
శుభారంభం దక్కలేదు..
ఇక టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. ఓపెనర్ జానీ బెయిర్‌స్టో(0)ను దీపక్ చాహర్ క్లీన్ బౌల్డ్ చేయడంతో ఆరెంజ్ ఆర్మీకి శుభారంభం దక్కలేదు. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన మనీష్ పాండే ధాటిగా ఆడాడు. ఓవైపు కెప్టెన్ డేవిడ్ వార్నర్ నిదానంగా ఆడుతున్నా.. మరోవైపు మనీష్ పాండే ఓవర్‌కు ఒక బౌండరీ బాదుతూ రన్‌రేట్ తగ్గకుండా జాగ్రత్తపడ్డాడు.
దాంతో సన్‌రైజర్స్ పవర్‌ప్లే ముగిసేసరికి వికెట్ నష్టానికి 42 రన్స్ చేసింది. అనంతరం బ్రావో పరుగులు ఇవ్వకుండా కట్టడి చేయడంతో ఒత్తిడికి లోనైన మనీష్ పాండే.. శార్ధుల్ ఠాకుర్ వేసిన 8వ ఓవర్ ఫస్ట్ బాల్‌ను ఎక్స్‌ట్రా కవర్ దిశగా ఆడాలని ప్రయత్నించగా బంతి ఇన్‌సైడ్ ఎడ్జ్ తీసుకొవడంతో మిడాఫ్‌లో ఉన్న సామ్ కరన్‌కు చిక్కింది.

డూప్లెసిస్ సూపర్ క్యాచ్..
అనంతరం విలియమ్సన్ క్రీజులోకి రాగా.. వార్నర్ ధాటిగా ఆడే ప్రయత్నం చేశాడు. పియూష్ చావ్లా వేసిన 11వ ఓవర్‌లో నాలుగో బంతిని బౌండరీకి తరలించిన వార్నర్.. ఆ మరుసటి బంతిని లాంగాన్ దిశగా భారీ షాట్ ఆడాడు. దాదాపు సిక్స్‌గా వెళ్లిన బంతి.. బౌండరీ లైన్ వద్ద డూప్లెసిస్ చేతిలో పడింది. బంతిని అందుకున్న డూప్లెసిస్ సమన్వయం కోల్పోతున్నట్లు భావించి గాల్లోకి ఎగిరేసి వచ్చి మళ్లీ అందుకున్నాడు. దీంతో వార్నర్(28) నిరాశగా వెనుదిరిగాడు.

విలియమ్సన్ రనౌట్..
ఆ వెంటనే బంతిని ఫ్లిక్ చేసిన విలియమ్సన్ క్విక్ సింగిల్ తీసే ప్రయత్నం చేయగా.. నాన్ స్ట్రైకర్ ప్రియమ్ గార్గ్ స్పందించలేదు. దీంతో విలియమ్సన్(9) రనౌట్‌గా వెనుదిరిగాల్సి వచ్చింది. దాంతో హైదరాబాద్ 69 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. దీంతో హైదరాబాద్ స్కోర్ 100 కూడా దాటుతుందో లేదని అందరూ అనుకున్నారు. కానీ యువ ఆటగాళ్లు ప్రియామ్ గార్గ్, అభిషేక్ శర్మ(24 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌తో 31) ఊహించని రీతిలో ఆడుతూ స్కోర్ బోర్డును పరుగెత్తించాడు.
జడేజా వేసిన 14వ ఓవర్‌లో అభిషేక్ శర్మ ఫోర్, సిక్స్ కొట్టగా.. 17వ ఓవర్‌లో ప్రియామ్ గార్గ్ 4, 4, 6,4 వరుస బౌండరీలతో చెలరేగాడు. ఇక చాహర్ వేసిన 18వ ఓవర్‌లో అభిషేక్ వరుస బంతుల్లో రెండు భారీ షాట్లు ఆడగా.. జడేజా, శార్దుల్ ఠాకుర్ నేలపాలు చేశారు. ఆ ఓవర్ చివరి బంతికి కీపర్ క్యాచ్‌గా అభిషేక్ శర్మ వెనుదిరగడంతో ఐదో వికెట్‌కు నమోదైన 77 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.
ప్రియమ్ గార్గ్ హాఫ్ సెంచరీ
ఇక బ్రావో బౌలింగ్‌లో డిప్ మిడ్ వికెట్ మీదుగా సింగిల్ తీసిన ప్రియమ్ గార్గ్ ఐపీఎల్‌లో తన తొలి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇక చివరి రెండు ఓవర్లలో బౌండరీలు రాకపోయినా క్విక్ సింగిల్స్, డబుల్స్ తీయడంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ 164 పరుగులు చేయగలిగింది.


Click it and Unblock the Notifications












