
దుబాయ్: సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఆదిలోనే మూడు కీలక వికెట్లు కోల్పోయింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో షేన్ వాట్సన్(1), యార్కర్ల కింగ్ నటరాజన్ బౌలింగ్‌లో అంబటి రాయుడు క్లీన్ బౌల్డ్ అయ్యారు.
భువీ వేసిన మూడో ఓవర్ మూడో బంతిని వాట్సన్ వికెట్ల మీదకు ఆడుకొని మూల్యం చెల్లించుకోగా.. నటరాజన్ వేసిన ఆరో ఓవర్ ఫస్ట్ బాల్‌కు రాయుడు ఔటయ్యాడు. అనంతరం అదే ఓవర్‌లో రెండు వరుస బౌండరీలు కొట్టిన డూప్లెసిస్(22) ప్రియమ్ గార్గ్ సూపర్ ఫీల్డింగ్‌కు రనౌట్‌గా వెనుదిరిగాడు. దాంతో పవర్ ప్లే ముగిసేసరికి చెన్నై సూపర్ కింగ్స్ 3 వికెట్లు కోల్పోయి 36 పరుగులు చేసింది. క్రీజులో ధోనీ, జాదవ్ ఉన్నారు.
అంతకు ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ అనామక ఆటగాళ్లు ప్రియామ్ గార్గ్(26 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌తో 51 నాటౌట్), అభిషేక్ శర్మ(24 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌తో 31) అద్భుతంగా ఆడటంతో ఆరెంజ్ ఆర్మీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 164 రన్స్ చేసింది. 69 రన్స్‌కే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఈ చిచ్చర పిడుగులు 77 పరుగుల భాగస్వామ్యాంతో ఆదుకున్నారు. మనీశ్ పాండే(29), వార్నర్ (28) పర్వాలేదనిపించారు. చెన్నై బౌలర్లలో చాహర్ రెండు వికెట్లు తీయగా చావ్లా, ఠాకుర్ తలో వికెట్ తీశారు.