5 బంతుల్లో 5 వికెట్లు! (వీడియో)
ఐర్లాండ్ ఆల్‌రౌండర్ కర్టిస్ కాంఫెర్ చరిత్ర సృష్టించాడు. టీ20 క్రికెట్‌లో అత్యంత అరుదైన ఫీట్ సాధించాడు. 5 బంతుల్లో 5 వికెట్లు తీసి.. పురుషుల క్రికెట్‌లో ఈ ఘనతను అందుకున్న తొలి ఆటగాడిగా నిలిచాడు. ఇంటర్ ప్రొవిన్షియల్ టీ20 ట్రోఫీలో మన్‌స్టర్ రైడ్స్‌కు ప్రాతినిథ్యం వహించిన కర్టిస్ కాంఫెర్.. గురువారం నార్త్ వెస్ట్ వారియర్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ఈ అరుదైన ఘనతను అందుకున్నాడు. అయితే అతను ఒకే ఓవర్‌లో ఈ ప్రదర్శన చేయలేదు. కాంఫెర్ 12వ ఓవర్‌లో చివరి రెండు బంతులకు ప్రత్యర్థి బ్యాటర్లు అయిన విల్సన్, హ్యూమ్‌లను ఔట్ చేశాడు.
తర్వాతి 14వ ఓవర్‌లో తొలి మూడు బంతుల్లో మెక్‌బ్రిన్, మిల్లర్, జోష్‌లను పెవిలియన్ చేర్చాడు. మొత్తం 2.3 ఓవర్లలో 16 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. ప్రోఫెషనల్ క్రికెట్‌లో ఇప్పటి వరకు ఏ ఆటగాడు 5 బంతుల్లో 5 వికెట్లు తీయలేదు. మహిళా క్రికెట్‌లో మాత్రం 2024లో ఈగల్స్ ఉమెన్ జట్టుపై జింబాబ్వే ప్లేయర్ కెలిస్ ఎండోవు 5 బంతుల్లో 5 వికెట్లు పడగొట్టింది.

కర్టిస్ కాంఫెర్ అంతర్జాతీయ క్రికెట్‌లోనూ 4 బంతుల్లో 4 వికెట్లు తీసాడు. టీ20 ప్రపంచకప్ 2021లో నెదర్లాండ్స్‌పై అతను ఈ ఫీట్ సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 4 బంతుల్లో 4 వికెట్లు తీయడమే రికార్డ్‌గా ఉంది. 2007 వన్డే ప్రపంచకప్‌లో శ్రీలంక దిగ్గజం లసిత్ మలింగా తొలిసారి 4 బంతుల్లో 4 వికెట్లు తీసాడు. సౌతాఫ్రికాపై అతను ఈ ఫీట్ సాధించాడు. టీ20ల్లోనూ అతను న్యూజిలాండ్‌పై 2019లో ఈ ఘనతను అందుకున్నాడు. రెండు సార్లు ఈ ఫీట్ సాధించిన ఆటగాడిగా చరిత్రకెక్కాడు. 2019లో ఐర్లాండ్‌పై రషీద్ ఖాన్ ఈ ఫీట్ సాధించాడు. టీ20ల్లో ఈ రికార్డ్ సాధించి తొలి బౌలర్‌గా అతను నిలిచాడు. 2022లో ఇంగ్లండ్‌పై ఈ ఘనతను అందుకున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications