Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

CSK vs PBKS: లివింగ్‌స్టోన్ విధ్వంసం.. చెన్నై ముందు కొండంత లక్ష్యం!

Punjab Kings ride on Liam Livingstone

ముంబై: లివింగ్ స్టోన్(32 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్‌లతో 60) విధ్వంసకర బ్యాటింగ్‌తో చెన్నై సూపర్ కింగ్స్ ముందు పంజాబ్ కింగ్స్ 181 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 180 పరుగులు చేసింది. లివింగ్‌స్టోన్‌కు అండగా శిఖర్ ధావన్(33), జితేశ్ శర్మ(26) రాణించారు. చెన్నై బౌలర్లలో డ్వేన్ ప్రిటోరియస్, క్రిస్ జోర్డాన్ రెండేసి వికెట్లు తీయగా.. ముఖేశ్ చౌదరి, డ్వేన్ బ్రావో, జడేజా తలో వికెట్ పడగొట్టారు.

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ కింగ్స్‌కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. ముఖేష్ చౌదరి వేసిన ఫస్ట్ ఓవర్ తొలి బంతినే బౌండరీకి తరలించి జోరు కనబర్చి కెప్టెన్ మయాంక్ అగర్వాల్.. రెండో బంతికే ఊతప్పకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రాజపక్స(9) జోర్డాన్ వేసిన రెండో ఓవర్‌లో భారీ సిక్సర్ బాది జోరు కనబర్చాడు. కానీ ఆ మరుసటి బంతికే ధోనీ మార్క్ కీపింగ్‌తో రనౌట్‌గా వెనుదిరిగాడు. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన లివింగ్ స్టోన్ ఉప్పెనలా విరుచుకుపడ్డాడు.

వచ్చి రావడంతోనే భారీ సిక్సర్ బాదిన అతను.. ముఖేశ్ చౌదరీ వేసిన ఐదు ఓవర్‌లో చుక్కలు చూపించాడు. తొలి బంతినే 108 మీటర్ల భారీ సిక్సర్ బాదిన ఈ ఇంగ్లీష్ బ్యాట్స్‌మన్.. ఆ తర్వాత మరో మూడు బౌండరీలతో పాటు భారీ సిక్సర్ బాది 26 పరుగులు పిండుకున్నాడు. అతనికి తోడుగా ధావన్ కూడా బ్యాట్ ఝులిపించడంతో పంజాబ్ పవర్‌ ప్లేలో 2 వికెట్ల నష్టానికి 72 పరుగులు చేసింది.

జడేజా వేసిన ఏడో ఓవర్‌లో తొలి బంతికే సిక్సర్ బాదిన లివింగ్ స్టోన్‌కు ఐదో బంతికి లైఫ్ లభించింది. అతను ఇచ్చిన సునాయస క్యాచ్ రాయుడు నేలపాలు చేశాడు. ప్రిటోరియస్ వేసిన మరుసటి ఓవర్‌లో లివింగ్ స్టోన్ ఇచ్చిన కష్టతరమైన క్యాచ్‌ను కీపర్ ధోనీ సూపర్ డైవ్‌తో అందుకున్నా బంతి నేలకు తాకింది. దాంతో మరో లైఫ్ అతనికి లభించింది. ఈ రెండు అవకాశాలతో మరింత చెలరేగిన లివింగ్ స్టోన్.. బ్రావో బౌలింగ్ మరో భారీ సిక్సర్ బాది 27 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

అదే ఓవర్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించిన ధావన్ (33) క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. దాంతో మూడో వికెట్‌కు నమోదైన 95 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ మరుసటి ఓవర్‌లోనే లివింగ్ స్టోన్‌ను జడేజా పెవిలియన్ చేర్చడంతో పంజాబ్ ఒక్కసారిగా డీలా పడింది. జితేశ్ శర్మ(26) మూడు సిక్స్‌లు బాదినా.. అతన్ని ప్రిటోరియస్ పెవిలియన్ చేర్చాడు. ఆ వెంటనే బిగ్ హిట్టర్లు షారుఖ్ ఖాన్(6), ఓడియన్ స్మిత్(3)‌లు కూడా ఔటవ్వడంతో పంజాబ్ స్కోర్ వేగం తగ్గింది. చివర్లో రాహుల్ చాహర్(12) భారీ షాట్లు ఆడటంతో పంజాబ్ 180 పరుగుల మార్క్ అందుకుంది.

Story first published: Sunday, April 3, 2022, 21:38 [IST]
Other articles published on Apr 3, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+