Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

CWC 2023: కేన్ మామ క్లాస్ బ్యాటింగ్.. బంగ్లాదేశ్‌పై న్యూజిలాండ్ ఘన విజయం!

చెన్నై: వన్డే ప్రపంచకప్ 2023లో న్యూజిలాండ్ జోరు కొనసాగుతోంది. అద్భుత ప్రదర్శన హ్యాట్రిక్ విజయం నమోదు చేసింది. బంగ్లాదేశ్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రానించిన న్యూజిలాండ్ 8 వికెట్ల తేడాతో గెలుపొందింది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 245 పరుగులే చేసింది. బంగ్లా బ్యాటర్లలో ముష్ఫికర్ రహామ్(74 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 66) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించగా.. కెప్టెన్ షకీబ్ అల్ హసన్(51 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 40), టెయిలెండర్ మహ్మదుల్లా(49 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 41 నాటౌట్) పర్వాలేదనిపించారు.

 CWC 2023: New Zealand beat Bangladesh by 8-wickets After Daryl Mitchell unbeaten knock

న్యూజిలాండ్ బౌలర్లలో లాకీ ఫెర్గూసన్(3/49) మూడు వికెట్లు తీయగా.. ట్రెంట్ బౌల్డ్(2/36), మ్యాట్ హెన్రీ(2/56) రెండేసి వికెట్లు పడగొట్టారు. మిచెల్ సాంట్నర్, గ్లేన్ ఫిలిప్స్‌కు తలో వికెట్ దక్కింది.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన న్యూజిలాండ్ 42.5 ఓవర్లలో 2 వికెట్లకు 248 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. డారిల్ మిచెల్(67 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 89 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో చెలరేగగా.. కేన్ విలియమ్సన్(107 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్‌తో 78) క్లాస్ బ్యాటింగ్ చేశాడు.

డెవాన్ కాన్వే(59 బంతుల్లో 3 ఫోర్లతో 45) తృటిలో హాఫ్ సెంచరీ చేజార్చుకున్నాడు. బంగ్లాదేశ్ బౌలర్లలో ముస్తాఫిజుర్ రెహ్మాన్, షకీబ్ అల్ హసన్ చెరో వికెట్ పడగొట్టారు.

స్వల్ప లక్ష్యచేధనకు దిగిన న్యూజిలాండ్‌కు శుభారంభం దక్కలేదు. సూపర్ ఫామ్‌లో ఉన్న రచిన్ రవీంద్ర(9) ఈ మ్యాచ్‌లో తీవ్రంగా నిరాశపరిచాడు. ముస్తాఫిజుర్ రెహ్మాన్ బౌలింగ్‌లో కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. క్రీజులోకి వచ్చిన కేన్ విలియమ్సన్‌తో కలిసి డెవాన్ కాన్వే ఇన్నింగ్స్‌ను ముందుకునడిపించాడు. క్రీజులో సెట్ అయ్యేందుకు ఈ జోడీ టైమ్ తీసుకోవడంతో న్యూజిలాండ్ పవర్ ప్లేలో వికెట్ నష్టానికి 37 పరుగులే చేసింది.

అనంతరం కాస్త దూకుడు పెంచిన ఈ జోడీ వేగంగా పరుగులు రాబట్టింది. 80 పరుగుల భాగస్వామ్యంతో ప్రమాదకరంగా మారిన ఈ జోడీని షకీబ్ అల్ హసన్ విడదీసాడు. డెవాన్ కాన్వేను వికెట్ల ముందు బోల్తాకొట్టించాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన డారిల్ మిచెల్‌తో కలిసి కేన్ విలియమ్సన్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు.

చాలా రోజుల తర్వాత బరిలోకి దిగిన కేన్ మామ క్లాస్ బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. 81 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న కేన్ మామ అదే జోరును కొనసాగించాడు. ఆ కొద్ది సేపటికే డారిల్ మిచెల్ సైతం 43 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఉక్కపోత వాతావరణంలో బ్యాటింగ్‌కు ఇబ్బంది పడిన కేన్ విలియమ్సన్‌ రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. క్రీజులోకి వచ్చిన గ్లేన్ ఫిలిప్స్(16 నాటౌట్) సాయంతో డారిల్ మిచెల్ విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు.

Story first published: Friday, October 13, 2023, 22:17 [IST]
Other articles published on Oct 13, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+