Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Sunrisers Hyderabadకు మరో భారీ షాక్.. స్టార్ పేసర్‌కు గాయం.. ముంబైతో మ్యాచ్‌కి డౌటే!!

CSK vs SRH: Another shock for sunrisers hyderabad, Bhuvneshwar Kumar Injured

దుబాయ్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్‌‌)‌ జట్టుకు బెడద వీడటం లేదు. తొలి మ్యాచ్‌లోనే ఎస్‌ఆర్‌హెచ్‌‌ స్టార్ ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ గాయం బారినపడి టోర్నీ మొత్తంకు దూరమయిన విషయం తెలిసిందే. రెండో మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తూ మనీశ్ పాండే గాయపడ్డాడు. బౌండరీ లైన్‌కి సమీపంలో బంతిని అందుకున్న పాండే వేగంగా త్రో విసరగా.. అతని తొడ కండరాలకి గాయమైంది. ఇక స్టార్ బ్యాట్స్‌మన్‌ కేన్ విలియమ్సన్‌ గాయం కారణంగా రెండు మ్యాచులకు దూరమయ్యాడు. ఇప్పుడు ఫాస్ట్ బౌలర్ కూడా గాయం బారిన పడ్డాడు.

భువీకి గాయం:

భువీకి గాయం:

శుక్రవారం రాత్రి దుబాయ్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్ 7 పరుగులు తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ బౌలింగ్ చేస్తూ గాయపడ్డాడు. 19వ ఓవర్‌ తొలి బంతిని విసిరే క్రమంలో భువీ గాయపడ్డాడు. భువీ తొడ కండరాలకి గాయమవగా.. మొదట నడిచేందుకు ఇబ్బంది పడ్డా.. ఆ తర్వాత ఫిజియో సాయంతో మళ్లీ బౌలింగ్‌ చేసేందుకు సిద్ధమయ్యాడు. రెండో బంతి వేసే క్రమంలో రనప్ పూర్తి కాకుండానే గాయం తీవ్రత కారణంగా వికెట్ల వద్దకి వచ్చి ఆగిపోయాడు. అయినా బౌలింగ్‌ వేసేందుకు మూడు సార్లు ప్రయత్నించాడు. నొప్పి భరించలేక ఆఖరికి మైదానాన్ని వీడాడు. దీంతో ఆ ఓవర్‌ను మరో పేసర్‌ ఖలీల్‌ అహ్మద్‌ పూర్తి చేశాడు.

 ఆడటం అనుమానమే:

ఆడటం అనుమానమే:

భువనేశ్వర్ కుమార్‌ని గత కొంతకాలంగా తొడ కండరాల గాయం వేధిస్తోంది. గత ఏడాది చివరలో కూడా ఇదే గాయంతో టీమిండియాకి దూరమయ్యాడు. శుక్రవారం మ్యాచ్‌లో కూడా భువీ తొడకండరాల నొప్పితో ఇబ్బంది పడ్డాడు .గాయం తీవ్రత రనప్‌ తర్వాత పెరిగినట్లు తెలుస్తోంది. ఓ ఫాస్ట్ బౌలర్ తొడ కండరాల గాయం నుంచి వేగంగా కోలుకుని ఫిట్‌నెస్ సాధించడం కష్టం. ఈ నేపథ్యంలో ఆదివారం ముంబై ఇండియన్స్‌తో జరిగే మ్యాచ్‌లో భువీ ఆడటం అనుమానమే.

 గాయంపై స్పష్టత లేదు:

గాయంపై స్పష్టత లేదు:

భువనేశ్వర్‌ కుమార్‌ గాయంపై ఇంకా స్పష్టత రాలేదని సన్‌రైజర్స్‌ హైదరాబాద్ సారథి డేవిడ్‌ వార్నర్‌ అన్నాడు. 'భువనేశ్వర్‌ గాయంపై ఇప్పటికైతే ఎలాంటి స్పష్టత రాలేదు. ఫిజియోతో మాట్లాడాల్సి ఉంది. ఆ తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తాం' అని వార్నర్‌ పేర్కొన్నాడు. ఈ మ్యాచ్‌లో భువనేశ్వర్‌ 3.1 ఓవర్లు వేశాడు. 6.30 ఎకానమీతో 20 పరుగులిచ్చాడు. ఒక వికెట్‌ కూడా సొంతం చేసుకున్నాడు. ఒకవేళ భువనేశ్వర్‌ గాయం తీవ్రమైతే మాత్రం తర్వాతి మ్యాచ్‌కు దూరమయ్యే అవకాశాలున్నాయి. హైదరాబాద్‌ అక్టోబర్‌ 4న తన తర్వాతి మ్యాచ్‌ ఆడనుంది.

 హోల్డర్‌ క్వారంటైన్‌ పూర్తి:

హోల్డర్‌ క్వారంటైన్‌ పూర్తి:

ఐపీఎల్ 2020 కోసం వెస్టిండీస్‌ టెస్టు కెప్టెన్‌ జేసన్‌ హోల్డర్‌ ఇటీవలే యూఏఈలో అడుగుపెట్టాడు. కరోనా వైరస్ నేపథ్యంలో హోల్డర్‌ ఆరు రోజుల తప్పనిసరి క్వారంటైన్‌ పూర్తిచేశాడు. ఇది జట్టుకు కాస్త ఊరటనిచ్చే అంశం. ఎందుకంటే హోల్డర్‌ బ్యాట్, బంతితో మెరవగలడు. మిచెల్ మార్ష్ స్థానంలో హోల్డర్‌ జట్టులోకి వచ్చిన విషయం తెలిసిందే.

CSK vs SRH: విలియమ్సన్‌ రనౌట్ అయినప్పుడు బాధపడ్డా.. డౌగౌట్‌లోకి వెళ్లాక కేన్ ఏమన్నాడంటే: గార్గ్

Story first published: Saturday, October 3, 2020, 11:36 [IST]
Other articles published on Oct 3, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+