Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

జస్‌ప్రీత్ బుమ్రా 400 టెస్ట్ వికెట్లు తీయడం పక్కా: వెస్టిండీస్ మాజీ పేసర్

Curtly Ambrose says Jasprit Bumrah will get to 400 Test wickets
Jasprit Bumrah Short Run Up తో ప్రాబ్లం లేదు అంటున్న లెజెండరీ బౌలర్ || Oneindia Telugu

న్యూఢిల్లీ: టీమిండియా స్టార్ పేసర్, యార్కర్ల కింగ్ జస్‌ప్రీత్ బుమ్రాపై వెస్టిండీస్ మాజీ పేసర్ కర్ట్‌ లీ ఆంబ్రోస్ ప్రశంసల జల్లు కురిపించాడు. టెస్ట్‌ల్లో 400 వికెట్లు తీసే సత్తా బుమ్రాకు ఉందని కొనియాడాడు. ఇదే ఫిట్‌నెస్‌తో అతను ఆటలో కొనసాగితే సులువుగా ఈ మార్క్‌ను అందుకుంటాడని ధీమా వ్యక్తం చేశాడు. తాజాగా ఓ యూట్యాబ్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బుమ్రా సీమ్, స్వింగ్, యార్కర్లతో అన్ని విధాలుగా బౌలింగ్ చేయగలడని తెలిపాడు.

నేన్ బిగ్ ఫ్యాన్..

నేన్ బిగ్ ఫ్యాన్..

'నేను బుమ్రాకు పెద్ద అభిమానిని. భారత్​లో ఉత్తమమైన ఫాస్ట్​ బౌలర్లు కొంతమంది ఉన్నారు. నేను చూసిన బౌలర్లలో అతడు ఎంతో ప్రత్యేకం, ప్రతిభావంతుడు. భవిష్యత్​లో మరింత బాగా, ఎక్కువ కాలం రాణిస్తాడని ఆశిస్తున్నాను. సీమ్​, స్వింగ్​, యార్కర్లు.. ఇలా అన్ని విధాలుగా బౌలింగ్​ చేయగలడు. కాబట్టి ఎక్కువ కాలం ఆరోగ్యంగా, ఫిట్​గా ఉండి ఆడగలిగితే కచ్చితంగా 400 వికెట్లను అందుకోవడం ఖాయం" అని ఆంబ్రోస్ అన్నాడు.

బలంగా ఉంటే..

బలంగా ఉంటే..

ఇక బుమ్రా రనప్ గురించి మాట్లాడుతూ.. అతని షార్ట్ రనప్‌తో వచ్చిన సమస్యేం లేదన్నాడు. 'ఫాస్ట్ బౌలింగ్.. బౌలర్ రిథమ్‌పై ఆధారపడి ఉంటుంది. బంతి వేసే ముందు మంచి రిథమ్ ఉండటం ముఖ్యం. బుమ్రాకు షార్ట్ రనప్ ఉంది. ఒకటి రెండు జాగ్స్ మినహా అతని రనప్ నడకలానే ఉంటుంది. దీన్ని బట్టి అతను శరీరంపై ఒత్తిడి పెడ్తాడనే విషయం అర్థం అవుతుంది. అయితే అతను బలంగా ఉంటే వచ్చే సమస్యే ఏం లేదు. అతను ఫిట్‌గా ఉండి తన బౌలింగ్‌ను కొనసాగిస్తే తిరుగుండదు'అని ఆంబ్రోస్ చెప్పుకొచ్చాడు.

 19 టెస్ట్‌లు.. 83 వికెట్లు..

19 టెస్ట్‌లు.. 83 వికెట్లు..

ఇప్పటివరకు బుమ్రా 19 టెస్టుల్లో 83 వికెట్లు తీశాడు. 63 వన్డేల్లో 108 వికెట్లు, 50 టీ20ల్లో 59 వికెట్లు పడగొట్టాడు. త్వరలో జరగబోయే ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్​ ఫైనల్​, ఇంగ్లాండ్​ సిరీస్​లోనూ ఇతడు ఆడనున్నాడు. ఇక 1980-2000 వరకు విండీస్ తరఫున ఆడిన ఆంబ్రోస్ 98 టెస్ట్‌ల్లో 405 వికెట్లు పడగొట్టాడు. 176 వన్డేల్లో 225 వికెట్లు తీశాడు. 6 అడుగుల 7 ఇంచుల ఎత్తు ఉంటే ఆంబ్రోస్ బౌలర్‌గా అద్భుత ప్రదర్శన కనబర్చాడు. అతను వేసే బంతులను ఎదుర్కోవడానికి బ్యాట్స్‌మెన్ ఇబ్బంది పడేవారు.

Story first published: Sunday, May 9, 2021, 17:45 [IST]
Other articles published on May 9, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+