Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వారెవ్వా డూప్లెసిస్ వాటే క్యాచ్‌.. వార్నర్ ఔట్.. ఆ వెంటనే విలియమ్సన్ కూడా!

David Warner, Kane Williamson out in successive deliveries

దుబాయ్: చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. చెన్నై ఆటగాళ్ల అద్భుత ఫీల్డింగ్‌కు ఆరెంజ్ ఆర్మీ బ్యాక్ టు బ్యాక్ వికెట్లను చేజార్చుకుంది. తొలుత బౌండరీ లైన్ వద్ద డూప్లెసిస్ సూపర్ క్యాచ్‌కు వార్నర్ ఔట్‌ కాగా.. ఆ మరుసటి బంతికి విలియమ్సన్ రనౌట్‌గా వెనుదిరిగాడు.

పియూష్ చావ్లా వేసిన 11వ ఓవర్‌లో నాలుగో బంతిని బౌండరీకి తరలించిన వార్నర్.. ఆ మరుసటి బంతిని లాంగాన్ దిశగా భారీ షాట్ ఆడాడు. దాదాపు సిక్స్‌గా వెళ్లిన బంతి.. బౌండరీ లైన్ వద్ద సూపర్ ఫీల్డింగ్‌తో డూప్లెసిస్ చేతికి చిక్కింది. బంతిని అందుకున్న డూప్లెసిస్ సమన్వయం కోల్పోతున్నట్లు భావించి గాల్లోకి ఎగిరేసి వచ్చి మళ్లీ అందుకున్నాడు. దాంతో వార్నర్(28) నిరాశగా వెనుదిరిగాడు.

ఆ వెంటనే బంతిని ఫ్లిక్ చేసిన కేన్ విలియమ్సన్ క్విక్ సింగిల్ తీసే ప్రయత్నం చేయగా.. నాన్ స్ట్రైకర్ ప్రియమ్ గార్గ్ స్పందించలేదు. దీంతో విలియమ్సన్(9) రనౌట్‌గా వెనుదిరిగాల్సి వచ్చింది. దాంతో హైదరాబాద్ 69 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ప్రస్తుతం క్రీజులో ప్రియమ్ గార్గ్, అభిషేక్ శర్మ ఉన్నారు.

అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. ఓపెనర్ జానీ బెయిర్‌స్టో(0)ను దీపక్ చాహర్ క్లీన్ బౌల్డ్ చేయడంతో హైదరాబాద్‌కు శుభారంభం దక్కలేదు. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన మనీష్ పాండే ధాటిగా ఆడాడు. ఓవైపు కెప్టెన్ డేవిడ్ వార్నర్ నిదానంగా ఆడుతున్నా మరోవైపు మనీష్ పాండే ఓవర్‌కు ఒక బౌండరీ బాదుతూ..రన్‌రేట్ తగ్గకుండా జాగ్రత్తపడ్డాడు. దాంతో సన్‌రైజర్స్ పవర్‌ప్లే ముగిసేసరికి వికెట్ నష్టానికి 42 రన్స్ చేసింది.

అనంతరం బ్రావో పరుగులు ఇవ్వకుండా కట్టడి చేయడంతో ఒత్తిడికి లోనైన మనీష్ పాండే.. శార్ధుల్ ఠాకుర్ వేసిన 8వ ఓవర్ ఫస్ట్ బాల్‌ను ఎక్స్‌ట్రా కవర్ దిశగా ఆడాలని ప్రయత్నించాడు. కానీ బంతి ఇన్‌సైడ్ ఎడ్జ్ తీసుకొవడంతో మిడాఫ్‌లో ఉన్న సామ్ కరన్‌ చేతుల్లోకి వెళ్లింది. అనంతరం విలియమ్సన్ క్రీజులోకి రాగా.. వార్నర్ ధాటిగా ఆడే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలోనే వికెట్ చేజార్చుకున్నాడు. ఆ వెంటనే విలియమ్సన్ కూడా ఔటవ్వడంతో సన్‌రైజర్స్ కష్టాల్లో కూరుకుపోయింది.

Story first published: Friday, October 2, 2020, 20:53 [IST]
Other articles published on Oct 2, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+