Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

CSK vs RR: అతని వల్లే ఓడాం: సంజూ శాంసన్

బ్యాటింగ్ వైఫల్యంతోనే చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓటమిపాలయ్యామని రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ తెలిపాడు. ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో చెపాక్ మైదానం వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 5 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది.

ఈ మ్యాచ్ అనంతరం తమ పరాజయంపై స్పందించిన సంజూ శాంసన్.. తమ లక్ష్యానికి 20-25 పరుగులు తక్కువగా చేశామని తెలిపాడు. చెన్నై సూపర్ కింగ్స్ యువ పేసర్ సిమర్జీత్ సింగ్ అసాధారణ ప్రదర్శనతో తమ పతనాన్ని శాసించాడని చెప్పాడు.

CSK vs RR Sanju Samson says we were short 20-25 runs Simarjeet bowled well after Chennai beat Rajastan

'పవర్ ప్లే అనంతరం పిచ్ చాలా నెమ్మదిగా ఉందనే విషయం అర్థమైంది. పవర్ ప్లే ముగిసిన తర్వాత మేం 170 పరుగులు చేయాలని అంచనగా పెట్టుకున్నాం. కానీ 20-25 పరుగులు తక్కువగా చేశాం. సిమర్జిత్ సింగ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అవే గేమ్స్‌లో మేం ఆశించిన రీతిలో రాణించలేకపోతున్నాం.

ముందుగా బ్యాటింగ్ చేయడం బెటర్ ఆఫ్షన్ అని మేం భావించాం. అయితే సీఎస్‌కే ఛేజింగ్ చేయాలంటే ఏం చేయాలనే ప్రణాళికలతో బరిలోకి దిగింది. సెకండ్ ఇన్నింగ్స్‌లో పిచ్ ఇంకా స్లో అవుతుందని మేం భావించాం. కానీ మ్యాచ్ సాగుతున్నా కొద్దీ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా మారింది. డ్యూ వచ్చినప్పుడు ఛేజింగ్‌ చాలా కష్టం.

ప్లే ఆఫ్స్ చేరాలంటే ఏం చేయాలనే దానిపై మేం ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది. తదుపరి మ్యాచ్ గెలిచేందుకు ప్రయత్నిస్తాం.'అని సంజూ శాంసన్ చెప్పుకొచ్చాడు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 141 పరుగులు చేసింది. రియాన్ పరాగ్(35 బంతుల్లో ఫోర్, 3 సిక్స్‌లతో 47 నాటౌట్) ఒక్కడే రాణించగా మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. సిమర్జిత్ సింగ్(3/26) మూడు వికెట్లు తీయగా.. తుషార్ దేశ్‌పాండే(2/30) రెండు వికెట్లు పడగొట్టాడు.

అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ 18.2 ఓవర్లలోనే 5 వికెట్లకు 145 పరుగులు చేసింది. రుతురాజ్ గైక్వాడ్(41 బంతుల్లో ఫోర్, 2 సిక్స్‌లతో 42 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్ రెండు వికెట్లు తీయగా.. నండ్రే బర్గర్, యుజ్వేంద్ర చాహల్ తలో వికెట్ తీసారు.

Story first published: Sunday, May 12, 2024, 20:10 [IST]
Other articles published on May 12, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+