Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Gautam Gambhir: బుమ్రా ముందు ఆ పాక్ పేసర్ జుజుబీ!

న్యూఢిల్లీ: పాకిస్థాన్ స్టార్ పేసర్ షాహిన్ షా అఫ్రిది కంటే టీమిండియా యార్కర్ల కింగ్ జస్‌ప్రీత్ బుమ్రానే ప్రమాదకరమైన బౌలరని దిగ్గజ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ అన్నాడు. ఏ లెక్కన చూసుకున్నా.. బుమ్రాకు షాహిన్ అఫ్రిది సాటి రాడని అభిప్రాయపడ్డాడు. ఈ ఇద్దరి మధ్య చాలా వ్యత్యాసం ఉందని తెలిపాడు.

వన్డే ప్రపంచకప్‌ 2023లో భాగంగా శనివారం అహ్మదాబాద్ వేదికగా జరిగే మ్యాచ్‌లో భారత్-పాకిస్థాన్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌ నేపథ్యంలో జస్‌ప్రీత్ బుమ్రా, షాహిన్ షా అఫ్రిది ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అధికారిక బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్‌ షోలో ఈ ఇద్దరు పేసర్లలో ఎవరు ప్రమాదకరమనే చర్చ జరగ్గా గంభీర్.. బుమ్రా పేరు సూచించాడు.

 CWC 2023: Gautam Gambhir says Jasprit Bumrah is most lethal bowler than Shaheen Afridi

'ఆస్ట్రేలియాతో చెన్నై పిచ్‌పై మిచెల్‌ మార్ష్‌ను బుమ్రా ఔట్ చేసిన విధానం అద్భుతం. అలాగే అఫ్గాన్ ఓపెనర్ ఇబ్రహీం జడ్రాన్‌ను కూడా ఇదే తరహాలో ఔట్ చేశాడు. అందుకే ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర బౌలర్ అంటే బుమ్రా పేరే సూచిస్తా. ఇప్పుడు అందరూ బుమ్రా-షాహిన్ అఫ్రిదిని పోలుస్తున్నారు. కానీ ఈ ఇద్దరి బౌలింగ్‌లో చాలా వ్యత్యాసాలు ఉన్నాయి.

ప్రతీ దశలోనూ బంతితో అద్భుతాలు చేసేవారు చాలా తక్కువగా ఉంటారు. కొందరు కొత్త బంతితో చెలరేగితే.. మరికొందరు డెత్ ఓవర్లలో ప్రభావం చూపుతారు. మరికొందరు మిడిల్ ఓవర్లలో సత్తా చాటుతారు. కానీ బుమ్రా మాత్రం ఆట ఆరంభంలోనూ.. మిడిల్ ఓవర్లలోనూ.. డెత్ ఓవర్లలోనూ తన ప్రభావం చూపించగలడు.

 CWC 2023: Gautam Gambhir says Jasprit Bumrah is most lethal bowler than Shaheen Afridi

బంతి కొత్తదా? పాతదా? అనేది కూడా అతనికి అనవసరం. కానీ షాహిన్ అఫ్రిది ఇలా కాదు. కొత్త బంతితో మాత్రమే అతను ప్రభావం చూపగలడు.'అని గంభీర్ చెప్పుకొచ్చాడు. భారత్-పాక్ హై ఓల్టేజ్ మ్యాచ్ కోసం ఇరు జట్లు సిద్దమయ్యాయి. విజయమే లక్ష్యంగా సన్నదమవుతున్నాయి. డెంగ్యూ బారిన పడిన యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ పూర్తిగా కోలుకున్నాడు.

ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టిన అతను తనకు అచ్చొచ్చిన అహ్మదాబాద్ మైదానంలోనే రీఎంట్రీ ఇవ్వనున్నాడు. ఇప్పటికే ఆస్ట్రేలియా, అఫ్గాన్‌పై భారీ విజయాలు నమోదు చేసిన భారత్.. మంచి జోష్ మీద ఉంది. అదే జోరులో పాక్‌ను మట్టికరిపించాలనుకుంటోంది.

Story first published: Friday, October 13, 2023, 17:07 [IST]
Other articles published on Oct 13, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+