
కేన్ రనౌట్:
సన్‌రైజర్స్ యువ బ్యాట్స్‌మన్ ప్రియమ్ గార్గ్ క్రీజులోకి అడుగు పెట్టే సమయానికి ఆ జట్టు స్కోరు 69/3. సన్‌రైజర్స్ బ్యాటింగ్‌కు మూల స్తంభాలైన ముగ్గురు బ్యాట్స్‌మెన్‌లు జానీ బెయిర్‌స్టో (0), డేవిడ్ వార్నర్ (28), మనీష్ పాండే (29) ఔటైపోవడంతో.. ఇక ఆశలన్నీ కేన్ విలియమ్సన్ మీదే ఉన్నాయి. ఇలాంటి సమయంలో గార్గ్ కారణంగా కేన్ రనౌటైపోయాడు. షార్ట్ మిడ్‌వికెట్‌లోకి బంతిని పంపి కేన్ పరుగు తీస్తూ ముందుకొచ్చేయగా.. అవతలి నుంచి గార్గ్ రాలేదు. చెన్నై ఫీల్డర్ అంబటి రాయుడు బంతిని వేగంగా కీపర్ ఎంఎస్ ధోనీకి విసిరాడు. దీంతో సగం పిచ్ నుంచి వెనక్కి మళ్లిన విలియమ్సన్ రనౌటైపోయాడు. ఆ సమయంలో అందరూ గార్గ్‌ను తిట్టుకున్నవాళ్లే. సన్‌రైజర్స్‌కు అతను పెద్ద నష్టమే చేశాడని అంతా తిట్టిపోశారు.

23 బంతుల్లోనే అర్ధ శతకం:
కేన్ విలియమ్సన్ పెవిలియన్ చేరిన అనంతరం ప్రియమ్ గార్గ్ విఫలమై ఉంటే.. అంతే సంగతులు. కానీ పరీక్షా సమయంలో అతను పట్టుదలతో నిలిచాడు. ముందు క్రీజులో నిలదొక్కుకుని ఆ తర్వాత ధాటిగా షాట్లు ఆడాడు. ముఖ్యంగా సామ్ కరన్ వేసిన 17వ ఓవర్లో చెలరేగిపోయాడు. వరుసగా 4, 4, 6, 4 బాదాడు. ఈ క్రమంలో గార్గ్ 23 బంతుల్లోనే అర్ధ శతకం చేశాడు. అంతేకాదు అభిషేక్ శర్మతో కలిసి ఐదో వికెట్‌కు 55 బంతుల్లోనే 75 పరుగులు జోడించాడు. దీంతో సన్‌రైజర్స్ 160 మార్కును దాటింది.

బాధపడకు.. నీ బ్యాటింగ్ బాగుంది:
'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు అందుకున్న అనంతరం ప్రియమ్ గార్గ్ మాట్లాడుతూ... కేన్ విలియమ్సన్ రనౌట్ అయి పెవిలియన్ చేరుతున్నపుడు చాలా బాధపడ్డా అని తెలిపాడు. 'నా తప్పిదం కారణంగా విలియమ్సన్ రనౌట్ అయి పెవిలియన్ చేరుతున్నపుడు చాలా బాధపడ్డా. సన్‌రైజర్స్ ఇన్నింగ్స్ అనంతరం డౌగౌట్‌కు చేరుకోగానే.. కేన్ నాతో మాట్లాడాడు. బాగా ఆడావ్.. బాధపడకు. ఆ రనౌట్ గురించి మర్చిపో. నీ బ్యాటింగ్ చాలా బాగుంది' అని అన్నాడు. కేన్ అలా అనగానే నాలో ఉన్న గిల్టీ ఫీలింగ్ పోయిందన్నాడు.

ఈ రోజు అదే సహాయపడింది:
'మ్యాచ్ గెలిచినందుకు ఈ రోజు చాలా సంతోషంగా ఉంది. సీనియర్ ఆటగాళ్లతో ఆడడం ఎప్పుడూ ప్రత్యేకమే. నా ఆట గురించి నాకు తెలుసు కాబట్టి సహజ శైలిలో ఆడాను. ఈ క్రెడిట్ అంతా జట్టు యాజమాన్యానిదే. వారు నాకు అండగా నిలిచారు. నేను చిన్నప్పటి నుంచి అభిషేక్ శర్మతో ఆడుతున్నాను. మా ఇద్దరికీ ఒకరి ఆట గురించి మరొకరికి బాగా తెలుసు. నిజంగా ఈ రోజు అదే సహాయపడింది. బ్యాటింగ్, ఫీల్డింగ్ చేసేటప్పుడు మంచి ఆత్మవిశ్వసంతో ఉన్నాను' అని గార్గ్ తెలిపాడు.
CSK vs SRH: సన్‌రైజర్స్‌తో మ్యాచ్.. చెన్నై ఓటమికి ఈ మూడు తప్పిదాలే కారణం?


Click it and Unblock the Notifications












