న్యూఢిల్లీ: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్‌కు టీమిండియా దిగ్గజ స్పిన్నర్ హర్భజన్ సింగ్ అదిరిపోయే కౌంటరిచ్చాడు. భారత్ అంటేనే విద్వేషం చూపే మైకేల్ వాన్.. వన్డే ప్రపంచకప్ నిర్వహణ విషయంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)ని తక్కువ చేసే ప్రయత్నం చేశాడు. ఎక్స్ వేదికగా భారత్-అఫ్గానిస్థాన్ మ్యాచ్‌కు అభిమానులు లేరని ప్రశ్నించాడు.
ఇతర మ్యాచ్‌లే కాకుండా.. భారత్ మ్యాచ్‌కు కూడా ప్రేక్షకులు ఎందుకు రావడం లేదని ప్రశ్నించాడు. భారత్-అఫ్గాన్ మ్యాచ్‌కు మైదానంలోని కుర్చీలన్నీ ఖాళీగా ఉన్నాయని ట్వీట్ చేశాడు. అయితే ఈ కామెంట్‌కు హర్భజన్ సింగ్ అదిరిపోయే రీతిలో బదులిచ్చాడు. 'మైకేల్ వాన్.. నువ్వు మ్యాచ్ చూస్తున్నావా? ఖాళీ సీట్లనా?'అని ప్రశ్నించాడు.

ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. మైకేల్ వాన్.. టీమిండియా తప్పిదాలను వెతికే పనిలో ఉన్నాడని, అతనికి ఖాళీ సీట్లు మాత్రమే కనిపిస్తాయని ఫ్యాన్స్ సెటైర్లు పేల్చుతున్నారు.
ప్రపంచకప్ మ్యాచ్‌లు మధ్యాహ్న సమయంలో ప్రారంభమవుతుండగా.. చాలా మంది అభిమానులు సాయంత్ర వేళలో స్టేడియానికి వస్తున్నారు. భారత్-అఫ్గాన్ మ్యాచ్ వీకెండ్‌లో కాకుండా వీక్ మధ్యలో జరగడం.. పైగా అఫ్గాన్ ముందుగా బ్యాటింగ్ చేయడంతో చాలా మంది అభిమానులు ఆలస్యంగా మైదానానికి వచ్చారు. ఉద్యోగ బాధ్యతలు పూర్తయిన తర్వాత తీరిగ్గా మైదానానికి వస్తున్నారు. భారత బ్యాటింగ్ దిగే సమయానికి మైదానమంతా అభిమానులతో కిక్కిరిసిపోయింది.
అఫ్గానిస్థాన్‌తో మ్యాచ్‌లో టీమిండియా 8 వికెట్ల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. కెప్టెన్ రోహిత్ శర్మ విధ్వంసకర సెంచరీతో చెలరేగగా.. కింగ్ కోహ్లీ హాఫ్ సెంచరీతో రాణించాడు.
భారత్-పాక్ హై ఓల్టేజ్ మ్యాచ్ కోసం ఇరు జట్లు సిద్దమయ్యాయి. విజయమే లక్ష్యంగా సన్నదమవుతున్నాయి. డెంగ్యూ బారిన పడిన యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ పూర్తిగా కోలుకున్నాడు.
వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా శనివారం అహ్మదాబాద్ వేదికగా జరిగే మ్యాచ్‌లో భారత్-పాకిస్థాన్ జట్లు తలపడుతున్నాయి. ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టిన అతను తనకు అచ్చొచ్చిన అహ్మదాబాద్ మైదానంలోనే రీఎంట్రీ ఇవ్వనున్నాడు. ఇప్పటికే ఆస్ట్రేలియా, అఫ్గాన్‌పై భారీ విజయాలు నమోదు చేసిన భారత్.. మంచి జోష్ మీద ఉంది. అదే జోరులో పాక్‌ను మట్టికరిపించాలనుకుంటోంది.