For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

CSK vs RCB: అందుకే తుది జట్టులో ఒక మార్పు చేశాం: రజత్ పటీదార్

ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ)తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్‌కే) టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. డ్యూ ప్రభావం నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నానని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ తెలిపాడు. 'గత మ్యాచ్ కంటే ఈ వికెట్ బాగుంటుంది. ఎంత లక్ష్యమైనా చేధించాలనుకుంటున్నాం. ఇప్పటికైతే డ్యూ లేదు. కానీ ఎప్పుడైనా రావచ్చు. అది మన నియంత్రణలో లేని విషయం. కానీ అందుకు తగ్గ ప్రణాళికలతో సిద్దంగా ఉండటం ఉత్తమం. గత మ్యాచ్‌లో ఫీల్డింగ్ విషయంలో మేం కాస్త తడబడ్డాం. అది మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉంది. తుది జట్టులో ఒక మార్పు చేశాం. నాథన్ ఎల్లిస్ స్థానంలో పతీరణ జట్టులోకి వచ్చాడు.'అని రుతురాజ్ గైక్వాడ్ తెలిపాడు.

CSK vs RCB IPL 2025 Rajat Patidar reveals the resaon Why RCB Playing XI changed

మరోవైపు టాస్ గెలిస్తే తాము కూడా బౌలింగ్ ఎంచుకునేవాళ్లమని ఆర్‌సీబీ కెప్టెన్ రజత్ పటీదార్ అన్నాడు. పిచ్ కాస్త కఠినంగా కనిపిస్తోందని తెలిపాడు. మా ఆట తీరులో పెద్ద తేడా ఏం ఉండదు. ప్రతీ రోజు అత్యుత్తమ ప్రదర్శన కనబర్చడం ముఖ్యం. ఈ రోజు కూడా అదే జోరు కొనసాగించాలనుకుంటున్నాం. గత మ్యాచ్‌లో బౌలింగ్ విభాగం సత్తా చాటింది. కఠినమైన 13 ఓవర్ల తర్వాత అద్భుతంగా పోరాడింది. ఓపెనర్లు మంచి ఇంటెంట్‌తో ఆడారు. ఆర్‌సీబీ-సీఎస్‌కే పోరు అత్యుత్తమ మ్యాచ్. ఎందుకంటే ఇరు జట్లకు అభిమానుల మద్దతు ఆ స్థాయిలో ఉంటుంది. తుది జట్టులో ఒకే ఒక్క మార్పు చేశాం. రసిఖ్ సలామ్ స్థానంలో భువనేశ్వర్ కుమార్ తుది జట్టులోకి వచ్చాడు.'అని రజత్ పటీదార్ చెప్పుకొచ్చాడు.

తుది జట్లు:

ఆర్‌సీబీ: విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్, రజత్ పటీదార్(కెప్టెన్), దేవదత్ పడిక్కల్, లియామ్ లివింగ్ స్టోన్, జితేశ్ శర్మ, టీమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జోష్ హజెల్ వుడ్, యశ్ దయాల్

సీఎస్‌కే: రచిన్ రవీంద్ర, రుతురాజ్ గైక్వాడ్, రాహుల్ త్రిపాఠి, దీపక్ హుడా, శివమ్ దూబే, సామ్ కరణ్, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోనీ, అశ్విన్, మతీష పతీరణ, నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్.

Story first published: Friday, March 28, 2025, 19:40 [IST]
Other articles published on Mar 28, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+