Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

CSK vs RR: ఒకటి, రెండు కాదు.. మూడు తప్పిదాలతో చెన్నై కొంపముంచిన మొయిన్ అలీ!

చెన్నై: ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ దారుణంగా విఫలమయ్యాడు. బౌలింగ్‌లో ధారళంగా పరుగులిచ్చిన మొయిన్ అలీ.. ఫీల్డింగ్‌లో ఏకంగా మూడు తప్పిదాలు చేశాడు. రెండు సునాయస క్యాచ్‌లను నేలపాలు చేయడంతో పాటు ఓ రనౌట్ అవకాశాన్ని చేజార్చాడు.

ఈ అవకాశాలతో చెలరేగిన రాజస్థాన్ బ్యాటర్లు జట్టును భారీ స్కోర్ దిశగా నడిపించారు. రాజస్థాన్ ఇన్నింగ్స్ ఆరంభంలోనే మహీశ్ తీక్షణ వేసిన ఐదో ఓవర్‌లో దేవదత్ పడిక్కల్‌.. స్లిప్‌లో ఇచ్చిన సునాయస క్యాచ్‌ను మొయిన్ అలీ నేలపాలు చేశాడు. అప్పటికి పడిక్కల్ చేసిన పరుగులు 14 మాత్రమే. ఈ అవకాశంతో చెలరేగిన అతను 38 పరుగులు చేశాడు.

Moeen Ali CSK

రెండో వికెట్‌కు జోస్ బట్లర్‌తో కలిసి 77 పరుగుల భాగస్వామ్యాన్ని అందించాడు. ఆ తర్వాత 8వ ఓవర్ బౌలింగ్ చేసిన మొయిన్ అలీ రెండు సిక్స్‌లు సమర్పించుకొని మొత్తం 18 పరుగులిచ్చుకున్నాడు. అస్వస్థతతో గత మ్యాచ్‌కు దూరంగా ఉన్న మొయిన్ అలీ.. ఈ మ్యాచ్‌లో పూర్తిగా లయ తప్పాడు. దాంతో మరింత ఒత్తిడికి గురైన అతను ఫీల్డింగ్‌లో మరిన్ని తప్పిదాలు చేశాడు.

రవీంద్ర జడేజా వేసిన 9వ ఓవర్‌లో లోకల్ బాయ్ రవిచంద్రన్ అశ్విన్ ఇచ్చిన సునాయస క్యాచ్‌ను స్లిప్‌లో మొయిన్ అలీ నేలపాలు చేశాడు. దాంతో అశ్విన్ గోల్డెన్ డకౌటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఆ తర్వాత తీక్షణ వేసిన 14వ ఓవర్‌లో రవిచంద్రన్ అశ్విన్‌ను రనౌట్ చేసే అవకాశాన్ని మొయిన్ అలీ చేజార్చాడు.

అప్పటికి అశ్విన్ చేసింది 10 పరుగులు మాత్రమే. ఈ రెండు అవకాశాలతో చెలరేగిన అశ్విన్.. 30 పరుగులతో నాలుగో వికెట్‌కు 47 పరుగులు జోడించాడు. మొయిన్ అలీ ఈ తప్పిదాలు చేయకపోయింటే రాజస్తాన్ రాయల్స్ స్వల్ప స్కోర్‌కే పరిమితమయ్యేది. మొయిన్ అలీ చేసిన తప్పిదాలపై నెటిజన్లు నెట్టింట మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు.

Story first published: Wednesday, April 12, 2023, 21:13 [IST]
Other articles published on Apr 12, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+