CSK vs RCB: రాక్‌స్టార్ జడేజా.. చివరి ఓవర్లో 37 రన్స్.. బెంగళూరుకు భారీ లక్ష్యం!

ముంబై: రవీంద్ర జడేజా(28 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లతో 62 నాటౌట్) చివరి ఓవర్‌లో ఐదు సిక్సర్లు బాది 37 రన్స్ పిండుకోవడంతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) ముందు చెన్నై సూపర్ కింగ్స్ 192 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. జడ్డూ పరుగుల సునామీకి ఫాఫ్ డూప్లెసిస్ (41 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 50)క్లాస్ ఇన్నింగ్స్ తోడవడంతో చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 191 పరుగులు చేసింది. హర్షల్ పటేల్ వేసిన చివరి ఓవర్లో వరుసగా 6, 6, 7నోబ్, 6, 2, 6, 4తో చెలరేగిన జడ్డూ 37 పరుగులు పిండుకున్నాడు. దాంతో సాధారణ స్కోర్‌కే పరిమితమవుతుందనుకున్న సీఎస్‌కే భారీ స్కోర్ చేసింది. ఆర్‌సీబీ బౌలర్లలో హర్షల్ పటేల్ (3/51) మూడు వికెట్లు తీయగా.. చాహల్ ఓ వికెట్ తీసాడు.

గుడ్ స్టార్ట్..
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్‌కు ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్, ఫాఫ్ డూప్లెసిస్ మంచి శుభారంభాన్ని అందించారు. సిరాజ్ వేసిన ఫస్ట్ ఓవర్‌లోనే బౌండరీల ఖాతా తెరిచిన డూప్లెసిస్.. అతని మరుసటి ఓవర్‌లో మరో భారీ సిక్సర్ కొట్టి జోరు కనబర్చాడు. అదే ఓవర్‌లో బౌండరీతో గైక్వాడ్ టచ్‌లోకి వచ్చాడు. ప్రతీ ఓవర్‌లో ఈ జోడీ బౌండరీలు బాదడంతో చెన్నై పవర్ ప్లే ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 51 రన్స్ చేసింది. పవర్ ప్లే అనంతరం కూడా వీరి జోరు కొనసాగింది. క్రీజులో ప్రమాదకరంగా మారిన ఈ జోడీని చాహల్ విడదీసాడు. గైక్వాడ్‌ను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చి 74 పరుగుల భాగస్వామ్యానికి తెరదించాడు.

డూప్లెసిస్ ఫిఫ్టీ..
ఫస్ట్ డౌన్ బ్యాట్స్ సురేశ్ రైనా ఆదిలోనే చాహల్ అలసత్వంతో రనౌటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. అనంతరం ఓ భారీ సిక్సర్ కొట్టిన రైనా.. క్రిస్టియన్, సుందర్ బౌలింగ్‌లో ఫోర్, సిక్సర్ కొట్టి జోరు కనబర్చాడు. హర్షల్ పటేల్ వేసిన 14 ఓవర్ తొలి బంతికి క్విక్ సింగిల్‌తో 40 బంతుల్లో డూప్లెసిస్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ సీజన్‌లో అతనికిది సెకండ్ ఫిఫ్టీ. అదే ఓవర్ నాలుగో బంతికి సురేశ్ రైనా(24) మిడ్ వికెట్ మీదుగా భారీ షాట్ ఆడి క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. క్రీజులోకి రాయుడు రాగా.. ఆ మరుసటి బంతికే డూప్లెసిస్ కూడా క్రిస్టియన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఇక సుందర్ వేసిన ఆ మరుసటి ఓవర్‌లో జడేజాకు లైఫ్ దొరికింది. డీప్ మిడ్ వికెట్ మీదుగా అతను భారీ షాట్ ఆడగా.. ఆ దిశలో ఫీల్డింగ్ చేస్తున్న క్రిస్టియన్ సునాయస క్యాచ్‌ను నేలపాలు చేశాడు.

జడేజా సిక్సర్లు..
ఈ చాన్స్‌తో చెలరేగిన జడేజా జేమీసన్ వేసిన 16 ఓవర్లో వరుసగా రెండు బౌండరీలు బాదాడు. రాయుడు కూడా ఓ భారీ సిక్సర్ కొట్టడంతో ఆ ఓవర్‌లో 17 రన్స్ వచ్చాయి. భారీ షాట్లతో విరుచుకుపడుతున్న ఈ జోడీని విడదీసేందుకు కెప్టెన్ విరాట్.. మళ్లీ హర్షల్ పటేల్‌ను రంగంలోకి దింపాడు. అతను వేసిన ఔట్ సైడ్ ఆఫ్ కట్టర్‌ను ఫైన్ లెగ్ మీదుగా భారీ షాట్ ఆడే ప్రయత్నం చేసిన రాయుడు.. జేమీసన్ చిక్కాడు. దాంతో క్రీజులోకి ధోనీ రాగా.. 19 ఓవర్ వేసిన సిరాజ్ 9 రన్సే ఇచ్చాడు. హర్షల్ పటేల్ వేసినా ఆఖరి ఓవర్‌లో జడేజా వరుసగా నాలుగు సిక్స్‌లు కొట్టి 26 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అనంతరం మరో సిక్స్, బౌండరీ కొట్టడంతో ఈ ఓవర్‌లో 37 రన్స్ వచ్చాయి. దాంతో చెన్నై 191 పరుగుల భారీ స్కోర్ చేసింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications