Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

CSK vs PBKS: 108 మీటర్ల సిక్స్‌తో లివింగ్‌స్టోన్ విధ్వంసం! పాపం చౌదరి.. ఒకే ఓవర్‌లో 26 పరుగులు..

CSK vs PBKS: Liam Livingstone Hits A Monsterous Six With 108 Metres Distance

ముంబై: ఐపీఎల్ 2022 సీజన్‌లో భాగంగా చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరుగుతున్న లీగ్ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ హిట్టర్ లియామ్ లివింగ్ స్టోన్ రికార్డు సిక్స్ బాదాడు. విధ్వంసకర బ్యాటింగ్‌తో ఆకాశమే హద్దుగా చెలరేగుతున్న లివింగ్ స్టోన్... 108 మీటర్ల భారీ సిక్సర్ బాదాడు. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ఇదే పెద్ద సిక్సర్. ముంబై ఇండియన్స్ జోస్ బట్లర్ 104 మీటర్ల సిక్స్ కొట్టగా.. ఆ రికార్డును లివింగ్ స్టోన్ బ్రేక్ చేశాడు. ముఖేశ్ చౌదరీ వేసిన 5వ ఓవర్ తొలి బంతికి లివింగ్ స్టోన్ ఈ ఘనతను అందుకున్నాడు. అతను వేసిన లెంగ్త్ బాల్‌ను డీప్ మిడ్ వికెట్ దిశగా భారీ సిక్సర్ బాదాడు.

CSK vs PBKS: Liam Livingstone Hits A Monsterous Six With 108 Metres Distance

ఆ తర్వాత మూడు బౌండరీలు బాదిన లివింగ్ స్టోన్.. చివరి బంతిని డీప్ మిడ్ వికెట్ దిశగా సిక్స్ కొట్టి 26 పరుగులు పిండుకున్నాడు. జడేజా వేసిన ఏడో ఓవర్‌లో తొలి బంతికే సిక్సర్ బాదిన లివింగ్ స్టోన్‌కు ఐదో బంతికి లైఫ్ లభించింది. అతను ఇచ్చిన సునాయస క్యాచ్ రాయుడు నేలపాలు చేశాడు. ప్రిటోరియస్ వేసిన మరుసటి ఓవర్‌లో లివింగ్ స్టోన్ ఇచ్చిన కష్టతరమైన క్యాచ్‌ను కీపర్ ధోనీ సూపర్ డైవ్‌తో అందుకున్నా బంతి నేలకు తాకింది. దాంతో మరో లైఫ్ అతనికి లభించింది. ఈ రెండు అవకాశాలతో మరింత చెలరేగిన లివింగ్ స్టోన్.. బ్రావో బౌలింగ్ మరో భారీ సిక్సర్ బాది 27 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దాంతో 10 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ 3 వికెట్ల నష్టానికి 109 పరుగులు చేసింది.

Story first published: Sunday, April 3, 2022, 20:40 [IST]
Other articles published on Apr 3, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+