
చావ్లాతో మరో ఓవర్ వెయించుంటే:
ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ కొన్ని అవసర తప్పిదాలు చేసింది. స్పిన్నర్ పియూష్ చావ్లాతో కెప్టెన్ ఎంఎస్ ధోనీ కేవలం 3 ఓవర్లు మాత్రమే వేయించాడు. 9వ ఓవర్ వేసిన చావ్లా.. 8 పరుగులు ఇచ్చాడు. 11వ ఓవర్లో 6 పరుగులే ఇచ్చి డేవిడ్ వార్నర్‌ను ఔట్ చేశాడు. ఇక 13వ ఓవర్లో కూడా 6 పరుగులే ఇచ్చాడు. ఆపై పేసర్లను రంగంలోకి దించిన ధోనీ.. చావ్లాతో బౌలింగ్ వేయించలేదు. ఒకవేళ 15వ ఓవర్ వేసుంటే.. అభిషేక్ శర్మ, ప్రియమ్ గార్గ్‌లలో ఒకరు ఔటై ఉండేవారు. అప్పుడు తక్కువ స్కోరుకే సన్‌రైజర్స్ పరిమితమయ్యేది.

రషీద్ బౌలింగ్‌లో అతి జాగ్రత్త:
లక్ష్య ఛేదనలో రషీద్ ఖాన్ ఒక్క వికెట్ కూడా తీయలేదు. అయితే కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి 4 ఓవర్లలో కేవలం 12 పరుగులు మాత్రమే ఇచ్చాడు. రషీద్ బౌలింగ్ వేయడానికి వచ్చేసరికి ఎంతో అనుభవం ఉన్న ఎంఎస్ ధోనీ, రవీంద్ర జడేజాలు క్రీజులో ఉన్నారు. వీరిద్దరూ అతని బౌలింగ్‌లో అతి జాగ్రత్తగా ఆడారు. బౌండరీల మాట పక్కన పెడితే.. కనీసం సింగిల్స్ తీయడానికి కూడా ఆపసోపాలు పడ్డారు. రషీద్ బౌలింగ్‌లో ఈ జోడి కనీసం బంతికో సింగిల్ తీసినా.. మరో 12 పరుగులు వచ్చేవి. లేదా ఒక్కరు ఎదురుడి దాడి చేసినా.. ఫలితం మరోలా ఉండేది.

కరన్, బ్రావో క్రీజులోకి వస్తే:
ఛేదనలో 15 ఓవర్లలో చెన్నై 79 పరుగులే చేసింది. చివరి 5 ఓవర్లలో హిట్టింగ్ చేయొచ్చనే ఉద్దేశంలో రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోనీ కనిపించారు. జడేజా హిట్టింగ్ చేసినా.. ధోనీ షాట్లు ఆడలేకపోయాడు. రన్ రేట్ భారీగా ఉన్నా.. ధోనీ ఆఖరి వరకు స్లోగానే ఆడటం ఆశ్చర్యపరిచింది. ఇక్కడ చెన్నై బ్యాటింగ్ బలంగా ఉందనే విషయం మహీ మర్చిపోయినట్టున్నాడు. ఒకరు ఔటైనా సామ్ కరన్, డ్వేన్ బ్రావో లాంటి హిట్టర్లు బ్యాటింగ్‌కు వస్తారు. అయినా కూడా ధోనీ, జడేజా హిట్టింగ్ చేయలేదు. కరన్, బ్రావో క్రీజులోకి వస్తే.. చెన్నై విజయం సాధించేదే.

ఇవి కూడా కారణాలే:
ప్రియమ్ గార్గ్, అభిషేక్ శర్మ భాగస్వామ్యంను చెన్నై విడదీసుంటే.. సన్‌రైజర్స్ అన్ని పరుగులు చేసేది కాదు. చెన్నై బ్యాటింగ్ విభాగానికి వెన్నెముకగా మారిన ఫాఫ్ డుప్లెసిస్ రనౌట్ కావడం కూడా చెన్నై విజయంపై ప్రభావం చూపింది. ఎందుకంటే.. ఇప్పటివరకు చెన్నై జట్టులో రాణించింది కేవలం ఫాఫ్ మాత్రమే. ఇక గాయం నుంచి కోలుకున్న అంబటి రాయుడు కూడా పూర్తిగా విఫలమయ్యాడు. చెన్నైకి మంచి ఆరంభం దక్కపోవం కూడా ఓటమికి కారణమైంది. హిట్టర్ షేన్ వాట్సన్ 6 బంతులు ఆడి ఒక పరుగే చేశాడు. ఇవి కూడా చెన్నై విజయంపై ప్రభావం చూపాయి.
CSK vs SRH: చిన్నప్పటి నుంచి మేమిద్దరం కలిసి ఆడుతున్నాం.. అదే ఈరోజు కలిసొచ్చింది: గార్గ్


Click it and Unblock the Notifications












