CSK vs RCB: అనూజ్ రావత్, దినేశ్ కార్తీక్ సంచలన బ్యాటింగ్!
ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న సీజన్ ఓపెనర్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) 174 పరుగుల పోరాడే లక్ష్యాన్ని నమోదు చేసింది. యువ ప్లేయర్ అనూజ్ రావత్(25 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 48), దినేశ్ కార్తీక్(26 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 38 నాటౌట్) సంచలన బ్యాటింగ్‌తో ఆర్‌సీబీని ఆదుకున్నారు.
దాంతో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 173 పరుగులు చేసింది. కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్(23 బంతుల్లో 8 ఫోర్లతో 35) ధాటిగా ఆడగా.. విరాట్ కోహ్లీ(20 బంతుల్లో సిక్స్‌తో 21), రజత్ పటీదార్(0), గ్లేన్ మ్యాక్స్‌వెల్(0), కామెరూన్ గ్రీన్(18) దారుణంగా విఫలమయ్యారు.

సీఎస్‌కే బౌలర్లలో ముస్తాఫిజుర్ రెహ్మాన్(4/29) నాలుగు వికెట్లు తీయగా.. దీపక్ చాహర్ ఓ వికెట్ పడగొట్టాడు.
ముస్తాఫిజుర్ రెహ్మాన్ ధాటికి 78 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన ఆర్‌సీబీ 100 పరుగులైనా చేస్తుందా? అని అంతా అనుకున్నారు. కానీ అనూజ్ రావత్ సంచలన ప్రదర్శనతో జట్టును ఆదుకున్నాడు. మూడు భారీ సిక్స్‌లతో ఇన్నింగ్స్‌ను గాడినపెట్టాడు. కార్తీక్ సైతం అతనికి అండగా నిలవడంతో ఆర్‌సీబీ పోరాడే లక్ష్యాన్ని నమోదు చేసింది. ఈ ఇద్దరూ ఆరో వికెట్‌కు 95 పరుగులు జోడించారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications