ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో ఢిల్లీ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లోరాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఇక్కడే జరిగిన ఢిల్లీ, గుజరాత్ మ్యాచ్‌లో ఛేజింగ్ టీమ్‌కు కలిసొచ్చిందని, దాంతోనే తాను బౌలింగ్ ఎంచుకున్నానని రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ అన్నాడు.
'మేం ముందుగా బౌలింగ్ చేస్తాం. ఢిల్లీతో ఇక్కడ జరిగిన గత మ్యాచ్‌లో ఛేజింగ్ టీమ్‌కు కలిసొచ్చింది. ఈ గేమ్‌లో దాచేది ఏం లేదు. మేం కూడా ఈ రోజు గుజరాత్‌లానే విజయం సాధించాలనుకుంటున్నాం.ప్రతీ ఒక్కరు మ్యాచ్ విన్నరే. వారు అలానే ఆలోచిస్తున్నారు. అయితే మేం పరిస్థితులకు తగ్గట్లు కాస్త తెలివిగా బ్యాటింగ్ చేయాలి. తుది జట్టులో కొన్ని మార్పులు చేశాం. యుధ్‌వీర్ తుది జట్టులోకి వచ్చాడు.'అని సంజూ శాంసన్ తెలిపాడు.

తాము బ్యాటింగ్‌లో మెరుగైన ప్రదర్శన చేయాలనుకుంటున్నామని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తెలిపాడు. 'మేం స్వేచ్చగా బ్యాటింగ్ చేయాలనుకుంటున్నాం. ముఖ్యంగా వచ్చే సీజన్ కోసం ఏ స్లాట్‌లో ఏ ఆటగాడు రాణిస్తున్నాడో తెలుసుకోవాలి. మా బౌలింగ్‌పై కూడా ఫోకస్ పెట్టాలి. ఈ టోర్నీ ప్లే ఆఫ్స్ రేసు నుంచి తప్పుకోగానే వచ్చే సీజన్‌పై ఫోకస్ పెట్టాం. సరైన కాంబినేషన్‌తో వేలంలో కొనుగోలు చేయాల్సిన ఆటగాళ్లపై ఫోకస్ పెట్టాం.
మా బ్యాటింగ్ విభాగం దూకుడుగా ఆడుతుంది. అదే జోరును కొనసాగించాలనుకుంటున్నాం. సీజన్ ఆరంభంలో మేం తడబడ్డాం. ఒత్తిడిలో ఉన్నప్పుడు ఏం చేసినా ఫలితం దక్కదు. అన్ని రకాల షాట్లు ఆడాల్సిన అవసరం లేదు. తెలివిగా షాట్లను ఎంచుకోవాలి.'అని ధోనీ చెప్పుకొచ్చాడు.
తుది జట్లు:
చెన్నై సూపర్ కింగ్స్: ఆయుష్ మాత్రే, డెవాన్ కాన్వే, ఉర్విల్ పటేల్, రవీంద్ర జడేజా, డెవాల్డ్ బ్రెవిస్, శివమ్ దూబే, మహేంద్ర సింగ్ ధోనీ(కీపర్), అన్షుల్ కంబోజ్, రవిచంద్రన్ అశ్విన్, నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్.
రాజస్థాన్ రాయల్స్: యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, సంజూ శాంసన్(కీపర్), రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, షిమ్రన్ హెట్‌మైర్, వానిందు హసరంగా, క్వెనా మఫకా, యధ్‌వీర్ సింగ్, తుషార్ దేశ్‌పాండే, ఆకాశ్ మధ్వాల్.