For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

CSK vs SRH: చిరుతలా పరుగెత్తే ధోనీ అలసిపోయాడు.. ఇన్నింగ్స్ చివర్లో ఎందుకంత ఇబ్బంది?.. కారణం ఇదే!!

CSK vs SRH: MS Dhoni explains why he was coughing in the last two overs
IPL 2020 : MS Dhoni Explains Why he Was Struggling, Sreesanth Salutes | CSK VS SRH || Oneindia

దుబాయ్: ప్రపంచంలోనే గొప్ప ఫినిషర్‌ టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ. చివరి ఓవర్లో విజయానికి 15 పరుగులు చేయాల్సి ఉంటే.. ఒత్తిడి ధోనీ మీద కాదు, బౌలర్‌ మీద ఉంటుంది. ఇక కీలక సమయంలో మైదానంలో పరుగెత్తడంలో మహీ చిరుతను తలపిస్తాడు. అయితే ఐపీఎల్ 2020లో ఈ మార్క్ ధోనీలో కనబడట లేదు. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో చివరి ఓవర్లో చెన్నై విజయానికి 28 పరుగులు అవసరం కాగా.. మహీ భారీ షాట్లు ఆడకుండా సింగిల్స్‌కే పరిమితం అయ్యాడు. ఒక్కోసారి ఆ సింగిల్ తీయడానికి కూడా ఇబ్బందిపడ్డాడు. ధోనీ చివరి వరకు నిలిచినా జట్టుకు విజయాన్ని అందించడంలో విఫలంకావడంతో అభిమానులు విస్మయానికి గురవుతున్నారు.

సింగిల్స్‌కే పరిమితం:

సింగిల్స్‌కే పరిమితం:

ఇన్నింగ్స్‌ చివరి వరకు క్రిజ్‌లో నిలిచిన ఎంఎస్ ధోనీ (36 బంతుల్లో 47 నాటౌట్‌; 4 ఫోర్లు, 1 సిక్స్‌) అజేయంగా నిలిచినప్పటికీ.. వేగంగా ఆడటంలో విఫలమయ్యాడు. చివరి ఓవర్లో చెన్నై విజయానికి 28 పరుగులు అవసరం కాగా.. కేవలం ఒక్క మ్యాచ్ అనుభవం ఉన్న అబ్దుల్ సమద్‌ బౌలింగ్ చేశాడు. తొలి బంతి పడకుండానే వైడ్, ఎక్స్‌ట్రాల రూపంలో 5 పరుగులు రావడంతో.. చెన్నై విజయానికి ఆరు బంతుల్లో 23 పరుగులు అవసరం. తొలి రెండు బంతుల్లో 2, 4. ఇక 4 బంతుల్లో 17 పరుగులే చేయాలి. కానీ మూడో బంతికి మహీ సింగిల్‌ తీశాడు. ఇక ఐదో బంతికీ ఒక పరుగుకే పరిమితం అయ్యాడు. ఇంకేముంది ప్రత్యర్థి ఖాతాలో 7 పరుగుల తేడాతో విజయం.

 వేడిమితో ఇబ్బంది పడిన ధోనీ:

వేడిమితో ఇబ్బంది పడిన ధోనీ:

ఈ మ్యాచ్‌లో ఎంఎస్ ధోనీ ఆడిన తీరు చర్చనీయాంశంగా మారింది. వికెట్ల మధ్య చిరుతలా పరిగెత్తే మహీ‌.. పరుగు తీయడానికే తీవ్రంగా అలసిపోయాడు. ఒకానొక సందర్భంలో ఇక పరిగెత్తడం తన వల్ల కాదనే స్థితికి వెళ్లాడు. అయితే దుబాయ్‌లో ఎక్కువగా పొడి వాతావరణం ఉన్న కారణంగానే ఇలాంటి పరిస్థితిని మహీ ఎదుర్కొవాల్సి వచ్చింది. 40 ఏళ్ల వయసులో యూఏఈలోని అధిక వేడిమికి మహీ తట్టుకోలేకపోయాడు. గొంతు పొడి బారడం, దగ్గు రావడంఎంతో అతడు సతమతం అయ్యాడు. వేడిమితో ఇబ్బంది పడిన ధోనీ.. పదే పదే విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో ఫిజియో వచ్చి ఓసారి ధోనీని పరీక్షించి వెళ్లాడు.

 బంతిని బలంగా బాదడం కష్టతరమైంది:

బంతిని బలంగా బాదడం కష్టతరమైంది:

మ్యాచ్ అనంతరం ఎంఎస్ ధోనీ మాట్లాడుతూ... 'యూఏఈలో అధిక వేడిమి ఉంది. పరిస్థితుల కారణంగా గొంతు చాలా తొందరగా పొడి బారింది. ఆపై దగ్గుబాగా వచ్చి ఇబ్బందిగా మారింది. రన్స్‌ తీయడం ఇబ్బందిగా మారింది. మిడిల్ ఓవర్లలో బంతిని బలంగా బాదడం కష్టతరమైంది' అని తెలిపాడు. 'చాలా కాలం తర్వాత మేం వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఓడాం. క్యాచ్‌లు, చేజార్చడం, నోబాల్స్ వేయడంతో ఓటమి పాలయ్యాం. డెత్‌ ఓవర్లలో రెండు చెత్త ఓవర్లు వేశాం. లీగ్ మ్యాచ్‌లు కాబట్టి నడుస్తుంది. అదే నాకౌట్ దశలో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. తదుపరి మ్యాచ్‌‌కు మా తప్పిదాలను సవరించుకొని బరిలోకి దిగుతాం' అని ధోనీ చెప్పాడు.

మీ ఆట అందరికి ఆదర్శం:

మీ ఆట అందరికి ఆదర్శం:

వేడిమి కారణంగా ఎంఎస్ ధోనీ ఇబ్బంది పడడంపై భారత మాజీ పేసర్ శ్రీశాంత్ ట్విట్టర్ వేదికగా స్పందించాడు. 'హాట్స్ ఆఫ్ మహీ భాయ్. ఇంత వేడిమిలో 20 ఓవర్ల పాటు వికెట్ కీపింగ్ చేయడం, ఆపై రన్స్ చేయడం గొప్ప విషయం. మీ ఆట అందరికి ఆదర్శం. క్లిష్ట పరిస్థితుల్లో కూడా జట్టు కోసం ఆడారు' అని ట్వీట్ చేశాడు.

Sunrisers Hyderabadకు మరో భారీ షాక్.. స్టార్ పేసర్‌కు గాయం.. ముంబైతో మ్యాచ్‌కి డౌటే!!

Story first published: Saturday, October 3, 2020, 14:15 [IST]
Other articles published on Oct 3, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+