For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

CSK vs RCB: కొంపముంచిన సామ్ కరణ్.. మలుపు తిప్పిన టీమ్ డేవిడ్!

ఐపీఎల్ 2025 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) బ్యాటర్లు తమ జోరును కొనసాగించారు. చెన్నై సూపర్ కింగ్స్‌తో చెపాక్ వేదికగా జరుగుతున్న కీలక మ్యాచ్‌లో ఆర్‌సీబీ బ్యాటర్లు సమష్టిగా చెలరేగారు. దాంతో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 196 పరుగులు చేసింది. రజత్ పటీదార్(32 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 51) హాఫ్ సెంచరీతో రాణించగా.. ఫిల్ సాల్ట్(16 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 32), విరాట్ కోహ్లీ(30 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 31) కీలక ఇన్నింగ్స్ ఆడారు. చివర్లో టీమ్ డేవిడ్(8 బంతుల్లో ఫోర్, 3 సిక్స్‌లతో 22 నాటౌట్) మెరుపులు మెరిపించాడు.

సీఎస్‌కే బౌలర్లలో నూర్ అహ్మద్(3/36) మూడు వికెట్లు తీయగా.. మతీష పతీరణ(2/36) రెండు వికెట్లు పడగొట్టాడు. ఖలీల్ అహ్మద్, రవిచంద్రన్ అశ్విన్ తలో వికెట్ తీసారు. చెన్నై సూపర్ కింగ్స్ పేలవ ఫీల్డింగ్ ఆర్‌సీబీకి కలిసొచ్చింది. రజత్ పటీదార్ ఇచ్చిన మూడు క్యాచ్‌లను చెన్నై ఆటగాళ్లు నేలపాలు చేశారు. సామ్ కరణ్ వేసిన ఆఖరి ఓవర్‌లో టీమ్ డేవిడ్ వరుసగా మూడు సిక్సర్లు బాది మ్యాచ్‌ను తమవైపు మలుపు తిప్పాడు.

2025 20 6 196 32 4 3 51 16 5 32 30 2 31 8 3 22 3 36 2 36 45 6 4 16 10 30 12 0

ఫిల్ సాల్ట్ విధ్వంసం..
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆర్‌సీబీకి శుభారంభం దక్కింది. ఓపెనర్ ఫిల్ సాల్ట్.. తన ఫామ్‌ను కొనసాగిస్తూ విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగాడు. తొలి ఓవర్‌లోనే వరుసగా రెండు బౌండరీలు బాదిన సాల్ట్.. అశ్విన్ వేసిన మరుసటి ఓవర్‌లో సిక్స్‌తో పాటు రెండు బౌండరీలు బాదాడు. మరోవైపు కోహ్లీ తడబడినా.. ఫిల్ సాల్ట్ స్వేచ్చగా షాట్లు ఆడాడు. అయితే నూర్ అహ్మద్ వేసిన ఐదో ఓవర్ ఆఖరి బంతికి.. ధోనీ కళ్లు చెదిరే స్టంపౌట్‌కు నిరాశగా పెవిలియన్ చేరాడు. దాంతో తొలి వికెట్‌కు నమోదైన 45 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.

దెబ్బతీసిన నూర్ అహ్మద్..
వచ్చిరావడంతోనే దేవదత్ పడిక్కల్.. సిక్సర్ బాదాడు. జడేజా బౌలింగ్‌లో రెండు ఫోర్లతో పాటు మరో సిక్సర్ కొట్టాడు. అయితే అతన్ని అశ్విన్ క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. క్రీజులోకి పటీదార్ రాగా.. సీఎస్‌కే బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఆర్‌సీబీ పరుగుల వేగం తగ్గింది. నూర్ అహ్మద్ బౌలింగ్‌లో పటీదార్ భారీ సిక్సర్ కొట్టగా.. పతీరణ బౌలింగ్‌లో విరాట్ కోహ్లీ వరుసగా 6, 4 బాదాడు. ఇదే ఓవర్‌లో రజత్ పటీదార్ కూడా ఫోర్ బాదడంతో 16 పరుగుల వచ్చాయి. రజత్ పటీదార్ వరుసగా ఇచ్చిన రెండు సునాయస క్యాచ్‌‌లను దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి నేలపాలు చేశారు. దూకుడుగా ఆడుతున్న విరాట్ కోహ్లీని నూర్ అహ్మద్ క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేరాడు. భారీ షాట్ ఆడే ప్రయత్నంలో కోహ్లీ వెనుదిరిగాడు.

రజత్ పటీదార్ హాఫ్ సెంచరీ..
ఇదే ఓవర్‌లో రజత్ పటీదార్‌కు మరో లైఫ్ లభించింది. అతను ఇచ్చిన క్యాచ్‌ను ఖలీల్ అహ్మద్ నేలపాలు చేశాడు. ఈ అవకాశాలతో పటీదార్ భారీ షాట్లతో చెలరేగాడు. మరోవైపు నూర్ అహ్మద్ బౌలింగ్‌లో లివింగ్ స్టోన్(10) ఓ భారీ సిక్సర్ కొట్టి మరుసటి బంతికే క్లీన్ బౌల్డ్ అయ్యాడు. క్రీజులోకి వచ్చిన జితేశ్ శర్మ.. వచ్చి రావడంతోనే భారీ సిక్సర్ కొట్టాడు. రజత్ పటీదార్.. ఖలీల్ అహ్మద్ బౌలింగ్‌లో ఓవర్ బ్యాక్‌వార్డ్ పాయింట్ దిశగా బౌండరీ బాది 30 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

భారీ షాట్ ఆడే క్రమంలో జితేశ్ శర్మ(12) క్యాచ్‌ ఔట్‌గా వెనుదిరిగాడు. బ్యాటింగ్‌కు వచ్చిన టీమ్ డేవిడ్ తొలి బంతినే బౌండరీకి తరలించాడు. పటీదార్‌ జోరుకు మతీష పతీరణ బ్రేక్ వేసాడు. అదే ఓవర్‌లో కృనాల్ పాండ్యా(0)ను డకౌట్ చేశాడు. దాంతో ఈ ఓవర్‌లో రెండు వికెట్లు తీసిన పతీరణ.. ఒకే ఒక్క పరుగు ఇచ్చాడు. ఆఖరి ఓవర్‌లో టీమ్ డేవిడ్ వరుసగా మూడు సిక్స్‌లు బాది జట్టుకు భారీ స్కోర్ అందించాడు.

Story first published: Friday, March 28, 2025, 21:20 [IST]
Other articles published on Mar 28, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+