న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఒంటి చేత్తో శార్దుల్ ఠాకూర్ స్టన్నింగ్ క్యాచ్: వీడియో చూశారా?

By Nageshwara Rao
CSK vs RR, IPL 2018: Shardul Thakur bags a one-handed scorcher, even leaves Suresh Raina impressed

హైదరాబాద్: శుక్రవారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ శార్దుల్ ఠాకూర్ కళ్లు చెదిరే క్యాచ్ అందుకున్నాడు. ఈ క్యాచ్ మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచింది. అంతేకాదు ఈ క్యాచ్... పర్‌ఫెక్ట్ క్యాచ్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుని సైతం దక్కించుకుంది.

ఐపీఎల్ 2018 స్పెషల్ వెబ్ సైట్ | ఐపీఎల్ 2018 పూర్తి షెడ్యూల్

శార్దుల్ ఠాకూర్ వేసిన 16వ ఓవర్లో రాజస్థాన్ ఆటగాడు స్టువర్ట్ బిన్నీ భారీ షాట్‌కు ప్రయత్నించగా బ్యాట్స్‌మన్‌కు సమీపంలో బంతి గాల్లోకి లేచింది. శార్దుల్ బంతి విసిరిన వెంటనే అదే వేగంతో పరుగెత్తి డైవ్ చేసి ఒంటి చేత్తో బంతిని అందుకొని ఆశ్చర్యపరిచాడు.

అదే సమయంలో అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న సురేశ్ రైనా, శార్దుల్ ఠాకూర్ క్యాచ్‌కి ఒక్కసారిగా అవాక్కయ్యాడు. అద్భతమైన క్యాచ్ అందుకున్న శార్దుల్‌ను ఆ జట్టు కెప్టెన్ ధోని కూడా ప్రత్యేకంగా అభినందించాడు. ఇదిలా ఉంటే రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై 64 పరుగుల తేడాతో విజయం సాధించింది.

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 204 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య చేధనకు దిగిన రాజస్థాన్‌ రాయల్స్‌ 18.3 ఓవర్లలో 140 పరుగులకే పరిమితమైంది. ఈ మ్యాచ్‌లో చెన్నై ఓపెనర్ షేన్ వాట్సన్ (106; 57 బంతుల్లో 9 ఫోర్లు, 6 సిక్సులు) మెరుపు సెంచరీ నమోదు చేశాడు.

ఐపీఎల్‌లో వాట్సన్‌కి ఇది మూడో సెంచరీ కావడం విశేషం. ఇక, ఐపీఎల్ 11వ సీజన్‌లో క్రిస్ గేల్ తర్వాత సెంచరీ సాధించిన రెండో ఆటగాడిగా నిలిచాడు. అంతకముందు సన్‌ రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌‌లో క్రిస్ గేల్ సెంచరీ చేసిన సంగతి తెలిసిందే. గతేడాది బెంగళూరు తరపున ఆడిన ఈ ఇద్దరూ ప్రస్తుతం వేర్వేరు జట్లకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు.

Story first published: Saturday, April 21, 2018, 13:30 [IST]
Other articles published on Apr 21, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X