Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

World Cup 2023: అందుకే ఇషాన్ కిషన్‌ను పక్కన పెట్టాం: రోహిత్ శర్మ

అహ్మదాబాద్: టీమిండియా స్టార్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ కోసమే ఇషాన్ కిషన్‌ను పక్కనపెట్టామని కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. ఇషాన్ కిషన్‌ను పక్కన పెట్టడం కఠిన నిర్ణయమేనని, కానీ తప్పలేదని స్పష్టం చేశాడు. వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా పాకిస్థాన్‌తో జరుగుతున్న హై ఓల్టేజ్ మ్యాచ్‌తో శుభ్‌మన్ గిల్ రీఎంట్రీ ఇచ్చాడు.

డెంగ్యూ బారిన పడిన శుభ్‌మన్ గిల్ తొలి రెండు మ్యాచ్‌లకు దూరంగా ఉన్నాడు. శుభ్‌మన్ గిల్ గైర్హాజరీలతో ఓపెనర్‌గా బరిలోకి దిగిన ఇషాన్ కిషన్ తొలి మ్యాచ్‌లో విఫలమైనా రెండో మ్యాచ్‌లో సత్తా చాటాడు. లెఫ్టాండర్ అయిన ఇషాన్ కిషన్‌ను జట్టు నుంచి తప్పించడంతో భారత్ టాప్-6 బ్యాటర్లలో మొత్తం రైట్ హ్యాండర్లే ఆడనున్నారు. పాకిస్థాన్‌తో టాస్ గెలిచిన రోహిత్ శర్మ బౌలింగ్ ఎంచుకున్నాడు.

CWC 2023: Rohit Sharma Reveals The Reason Why Ishan Kishan Dropped vs Pakistan

ఈ సందర్భంగా ఇషాన్ కిషన్‌ను పక్కన పెట్టడానికి గల కారణాన్ని వెల్లడించాడు. తప్పని పరిస్థితుల్లో ఇషాన్ కిషన్‌ను పక్కనపెట్టాల్సి వచ్చిందన్నాడు.
శుభ్‌మన్ గిల్ రీఎంట్రీ కోసమే ఇషాన్‌ను తప్పించామని చెప్పాడు. గిల్ గైర్హాజరీలో జట్టుకు అవసరమైనప్పుడల్లా ఇషాన్ కిషన్ సత్తా చాటాడని కొనియాడాడు.

శుభ్‌మన్ గిల్ తమకు స్పెషల్ ప్లేయర్ అని చెప్పిన రోహిత్ శర్మ.. గతేడాదిగా అతను నిలకడగా రాణిస్తున్నాడని తెలిపాడు. ముఖ్యంగా అహ్మదాబాద్ గ్రౌండ్‌లో అతనికి మంచి రికార్డు ఉందని, దాంతోనే తుది జట్టులోకి తీసుకున్నామని రోహిత్ శర్మ స్పష్టం చేశాడు. ఈ బిగ్ మ్యాచ్ తమకు ఓ డ్రీమ్ గేమ్ అని చెప్పిన రోహిత్.. తమ ఆటగాళ్లంతా ఈ మ్యాచ్‌ను ఆస్వాదిస్తారని తెలిపాడు.

డ్యూ ప్రభావం ఉంటుందనే ముందుగా బౌలింగ్ తీసుకున్నానని వెల్లడించాడు. అత్యుత్తమ ప్రదర్శన కనబర్చేందుకు ప్రయత్నిస్తామని చెప్పిన రోహిత్.. ప్రత్యర్థిని స్వల్ప స్కోర్‌కు పరిమితం చేసి.. బ్యాటింగ్‌లో చెలరేగుతామని చెప్పాడు. అభిమానుల అల్లరిని ఉద్దేశించి.. ఇది ట్రైలర్ మాత్రమేనని, అసలు సినిమా ముందుందని హోస్ట్‌ రవి శాస్త్రికి తెలియజేశారు.

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్ నిలకడగా ఆడుతోంది. ఓపెనర్లు అబ్దుల్లా షఫీక్(20), ఇమామ్ ఉల్ హక్(36)త్వరగానే ఔటైనా.. బాబర్ ఆజామ్, మహమ్మద్ రిజ్వాన్ నిలకడగా బ్యాటింగ్ చేస్తున్నారు.

Story first published: Saturday, October 14, 2023, 16:23 [IST]
Other articles published on Oct 14, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+