ప్రారంభానికి ముందు బాలీవుడ్ యాక్టర్స్, సింగర్స్ తమ ఆట పాటలతో అభిమానులను అలరించనున్నారు. ఈ హై ఓల్టేజ్ మ్యాచ్ నేపథ్యంలో శుక్రవారం మీడియాతో మాట్లాడిన రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'పాకిస్థాన్‌తో రేపు జరిగే మ్యాచ్‌కు శుభ్‌మన్ గిల్ 99 శాతం అందుబాటులో ఉంటాడు. అతను పూర్తిగా కోలుకొని ఈ మ్యాచ్‌కు సిద్దమయ్యాడు.

సొంతగడ్డపై ఆడటం ఏ జట్టుకు అయినా కలిసొచ్చేదే తప్పా డిస్ అడ్వాంటేజ్ కాదు. సొంత అభిమానుల మద్దతు జట్టు ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేస్తోంది. జట్టు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సొంత అభిమానులు అండగా నిలుస్తారు. వారి ప్రేమ మాకు బలంగా మారనుంది. అభిమానుల మద్దతును మా ఆటగాళ్లు ఆస్వాదిస్తున్నారు.
గత 9 నెలలుగా నేను సోషల్ మీడియా ఉపయోగించడం లేదు. ఇలాంటి విషయాలను ఆటగాళ్లు తమకు తోచిన విధంగా డీల్ చేస్తారు. పాకిస్థాన్‌తో మేం ఆడేది బిగ్ మ్యాచ్. గత రెండు మ్యాచ్‌ల్లో మేం అద్భుత ప్రదర్శన కనబర్చాం. అదే జోరును కొనసాగిస్తాం. ఇక గత రికార్డులను చూసుకొని మురిసే రకం కాదు నేను. గుడ్ క్రికెట్ ఆడటంపై మాత్రమే మేం ఫోకస్ పెట్టాం. రికార్డులు.. బయటి విషయాలు మాకు అనవసరం.
ఈ మ్యాచ్‌లో ఏ జట్టు ఫేవరేట్ కాదు. ఇరు జట్లు ఫ్రెష్‌గా మొదలుపెట్టాల్సిందే. ఒత్తిడిని అధిగమించి గుడ్ క్రికెట్ ఆడిన జట్టునే విజయం వరిస్తోంది. అహ్మదాబాద్‌లో డ్యూ ప్రభావం ఎలా ఉంటుందో నాకు తెలియదు. ఢిల్లీ, చెన్నై వేదికగా జరిగిన గత మ్యాచ్‌ల్లో మాత్రం డ్యూ పెద్దగా రాలేదు. టాస్ కీలకం కాదనుకుంటున్నా. జట్టుకు ఏది సౌకర్యమైతే అదే ఎంచుకుంటా.'అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.
డెంగ్యూ బారిన పడి తొలి రెండు మ్యాచ్‌లకు దూరమైన టీమిండియా స్టార్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్.. పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో బరిలోకి దిగనున్నాడు. ఇప్పటికే జట్టుతో కలిసి ప్రాక్టీస్ చేస్తున్న అతను.. తనకు అచ్చొచ్చిన మైదానంలో చెలరేగేందుకు సిద్దంగా ఉన్నాడు. అతని రాకతో ఇషాన్ కిషన్ బెంచ్‌కు పరిమితం కానున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications