Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

CSK vs SRH: బ్యాటింగ్ హైదరాబాద్‌దే.. అంబటి రాయుడు వచ్చేశాడు!

Chennai Super Kings vs Sunrisers Hyderabad

దుబాయ్: చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. నెమ్మదైన వికెట్ కావడం, చేజింగ్‌లో ప్రత్యర్థిని కట్టడి చేసే సత్తా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నామని వార్నర్ చెప్పుకొచ్చాడు. ఇక టాస్ గెలిస్తే తాము కూడా బ్యాటింగ్ తీసుకునేవాళ్లమని సీఎస్‌కే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ చెప్పాడు. వికెట్ చాలా నెమ్మదిగా ఉంటుందని అంచనా వేస్తున్నట్లు తెలిపాడు.

ఇక హైదరాబాద్ ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతుండగా చెన్నై మూడు మార్పులు చేసింది. గాయం నుంచి కోలుకున్న అంబటి రాయుడు, డ్వేన్ బ్రావో జట్టులోకి వచ్చారు. వారితో పాటు శార్దుల్ ఠాకుర్ కూడా తుది జట్టులో అవకాశం దక్కించుకున్నాడు. గత మ్యాచ్‌ల్లో విఫలమైన రుతురాజ్ గైక్వాడ్, మురళీ విజయ్, జోష్ హజల్‌వుడ్ ఉద్వాసనకు గురయ్యారు.

గత‌ మ్యాచ్‌‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌‌పై సాధించిన వన్‌‌సైడ్‌‌ విక్టరీతో సన్‌‌రైజర్స్‌‌ హైదరాబాద్‌‌ఫుల్‌‌ జోష్‌‌లో ఉండగా.. వరుసగా రెండు ఓటములతో కష్టాల్లో ఉన్న చెన్నై సూపర్‌‌ కింగ్స్‌ ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉంది. ఇప్పటిదాకా లీగ్‌‌లో మూడు మ్యాచ్‌‌లు ఆడిన ఇరుజట్లు చెరో ఒక విజయం మాత్రమే సాధించాయి. పాయింట్ల పట్టికలో చివరి రెండు స్థానాల్లో నిలిచాయి. బ్యాటింగ్‌‌ లైనప్‌‌ విషయంలో సీఎస్‌‌కే పలు సమస్యలు ఎదుర్కొంటుండగా... హైదరాబాద్‌‌కు మాత్రం బ్యాటింగ్‌‌లో పెద్దగా సమస్యలు లేవు. కెప్టెన్‌‌ డేవిడ్‌‌ వార్నర్‌‌, బెయిర్‌‌స్టో, విలియమ్సన్‌‌, మనీశ్‌‌ పాండే మంచి టచ్‌‌లో ఉన్నారు.

ముఖ్యంగా విలియమ్సన్‌‌ తుది జట్టులోకి రావడంతో సన్‌‌రైజర్స్‌‌ మిడిలార్డర్‌‌ బలంగా తయారైంది. ఢిల్లీ మ్యాచ్‌‌లో ఇది రుజువు‌ అయ్యింది. మరోవైపు అంబటి రాయుడు, డ్వేన్ బ్రావో గాయం నుంచి కోలుకోవడం చెన్నై బలాన్ని పెంచింది. ఐపీఎల్ టోర్నీలో ఇప్పుటి వరకు ఈ రెండు జట్లు 12 సార్లు తలపడగా 9-3తో చెన్నై లీడ్‌లో ఉంది. అదే ఆధిపత్యం చెలాయించాలని ధోనీ సేన భావిస్తుండగా.. లెక్క సరిచేయాలని హైదరాబాద్ భావిస్తోంది.

తుది జట్లు:

చెన్నై సూపర్ కింగ్స్: షేన్ వాట్సన్, ఫాఫ్ డూప్లెసిస్, అంబటి రాయుడు, సామ్ కరన్, కేదార్ జాదవ్, ఎంఎస్ ధోనీ(కెప్టెన్, కీపర్), రవీంద్ర జడేజా, దీపక్ చాహర్, పియూష్ చావ్లా, డ్వేన్ బ్రావో

సన్‌రైజర్స్ హైదరాబాద్: డేవిడ్ వార్నర్(కెప్టెన్), జానీ బెయిర్ స్టో(కీపర్), మనీష్ పాండే, కేన్ విలియమ్సన్, అబ్దుల్ సమద్, అభిషేక్ శర్మ, ప్రియమ్ గార్గ్, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, నటరాజన్, ఖలీల్ అహ్మద్

Story first published: Friday, October 2, 2020, 19:15 [IST]
Other articles published on Oct 2, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+